స్టార్ హీరోలతో కలిసి రాలే..మరి ఈ రకంగానైనా?
టాలీవుడ్ లో అను ఇమ్మాన్యుయేల్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు పనిచేసిందంతా స్టార్ హీరోలతోనే.;
టాలీవుడ్ లో అను ఇమ్మాన్యుయేల్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. అమ్మడు పనిచేసిందంతా స్టార్ హీరోలతోనే. నాని, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్., గోపీచంద్, శర్వానంద్, నాగచైతన్య లాంటి స్టార్ హీరోలకు జోడీగా నటించింది. కోలీవుడ్ లో విశాల్, శివ కార్తికేయన్, కార్తీ లాంటి స్టార్ హీరోలతో ఆడిపాడింది. కానీ ఇవేవి కూడా అమ్మడి కెరీర్ కి కలిసి రాలేదు. వాళ్లతో నటించిన సినిమాలన్నీ ఆశించిన ఫలితాలు సాధించలేదు. బాక్సాఫీస్ వద్ద నిరుత్సా హాన్నే మిగిల్చాయి. అయినా దాదాపు తొమ్మిదేళ్ల పాటు, నటిగా ఏదో సినిమాతో ప్రేక్షకుల మధ్యలోనే ఉంది.
రెండేళ్ల గ్యాప్ అనంతరం:
కానీ రెండేళ్లగా అను జాడ ఎక్కడా కనిపించలేదు. చివరిగా కార్తీ హీరోగా నటించిన `జపాన్` లో నటించింది. ఆ సినిమా ప్లాప్ తర్వాత అమ్మడు కనిపించలేదు. దీంతో అను తిరిగి స్టేట్స్ వెళ్లిపోయిందా? మరో వృత్తిలో స్థిర పడిందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా 'ది గర్ల్ ప్రెండ్' లో కీలక పాత్రకు ఎంపికైంది. ఇందులో రష్మికా మందన్నా లీడ్ రోల్ పోషిస్తుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రష్మికకు పాన్ ఇండియాలో గుర్తింపు ఉండటంతో ఈ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకంగా మారింది. సినిమా సక్సస్ అయితే అందరికీ మంచి పేరొస్తుంది.
సెకెండ్ ఇన్నింగ్స్ లో కొత్తగా:
అయితే ఈ సినిమాతో అను ఇమ్మాన్యూయేల్ కెరీర్ కూడా కొత్త టర్నింగ్ తీసుకున్నట్లే. ఒకసారి కీలక పాత్రలకు ఎంట్రీ ఇస్తే మళ్లీ హీరోయిన్ అవకాశాలు కష్టం. టాలీవుడ్ లో ఇదో సెంటిమెంట్ గా కనిపిస్తుంది. కీలక పాత్రధారిని హీరోయిన్గా ఏ దర్శక, నిర్మాత అంగీకరించరు. మళ్లీ క్యామియో పాత్రలు..కీలక పాత్రలు ఇవ్వడానికే చూస్తారు తప్ప హీరోయిన్ ఛాన్స్ అంటే నిర్మొహమాటంగా నో చెప్పేస్తారు. మరి కీలక పాత్ర ధారిగానైనా అను బిజీ అవుతుందా? అన్నది చూడాలి. సినిమాలో `దుర్గ` అనే బోల్డ్ పాత్రలో అనుఇమ్మాన్యూయేల్ కనిపించనుంది.
పర్పెక్ట్ రోల్ తో కొత్త ప్రయాణం:
ఇలాంటి పాత్రలకు పర్పెక్ట్ బ్యూటీ. ఇప్పటికే అమ్మడిపై ఆరకమైన ఇమేజ్ ఉండనే ఉంది. ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే బోల్డ్ పాత్రలకు పర్పెక్ట్ గా సెట్ అవుతుందనే ప్రచారం జరిగింది. కానీ అందుకు భిన్నమైన పాత్రలు అందుకుంది. తాజా సన్నివేశం నేపథ్యంలో పర్పెక్ట్ రోల్ పడిందంటూ ఓనెటి జనుడు పోస్ట్ పెట్టాడు. ఈ తరహా పాత్రలతో విదేశీ బ్యూటీ కెరీర్ కొత్త టర్నింగ్ తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.