• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గ‌ర్భంతో ఆలియా సాహ‌సంపై...

గ‌ర్భంతో ఆలియా సాహ‌సంపై ఓపెనైన శిక్ష‌కురాలు

| తాజా ఇంటర్వ్యూలో గర్భవతిగా ఉన్నప్పుడు అలియా భట్‌కు శిక్షణ ఇచ్చిన విషయాన్ని అన్షుక పర్వాణి గుర్తుచేసుకుంది.

By - Tupaki Desk
Update: 2024-09-25 17:30 GMT

ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆలియా, హిందీతో పాటు ఆంగ్ల చిత్రంలోను న‌టించిన అనుభ‌వ‌జ్ఞురాలు. `హార్ట్ ఆఫ్ స్టోన్`(2023) చిత్రంతో ఆలియా భట్ హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రీకరణ సమయంలో కుమార్తె రాహా త‌న గ‌ర్భంలో ఉంది. ఇటీవల అలియా శిక్షకురాలు షూటింగ్ సమయంలో ఆలియా తన గర్భంతో ఎలాంటి సాహ‌సాలు చేసిందో వెల్లడించారు. యాక్షన్ సన్నివేశాల కోసం అలియా `రిమోట్‌` లొకేష‌న్‌కి వెళ్లేందుకు ఎలా సాహ‌సించిందో తెలిపారు.

తాజా ఇంటర్వ్యూలో గర్భవతిగా ఉన్నప్పుడు అలియా భట్‌కు శిక్షణ ఇచ్చిన విషయాన్ని అన్షుక పర్వాణి గుర్తుచేసుకుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆ సమయంలో తాను ఆలియాతో కలిసి చిత్రీకరణ ప్రదేశానికి వెళ్లలేకపోయానని.. వారు రిమోట్‌గా వెళ్లి షూట్ చేసారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను ఎవరికీ శిక్షణ ఇవ్వనని, అయితే ఆలియాకు తన శరీరంపై అవగాహన ఉందని అన్షుక పేర్కొంది. తాను మాట్లాడుతూ ``సినిమా షూటింగ్ సమయంలో లేదా ఆ యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తున్నప్పుడు ఆమె గర్భవతి అని ఎవరూ చెప్పలేరని నేన‌నుకోను. అలియా ఒక గాలిలా సులువుగా త‌న ప‌నిలోకి ప‌ర‌కాయం చేసింది! అని తెలిపింది. రిమోట్ ఏరియా అంటే గ‌తుకుల రోడ్.. అడ‌వి మార్గం గుండా ప్ర‌యాణం గ‌ర్భిణుల‌కు ఎలాంటి రిస్కో తెలిసిన‌దే. కానీ ఆలియా సాహ‌సం చేసింద‌ని అంగీక‌రించాలి.

ట్రైనర్ అన్షుకా ప‌ర్వాణీ .. స్టార్ హీరోయిన్ అలియా వైఖరిని మెచ్చుకున్నారు. ఇది `సహజ ప్రక్రియ` అని ఆమెకు తెలుసు అని అన్నారు. కొన్ని మార్పులతో ఇది కేక్ వాక్ గా మారిందని అన్షుక పేర్కొంది. ఇది అంత సులభం కాదని, అయితే సరైన దృక్పథమే అంతిమంగా ముఖ్యమైనదని అన్షుక అంది. ఆలియా భట్ తన కుమార్తె రాహాను 6 నవంబర్ 2022న స్వాగతించింది. ఇటీవల తన భర్త రణబీర్ కపూర్ -త‌మ‌ బిడ్డతో కలిసి ఆలియా పారిస్‌కు బయలుదేరింది. వారితో పాటు నీతూ కపూర్ కూడా వచ్చింది. 23 సెప్టెంబర్ 2024న జరిగిన ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఆలియా అరంగేట్రం చేసింది. తన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచింది.

కెరీర్ విషయానికొస్తే... అలియా న‌టించిన‌ `జిగ్రా` విడుదలకు సిద్ధమవుతోంది. జైలు ఖైదీల‌ నేపథ్యంలో యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్ చిత్ర‌మిది. వేదాంగ్ రైనా తన సోదరుడుగా న‌టించాడు. త‌న సోద‌రుడిని రక్షించుకోవడానికి అలియా పాత్ర సత్య ఎంత‌గా కష్టపడింది? అన్న‌ది తెర‌పైనే చూడాలి. వాసన్ బాలా దర్శకత్వం వహించిన జిగ్రా అక్టోబర్ 11న థియేటర్లలో విడుదల కానుండగా, సెప్టెంబర్ 26న ట్రైలర్ రానుంది. వై.ఆర్.ఎఫ్‌ స్పై యూనివర్స్ లో ఆల్ఫా అనే చిత్రంలోను ఆలియా న‌టిస్తోంది. శార్వారీ వాఘ్ ఇందులో మ‌రో క‌థానాయిక‌.

Tags:    
  • Aliabhatt 
  • Bollywood 
  • Actress 
  • Anshukaparwani 
  • Actionsequences 
  • Heartofstone 

Similar News

టికెట్ రేట్ల వివాదం: తెలుగు రాష్ట్రాలు vs తమిళనాడు!

2026-11-05 19:30 GMT

రాజమౌళి మహాభారతం కృష్ణుడు, అర్జునుడు, దుర్యోధనుడిగా ఈ ముగ్గురు నటులు ఫిక్స్ అయ్యారా?

2026-11-05 18:30 GMT

సూపర్‌స్టార్లు స్వీయ భారం..నేటి తరం మాత్రం నిర్మాతలపై భారం!

2026-11-05 17:30 GMT

వారణాసి మహేష్ బాబు రాముడిగా ఎంత సేపు కనిపిస్తాడు...

2026-11-05 16:32 GMT

స్టెప్-మదర్ కాదు అంతకుమించి!

2026-11-05 16:30 GMT

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

Copyright @2026

Powered by Blink CMS