అప్పుడు అసిస్టెంట్..నేడు లెజెండ్ తో సినిమా!
బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు.;
బాలీవుడ్ లెజెండరీ నటుడు అనుపమ్ ఖేర్ ప్రయాణం గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిథ్యమైన పాత్రలతో ప్రేక్షకులను కొన్ని దశాబ్దాలగా అలరిస్తున్నారు. మూడు తరాల నటులతో కలిసి పనిచేసిన లెజెండ్. బాలీవుడ్ సహా ఇతర భాషల్లో కూడా తనదైన ముద్ర వేసారు. `కార్తికేయ2` లో ఓ కీలక పాత్ర పోషించి నెటి జనరేషన్ తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన సంగతి తెలిసిందే. నటుడిగా ఇప్పటికే ఆయన 548 చిత్రాలు దిగ్విజయంగా పూర్తిచేసారు. మూడు షిప్టులు పని చేసిన నటుడాయన. తాజాగా 549వ చిత్రాన్ని ప్రకటించారు.
కొన్ని దశాబ్దాల తర్వాత:
ఈ చిత్రాన్ని స్వీయా దర్శకత్వంలో నిర్మించడానికి సూరజ్ బర్జాత్యా ముందుకొచ్చారు. సూరజ్ బర్జాత్యా అంటే అందరికీ తెలిసిన వ్యక్తి. కానీ అనుపమ్ ఖేర్ కి మాత్రం ఓ అసిస్టెంట్ డైరెక్టర్ గా పరిచమయ్యాడని ఎంతమందికి తెలుసు? అవును ఈ విషయాన్ని అనుపమ్ స్వయంగా వెల్లడించారు. అనుపమ్ ఖేర్ తొలి సినిమా కి సూరజ్ ఐదవ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసారు. అలా ఇద్దరి ప్రయాణం కొన్ని దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. కానీ ఆ తర్వాత మళ్లీ కలిసి సినిమాలు చేయలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ ఇంత కాలానికి అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రలో ఓ సినిమా చేయడంపై పెద్దాయన సంతోషం వ్యక్తం చేసారు.
70 ఏళ్లు అయినా అదే స్పీడ్:
అనుపమ్ తో ఉన్న నాటి సంగతుల్ని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆయనతో పనిచేయడం సృజనాత్మకతతో కూడిన అద్భుతమైన ప్రయాణం గా భావిస్తున్నాను అని రాసుకొచ్చారు. ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు? అనే విషయం తప్ప ఇంకే వివరాలు వెల్లడించలేదు. ఇతర తారాగణం, టెక్నికల్ బృందానికి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. అనుపమ్ ఖేర్ వయసు 70 ఏళ్లు అయినా? ఆయన సినిమాలు చేసే స్పీడ్ చూస్తే ఆ వయసులో సగం వేగాన్ని చూపిస్తుంటారు.
ఒకే భాషకు పరిమితం కాని నటుడు:
తెలుగు ప్రేక్షకులకు అనుపమ్ ఖేర్ కొన్ని దశాబ్దాల క్రితమే పరిచయం. 1987లో `త్రిమూర్తులు` సినిమాతోనే టాలీవుడ్ లో లాంచ్ అయ్యారు. ఆ తర్వాత చాలా కాలానికి నిఖిల్ హీరోగా తెరకెక్కిన `కార్తికేయ2 `తో రీలాంచ్ అయ్యారు. అనంతరం `టైగర్ నాగేశ్వరరావు`, `హరిహరవీరమల్లు` లాంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం మరో తెలుగు సినిమా `ఇండియా హౌస్` లోనూ నటిస్తున్నారు. ఇతర భాషల్లో కూడా అనుపమ్ ఱఖేర్ ప్రయాణం కొనసాగుతుంది. మాతృ భాషకే పరిమితం కాకుండా అన్ని భాషల్లో సినిమాలు చేయడం పెద్దాయన ప్రత్యేకత.