అనుపమ ఎక్కడ మిస్టేక్ చేస్తోంది?

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి ‘ప్రేమమ్’, ‘అ ఆ’, ‘శతమానంభవతి’ వంటి సినిమాలతో యూత్‌కు విపరీతంగా దగ్గరైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.

Update: 2026-09-08 06:23 GMT

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చి ‘ప్రేమమ్’, ‘అ ఆ’, ‘శతమానంభవతి’ వంటి సినిమాలతో యూత్‌కు విపరీతంగా దగ్గరైన హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. అందం, నటన రెండూ ఉన్నా కూడా ఆమెకు ఇంకా 'స్టార్ హీరోయిన్' ట్యాగ్ రాకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటున్నా, మిగతా యంగ్ భామల స్పీడ్‌తో పోలిస్తే అనుపమ ఎక్కడో వెనకబడిపోతోందనే చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా సాగుతోంది. అసలు ఆమె ఎక్కడ మిస్టేక్ అన్నది చూద్దాం..

హిట్లు ఉన్నా క్రేజ్ పెరగడం లేదా?:

అనుపమ కెరీర్‌లో విజయాలకి తక్కువేమీ లేదు. ‘రాక్షసుడు’, ‘కార్తికేయ 2’, ‘టిల్లు స్క్వేర్’ తో పాటు గత ఏడాది వచ్చిన ‘బైసన్’, ‘కిష్కింధపురి’ లాంటి చిత్రాలు ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చాయి. అయితే ఈ హిట్లన్నీ హీరోల క్రేజ్ వల్ల లేదా కాన్సెప్ట్ ఆధారంగా వచ్చిన విజయాలే కానీ, అనుపమ సోలో క్రేజ్‌ను పెంచేవిగా మారలేకపోయాయి. ఇక కంటెంట్ బాగుండి హిట్ సాధిస్తున్నప్పటికీ, ఒక స్టార్ హీరోయిన్‌కు ఉండే రేంజ్ అప్పీల్ ఆమెకు దక్కడం లేదనేది వాస్తవం.

కథల ఎంపికలోనే ప్రధాన లోపమా?:

అనుపమ ఎక్కువగా పెర్ఫార్మెన్స్‌కు ప్రాధాన్యమున్న పాత్రలనే ఎంచుకుంటుంది. కానీ టాలీవుడ్ కమర్షియల్ ఫార్మాట్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ రావాలంటే బడ్జెట్ సినిమాలు, అగ్ర కథానాయకుల సరసన నటించడం చాలా అవసరం. ఇక మమితా బైజు, ఖయాదు లోహర్ వంటి భామలు సరైన కమర్షియల్ ప్రాజెక్టులతో దూసుకుపోతుంటే, అనుపమ మాత్రం ప్రయోగాత్మక చిత్రాలు లేదా పక్కింటి అమ్మాయి పాత్రలకే ఎక్కువ పరిమితం కావడం వల్ల ఆమె స్టార్ డమ్ రేసులో వెనకపడుతోంది.

చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు:

ప్రస్తుతం అమ్మడి చేతిలో కొన్ని ఆసక్తికరమైన సినిమాలు లైన్‌లో ఉన్నాయి. తరుణ్ భాస్కర్ కాంబినేషన్‌లో వస్తున్న 'క్రేజీ కళ్యాణం' టీజర్‌తో ఇప్పటికే మంచి బజ్ తెచ్చుకుంది. ఇక దీంతో పాటు పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం 'భోగి' కూడా నిర్మితమవుతోంది. ఈ కొత్త కథలతోనైనా ఆమె బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

మాస్ అప్పీల్ మరియు మార్కెట్ రేంజ్:

స్టార్ ఇమేజ్ రావాలంటే కమర్షియల్ సినిమాల్లో డాన్స్, గ్లామర్, మాస్ ఆడియన్స్‌ను మెప్పించే ఎలిమెంట్స్ చాలా ముఖ్యం. 'టిల్లు స్క్వేర్' లో గ్లామరస్ మేకోవర్ ఇచ్చినప్పటికీ, దానిని వరుస బిగ్ ప్రాజెక్టులుగా మలుచుకోవడంలో ఆమె విఫలమైంది. ఇక నటన విషయంలో ఎలాంటి వంకలు పెట్టలేకపోయినా, బిగ్ లీగ్ స్టార్స్‌తో వరుస ప్రాజెక్టులు సైన్ చేయకపోవడమే ఆమె పాలిట శాపంగా మారింది.

ఏది ఏమైనా అనుపమ పరమేశ్వరన్ టాలెంట్ ఉన్న నటి అనడంలో ఎలాంటి సందేహం లేదు. కథల ఎంపికలో కొద్దిగా కమర్షియల్ యాంగిల్ కూడా జోడించి, సరైన సోలో బ్లాక్ బస్టర్ హిట్ కొడితే ఆమె స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోవడం ఖాయం. ఇక రాబోయే 'క్రేజీ కళ్యాణం', 'భోగి' చిత్రాలు అనుపమ కెరీర్‌కు ఎలాంటి టర్నింగ్ పాయింట్ ఇస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News