జాతిరత్నం తో అవకాశం..ఏవరో అదృష్టవంతురాలు!
కానీ అతడిలో మరో యాంగిల్ కూడా ఉందని తెలియదు. అనుదీప్ అన్ని జానర్లలలో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించాడు.;
యువ దర్శకుడు అనుదీప్ కే.వి చిత్రాలు ఎలా ఉంటాయి? అన్నది చెప్పాల్సిన పనిలేదు. `జాతిరత్నాలు`తో తనలో అసలైన కమెడియన్ బయటకొచ్చాడు. ఆ సినిమా విజయం అనుదీప్ కు ఇండస్ట్రీ సహా ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ను తెచ్చి పెట్టింది. కామెడీ చిత్రాలు తెరమరుగైపోతున్నాయి? మళ్లీ అలాంటి కామిడ్ డైరెక్టర్లు రారు? అనుకుంటోన్న సమయంలో అనుదీప్ రూపంలో ఓడైరెక్టర్ దొరికాడు. తొలి చిత్రం `పిట్టగోడ`తోనే తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా రీచ్ అవ్వలేదు. `జాతిరత్నాలు` విజయంతోనే బాగా ఫేమస్ అయ్యాడు.
ఆ విజయం ఏకంగా కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్ ను డైరెక్ట్ చేసే అవకాశం తెచ్చి పెట్టింది. ఇద్దరి కాంబినేషన్ లో `ప్రిన్స్` అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు. త్వరలో `ఫంకీ`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన చిత్రమిది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో మంచి హైప్ క్రియేట్ అయింది. ఇదీ కామెడీ ఎంటర్ టైనరే. అనుదీప్ కొన్ని రియల్ క్యారెక్టర్స్ ఆధారంగా ఈ చిత్రాన్ని మలుస్తున్నాడు. ఇలా మూడు సినిమాలతో అనుదీప్ కేవలం కామెడీ డైరెక్టర్ గా హైలైట్ అయ్యాడు.
కానీ అతడిలో మరో యాంగిల్ కూడా ఉందని తెలియదు. అనుదీప్ అన్ని జానర్లలలో సినిమాలు చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించాడు. హారర్, యాక్షన్ సహా విభిన్న జానర్లలో సినిమాలు చేస్తానని వెల్లడించాడు. తానుప్రేక్షకులకు చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయంటున్నాడు. ఇకపై తన నుంచి వచ్చే ప్రతీ సినిమాలోనూ ఓ మార్పు ఉంటుందన్నాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం రివీల్ చేసి షాక్ ఇచ్చాడు. లేడీ ఓరియేంటెడ్ చిత్రం కూడా చేస్తానన్నారు. తదుపరి తన సినిమా ఇదే నన్నాడు. ఇంత వరకూ ఈ విషయాన్ని ఎక్కడా రివీల్ చేయలేదు.
దీంతో అనుదీప్ ఫాలోవర్లకు ఇదో షాకింగ్ న్యూస్ లా మారింది. అనుదీప్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. తాను తీసే లేడీ ఓరియేంటెడ్ చిత్రం కామెడీ జానర్లో ఉంటుందా? సీరియస్ గా సాగే కథై ఉంటుందా? అని అడుగుతున్నారు. ఈ సినిమాలో భాగమయ్యే హీరోయిన్ మాత్రం నిజంగా లక్కీ గాళ్ అవుతుందంటున్నారు. అనుదీప్ లాంటి కామిక్ పర్సన్ తో పనిచేస్తే సమయమే తెలియదు. అతడితో పనిచేసే నటీనటులు కూడా అంతే కామిక్ గా ఉంటే సింక్ అవ్వడం సులభమవుతుంది. జాతిరత్నాలు నటి ఫరియా అబ్దుల్లా ఆ పాత్రకు పర్పెక్ట్ గా ఎంపికైన నేపథ్యంలో లేడీ ఓరియేంటెడ్ చిత్రానికి తననే తీసుకుంటాడా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.