సినిమాలంటే అనుష్కకి బోర్ కొట్టేసింది!
'భాగమతి' రిలీజ్ అనంతరం స్వీటీ అనుష్క ఒక్కసారిగా వెండి తెరకు దూరమైన సంగతి తెలిసిందే.;
'భాగమతి' రిలీజ్ అనంతరం స్వీటీ అనుష్క ఒక్కసారిగా వెండి తెరకు దూరమైన సంగతి తెలిసిందే. నటిగా పుల్ స్వింగ్ లో ఉన్న సమయంలోనే గ్యాప్ తీసుకుంది. సాధారణంగా ప్లాప్ అయితే మరో సినిమా ఛాన్స్ కు సమయం పడుతుంది. ఈ క్రమంలో గ్యాప్ వస్తుంది. కానీ అనుష్క సక్సెస్ ల్లో ఉండి మరీ గ్యాప్ తీసుకుంది. దీంతో ఎన్నో రకాల సందేహాలు తెరపైకి వచ్చాయి.
అవకాశాలు రాలేదని...కావాలనే సినిమాలకు దూరంగా ఉంటుందని...పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉందని? అందుకే సినిమాలకు దూరంగా ఉంటుందనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై అనుష్క ఏ నాడు స్పందించలేదు. దీంతో ఏది నిజం? ఏది అబద్దం? అన్నది ప్రేక్షకుల ఊహకే వదిలేయాల్సి వచ్చింది. తాజాగా ఈ గ్యాప్ కు గల కారణాలను తొలిసారి రివీల్ చేసింది. 'భాగమతి' వరకూ వరుసగా సినిమాలు చేసి బోర్ కొట్టడం వల్లే విరామం తీసుకున్నట్లు వెల్లడిచింది.
ఉదయం లేచిన మొదలు రాత్రి వరకూ కెమెరా ముందుకు ఉండటం...సెట్స్ లో హడావుడి అంతా ఓ రకమైన జీవితంగా మారిపోయిందని...అందుకే కొన్నాళ్ల పాటు కెమారాకు దూరంగా ఉండాలని ఆలోచించుకునే గ్యాప్ తీసుకున్నట్లు తెలిపింది. నటిగా మాత్రం చాలా అవకాశాలు వచ్చాయంది. కానీ నటించే ఆసక్తి లేకపోవడంతో వదులుకున్నట్లు భావించింది. ఈ గ్యాప్ అన్నది తనను తాను రీచార్జ్ చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడిందని....ఇప్పుడు మళ్లీ ప్రెష్ గా పనిచేస్తోన్న ఫీలింగ్ కలుగుతుందని తెలిపింది.
అలాగే మరో ఇంట్రెస్టింగ్ విషయం కూడా తెలిపింది. అనుష్క హారర్ సినిమాల్లో నటించడం వరకే. వాటిని మాత్రం అస్సలు చూడనంటోంది. మరి 'అరుంధతి', 'భాగమతి' సినిమాలు చూడలేదా? అంటే అమ్మడు చూడనట్లే సమాధానం కనిపిస్తోంది. కానీ 'అరుంధతి' మాత్రం తన కెరీర్ ని మలుపు తిప్పిన గొప్ప చిత్రం గా చెప్పుకొచ్చింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నట్లు తెలిపింది.