• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనుపమ కిస్సుల గోల.. ఇక...

అనుపమ కిస్సుల గోల.. ఇక ఆపితే మంచిది!

| పక్కింటి అమ్మాయిగా ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీని సినిమాలో చూసి చాలా మంది అనుపమనేనా అని షాకయ్యారట

By - Tupaki Desk
Update: 2024-04-07 06:12 GMT

టిల్లు స్క్వేర్.. ఈ సినిమా పేరు వింటేనే ఇప్పుడు అందరికీ అనుపమ పరమేశ్వరనే గుర్తుకొస్తుంది. అంతలా సినిమాలో తన గ్లామర్, యాక్టింగ్ తో ఆకట్టుకుందీ బ్యూటీ. గ్లామర్ గేట్లు ఎత్తేసి లిల్లీ రోల్ లో అదరగొట్టేసింది. ఆడియన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. పక్కింటి అమ్మాయిగా ఇమేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీని సినిమాలో చూసి చాలా మంది అనుపమనేనా అని షాకయ్యారట.

కొందరు నెటిజన్లు.. అసలు సడెన్ గా బోల్డ్ రోల్ ను అనుపమ ఎందుకు ఎంచుకుందని తెగ ప్రశ్నించారు. నెట్టింట ట్రోల్స్ కూడా చేశారు. దీంతో హార్ట్ అయిన ఈ బ్యూటీ.. టిల్లు స్క్వేర్ కు చెందిన ఓ ఈవెంట్ కు కూడా హాజరు కాలేదు. కానీ మూవీ రిలీజయ్యాక మాత్రం అనుపమ.. పోస్ట్ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. థియేటర్లకు వెళ్లి అభిమానులతో సందడి చేస్తోంది. తెగ ఇంటర్వ్యూలు ఇస్తోంది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో టిల్లు స్క్వేర్ లో గ్లామరస్ రోల్ చేసినందుకు తనపై వస్తున్న ట్రోల్స్ పై ఘాటుగా స్పందించింది అనుపమ. లిప్ లాక్ సీన్ లో నటించడాన్ని ఏదో పెద్ద తప్పు చేస్తున్నట్లు అంతా విమర్శిస్తున్నారని చెప్పింది. తాను 18 ఏళ్ల వయసులో కిస్ సీన్స్ లో, గ్లామరస్ గా నటించనని చెప్పానని, ఇప్పుడు కాదని తెలిపింది. ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోయిన్ గా తాను చాలా పరిణితి చెందినట్లు క్లారిటీ ఇచ్చింది.

ఏదైనా సినిమా స్టోరీకి అవసరం అయితే లిప్ లాక్ లాంటి సన్నివేశాల్లో నటించడం అస్సలు తప్పు కాదని తెలిపింది అనుపమ. ఒకే జోనర్ రోల్స్ లో నటించడానికి బోరింగ్ గా ఉందని, అన్ని పాత్రలు చేయాలని చెప్పింది. సినిమా చూడకుండా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని సూచించింది. ముందు థియేటర్లలో మూవీ చేసి అప్పుడు ప్రశంసించడమో, విమర్శించడమో చేయండని ఫైర్ అయింది.

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది అనుపమ పరమేశ్వరన్. ఇటీవల మలయాళ మూవీ జానకి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ డబ్బింగ్ పూర్తి చేసింది. కోర్టు రూమ్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాటు సౌత్ లో మరిన్ని చిత్రాలు చేస్తోంది ఈ చిన్నది. మరి అనుపమ కొత్త మూవీలతో ఎలా అలరిస్తుందో చూడాలి.

Tags:    
  • Anupamaparameswaran 
  • Tillusquare 
  • Siddhujonnalagaddan 
  • Anupama 
  • Filmindustry 
  • Movieromance 
  • Trolling 
  • Tillusquaremovie 

Similar News

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

పెద్ద సినిమాల వల్ల ఎన్నో కష్టాలు.. అసలు సమస్య అదే?

2026-11-05 04:13 GMT

ఆ హీరో పాపం.. అనిరుధ్‌కి ఏం అన్యాయం చేశాడు?

2026-11-05 03:30 GMT

నిజంగా దెబ్బలు తిన్న హీరోయిన్.. కానీ అమ్మా నాన్నకి ఆ సినిమానే ఇష్టమంట..!

2026-11-05 02:31 GMT

ఇద్దరు తమిళ హీరోలు.. ఒక తెలుగు హీరో.. జరగబోనుంది ఏమిటి..?

2026-11-05 02:30 GMT

టాలీవుడ్ రెండు లెజెండరీ ఫ్యామిలీలతో మెగాస్టార్..!

2026-11-05 01:30 GMT

'జైలర్ 2' విజువల్స్ కొత్తగా కనిపించడానికి వాడిన టెక్నిక్ ఏంటంటే?

2026-11-05 00:30 GMT

సుకుమార్ రామ్ చరణ్ ను రంగస్థలం లో చెవిటి వాడిగా చూపించాడు. ఇప్పుడెలా చూపిస్తున్నాడో తెలుసా?

2026-11-04 23:30 GMT

Tollywood: చిన్న తప్పు కూడా పెద్ద ముప్పే!

2026-11-04 22:30 GMT

చిరంజీవి, బాలయ్య, వెంకటేష్, నాగార్జున కాంబోలో మూవీ రాబోతోందా?

2026-11-04 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS