అవార్డులంటే లెక్క లేకుండా పోయిందా?
సినీ ఇండస్ట్రీలో అవార్డులకు ఎప్పటినుంచో స్పెషల్ ప్లేస్ ఉంది. ఒక నటుడు లేదా టెక్నీషియన్ కెరీర్ లో సాధించిన కృషికి గుర్తింపుగా అవార్డులు భావిస్తారు.;
సినీ ఇండస్ట్రీలో అవార్డులకు ఎప్పటినుంచో స్పెషల్ ప్లేస్ ఉంది. ఒక నటుడు లేదా టెక్నీషియన్ కెరీర్ లో సాధించిన కృషికి గుర్తింపుగా అవార్డులు భావిస్తారు. ముఖ్యంగా ఒక అవార్డు అందుకోవడం అంటే కేవలం ట్రోఫీ కాదు, ఆ వ్యక్తి టాలెంట్ కు, హార్డ్ వర్క్ కు ఇచ్చే గౌరవం. అందుకే చిన్న చిన్న అవార్డులైనా, పెద్ద స్థాయి జాతీయ అవార్డులైనా సినీ ప్రముఖులు ఎంతో గర్వంగా స్వీకరిస్తూ ఉంటారు.
అయితే ఇటీవల ఒక తెలుగు స్టార్ హీరోయిన్ కు సంబంధించిన విషయం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. అవార్డుల విలువ తగ్గిపోయిందా? లేక సెలబ్రిటీల దృష్టిలో అవి ఇంపార్టెన్స్ కోల్పోయాయా? అనే ప్రశ్నలు తలెత్తేలా ఆ సంఘటన కనిపిస్తోంది. కొంతమంది ఆ వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అవార్డులు అంటే కేవలం షోపీస్ కాదని, అవి కృషికి గుర్తింపు అని గుర్తు చేస్తున్నారు. డబ్బుతో పోల్చడం సరైన విధానం కాదని అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు, కొందరు మాత్రం ఆ అంశాన్ని వేరే యాంగిల్ లో చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెలబ్రిటీలు తమ బ్రాండ్ వాల్యూ దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం సహజమేనని అంటున్నారు. ఇంకొందరు అవార్డుల క్రెడిబిలిటీపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ మధ్య కాలంలో అనేక అవార్డు కార్యక్రమాలు కమర్షియల్ ట్రెండ్ లో జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎవరికైనా అవార్డు ఇవ్వడం వెనుక క్రెడిబిలిటీ ఉందా లేదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు అవార్డులకు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం సహజమేనని అంటున్నారు. అసలేం జరిగిందంటే?
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ప్రతి సంవత్సరం నిర్వహించే ఓ ప్రముఖ అవార్డు కార్యక్రమం నిర్వాహకులు గత ఏడాది ఆ హీరోయిన్ ను అవార్డుతో సత్కరించాలని భావించారు. ఆమె అప్పటికే చేసిన సినిమాలు, యాక్టింగ్ ఆధారంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి నిర్వాహకులు ఆమె టీమ్ తో సంప్రదింపులు కూడా జరిపారు. ఈ క్రమంలో హీరోయిన్ తరఫున ఆమె తండ్రి స్పందించినట్లు సమాచారం. నిర్వాహకులు అవార్డు గురించి వివరించగా, ఆయన చెప్పిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందట.
ఇప్పటికే ఇంట్లో ఎన్నో అవార్డులు ఉన్నాయి, కొత్తగా ఇంకో ట్రోఫీ అవసరం లేదని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, అవార్డు బదులు ఏదైనా డబ్బులు ఇవ్వగలిగితే మంచిదని సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రెస్పాన్స్ తో నిర్వాహకులు ఆశ్చర్యం పోయినట్టు సమాచారం. చివరకు ఆమెకు అవార్డు ఇవ్వాలనే ఆలోచన విరమించుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ విషయం బయటకు రావడంతో సోషల్ మీడియాలో ఇప్పుడు చర్చ జరుగుతోంది.
మొత్తానికి ఆ సంఘటన ఒక్క హీరోయిన్ గురించి మాత్రమే కాదు, మొత్తం అవార్డు వ్యవస్థపై చర్చకు దారి తీసింది. అవార్డులు నిజంగా టాలెంట్ కు గుర్తింపుగా మిగిలిపోతాయా? లేక మెల్లగా వాటి వాల్యూ తగ్గిపోతుందా? అనే ప్రశ్నలకు సమాధానం మాత్రం కాలమే చెప్పాలి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ గా కనిపిస్తోంది. ఇండస్ట్రీలో మారుతున్న ట్రెండ్స్.. అవార్డులపై ఉన్న అభిప్రాయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి.