మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య త్రిముఖ పోరు!
టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య పోటీ అంటే? రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్-థమన్ లే గుర్తొస్తారు.;
టాలీవుడ్ లో మ్యూజిక్ డైరెక్టర్ల మధ్య పోటీ అంటే? రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్-థమన్ లే గుర్తొస్తారు. ఇద్దరి మధ్యా చాలా కాలంగా ఈ పోటీ కనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ పుల్ ఫాంలో ఉన్న సమయంలోనే థమన్ లాంచ్ అవ్వడం..సక్సస్ అవ్వడం అంతా వేగంగా జరిగిపోయింది. దీంతో అప్పటి వరకూ పోటీ లేదను కున్న డీఎస్పీకి థమన్ పోటీగా మారాడు. చివరకు ఆ పోటీ ఏ స్థాయికి చేరిందంటే? ఏకంగా డీఎస్పీ అవ కాశాలు సైతం తాను అందుకునే స్థాయికి థమన్ చేరుకున్నాడు. డీఎస్పీ కంటే థమన్ పారితోషికంలో ఓ మెట్టు తగ్గుతాడు అన్న పాజిటివ్ కోణం కూడా థమన్ కు కలిసొచ్చిన అంశంగా చెబుతుంటారు.
టాలీవుడ్ లో అనిరుద్ జోరు:
అలాగని డీఎస్పీ ఖాళీగా లేడు. తెలుగుతో పాటు తమిళ సినిమాలకు పని చేస్తూ బిజీగా ఉంటున్నాడు. సరిగ్గా ఇదే సమయంలో ఇద్దరి మధ్యలోకి వచ్చాడు తమిళ సంచలనం అనిరుద్ రవి చందర్. అప్పటి వరకు తమిళ సినిమాలకే సంగీతం అందించిన అనిరుద్ `దేవర` నుంచి టాలీవుడ్ లో ఫేమస్ అయి పోయాడు. మ్యూజికల్ గా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వడంతో అనిరుద్ పేరు మారు మ్రోగిపోయింది. అటు `కింగ్ డమ్` తో మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు.
ఈ నేపథ్యంలో థమన్, డీఎస్పీలతో పని చేసిన దర్శకులంతా కొత్తగా అనిరుద్ తో ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచనలో అతడి వైడపు చూడటం మొదలు పెట్టారు. ప్రస్తుతం నాని హీరోగా నటి స్తోన్న ప్యారడైజ్ కి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. `దేవర -2`, `టాక్సిక్` సినిమాలకు అనిరుద్ కొనసాగుతున్నాడు. కొన్ని కమిట్ మెంట్లకు సంబంధించి ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. కొంత మంది నిర్మాతల నుంచి అడ్వాన్సులు అందుకున్నట్లు సమాచారం. అనిరుద్ రాకతో దేవి శ్రీ ప్రసాద్, తమన్ వేగం కాస్త తగ్గినట్లు ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ముగ్గురు ఒకే వేగంతో:
సంగీతం పరంగా ఎవరి ప్రత్యేకత వారికున్నా? మ్యూజిక్ తోనే బొమ్మ ఆడించే సత్తా వంతుడిగా అనిరుద్ కి పేరుంది. కింగ్ డమ్ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినా? అనిరుద్ మ్యూజిక్ కారణంగా థియేటర్ కు వెళ్లిన ఆడియన్స్ ఎంతో మంది. ఈ విషయంలో మాత్రం మిగతా ఇద్దరి కంటే అనిరుద్ ని స్పెషల్ గానే భావిం చాలి. 'పుష్ప' చిత్రంతో దేవి శ్రీ ప్రసాద్ కి పాన్ ఇండియాలో గుర్తింపు వచ్చింది. దీంతో ఇతర భాషల్లో అవకాశాలు పెరుగుతున్నాయి. 'ఓజీ' సినిమాతో థమన్ కూడా పాన్ ఇండియాకి లాంచ్ అవుతున్నాడు. అటుపై 'అఖండ 2' తో థియేటర్లను అదే పాన్ ఇండియాలో మోతెక్కిస్తాడు. ఈ రెండు సినిమాల తర్వాత థమన్ పేరు మ్రోగుతుంది.