కమర్షియల్ సినిమాలో 1000 తప్పులున్నా పట్టించుకోరు - అనుపమ
అనుపమ పరమేశ్వరన్.. మలయాళీ ముద్దుగుమ్మ అయినటువంటి అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తాజాగా 'పరదా' అనే లేడి ఓరియెంటెడ్ మూవీతో మన ముందుకు వచ్చింది.;
అనుపమ పరమేశ్వరన్.. మలయాళీ ముద్దుగుమ్మ అయినటువంటి అనుపమ తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తాజాగా 'పరదా' అనే లేడి ఓరియెంటెడ్ మూవీతో మన ముందుకు వచ్చింది. అయితే ఇన్ని రోజులు హీరోల సరసన నటించి సాంప్రదాయ బద్ధమైన హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. సడన్ గా టిల్లు స్క్వేర్, రౌడీ బాయ్స్ అనే సినిమాలతో గ్లామర్ డాల్ గా మారిపోయింది. ఈ రెండు సినిమాల్లో అనుపమ హాట్ రొమాన్స్ చేయడంతో ఆమె అభిమానులు సైతం షాక్ అయ్యారు.అలా అనుపమ అంటే కేవలం ట్రెడిషనల్ రోల్స్ మాత్రమే కాదు బోల్డ్ పాత్రలు కూడా చేస్తుంది అని ఈ సినిమాలతో ప్రూవ్ చేసింది.
కమర్షియల్ మూవీలపై అనుపమ కామెంట్..
అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా పరదా అనే సినిమాతో మన ముందుకు వచ్చింది. ప్రవీణ్ కండ్రేవుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవల మంచి టాక్ తెచ్చుకోగా.. దీనికి సక్సెస్ మీట్ నిర్వహించారు మేకర్స్. ఇందులో సంచలన వ్యాఖ్యలు చేసింది అనుపమ. మరి అనుపమ కామెంట్లు ఎవరిని ఉద్దేశించి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
వెయ్యి తప్పులున్నా.. కమర్షియల్ సినిమాలలో అవి కనిపించవు..
ఆగస్టు 22న అనుపమ నటించిన పరదా మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో కలెక్షన్లు కూడా భారీగానే వస్తున్నట్లు తెలుస్తోంది. అలా తాజాగా పరదా మూవీ సక్సెస్ మీట్ నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్న అనుపమ పరమేశ్వరన్ ఇండస్ట్రీలోని కొంతమందిని టార్గెట్ చేస్తూ షాకింగ్ కామెంట్లు చేసింది. అనుపమ మాట్లాడుతూ..
"కమర్షియల్ సినిమాల్లో 1000 తప్పులు ఉన్నా అస్సలు పట్టించుకోరు. కానీ పరదా లాంటి ఒక ప్రయోగాత్మక సినిమాని మాత్రం ప్రతి విషయంలో విమర్శిస్తూ ఉంటారు. కమర్షియల్ సినిమాలు వాళ్లకు నచ్చితే చాలు ఎన్ని తప్పులున్నా పట్టించుకోరు. కానీ పరదా లాంటి సినిమాను మాత్రం అన్ని విషయాల్లో విమర్శిస్తారు. ఎందుకంటే ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి.. ఈ సినిమా ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని విమర్శిస్తారు. భూతద్దంలో పెట్టి మరీ చూస్తారు. అయితే అది ఓకే.. నేను దాన్ని తప్పు పట్టడం లేదు.కానీ కనీసం ఇలాంటి సినిమాలు చేసినందుకు అభినందిస్తే చాలు. వాళ్లు చేసిన కొత్త ప్రయోగాన్ని గుర్తిస్తే చాలు" అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అనుపమ..
పరదా వెనుక ఇంత కష్టమా?
అనుపమ మాట్లాడిన మాటలను చాలామంది సమర్థిస్తున్నారు. ఎందుకంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలను దర్శకత్వం వహించడానికి గానీ.. డిస్ట్రిబ్యూట్ చేయడానికి గానీ.. నిర్మించడానికి గానీ ఎవరు కూడా ముందుకు రారు.. ఇవన్నీ పరదా సినిమా సమయంలో అనుపమ ఫేస్ చేసింది.. కాబట్టే తన మనసులో ఉన్న విషయాన్ని ఈ సక్సెస్ మీట్ లో బయట పెట్టింది.. అంతేకాదు పరదా మూవీ షూటింగ్ ఏడాది క్రితమే పూర్తయినప్పటికీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చివరికి ఆగస్టులో విడుదల చేసుకోవడానికి లైన్ క్లియర్ అయిందట. అందుకే అనుపమ తన బాధనంతా సక్సెస్ మీట్ లో బయట పెట్టుకుంది.
పరదా మూవీ విశేషాలు..
పరదా మూవీ విషయానికి వస్తే.. అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్ పోషించగా.. దర్శనా రాజేంద్రన్, సంగీతలు కీలకపాత్రల్లో నటించారు. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్లలో విడుదలైంది.