నెక్ట్స్ రెండు వారాల్లో అనిరుధ్ రచ్చ నెక్ట్స్ లెవెల్
అనిరుధ్ రవిచందర్ గురించి సౌత్ ఆడియన్స్ కు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. తన పేరు చెప్తే ఆయన మ్యూజిక్ అందించిన పాటలన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి.;

అనిరుధ్ రవిచందర్ గురించి సౌత్ ఆడియన్స్ కు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. తన పేరు చెప్తే ఆయన మ్యూజిక్ అందించిన పాటలన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. ఆల్రెడీ సక్సెస్‌ఫుల్ జర్నీని కొనసాగిస్తున్న అనిరుధ్‌కు ఈ జూన్ నెల మరింత స్పెషల్ కానుంది. జూన్ లో అనిరుధ్ నుంచి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు కొత్త ట్రాక్స్ రాబోతున్నట్టు తెలుస్తోంది.
అందులో మొదటిగా రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతున్నట్టు తెలుస్తోంది. కూలీ నుంచి ఆల్రెడీ బిట్ సాంగ్స్ వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి కానీ ఇప్పటివరకు కూలీ ఫస్ట్ సింగిల్ రాలేదు. ఇప్పుడు కూలీ నుంచి మొదటి పాటను ఈ వారం రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ సాంగ్ లో రజినీ చాలా ఎనర్జిటిక్ గా తన మార్క్ స్టైల్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
దళపతి విజయ్ ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి వెళ్లే ముందు చేస్తున్న ఆఖరి సినిమా జన నాయగన్ కు కూడా అనిరుధే సంగీతం అందిస్తున్నాడు. జూన్ 22న విజయ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ గ్లింప్స్ రిలీజవబోతుంది. ఆల్రెడీ విజయ్- అనిరుధ్ కాంబోలో పలు బ్లాక్ బస్టర్లున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయ్ బర్త్ డే కు రాబోయే గ్లింప్స్ కూడా అద్భుతంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
వీటితో పాటూ ఎ. ఆర్ మురగదాస్ తో కలిసి అనిరుధ్ మరోసారి చేస్తున్న సినిమా మదరాసి. శివ కార్తికేయన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుంచి జూన్ లోనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కాగా అనిరుధ్ గతంలో మురుగదాస్ తో కలిసి కత్తి, దర్బార్ సినిమాలకు వర్క్ చేశాడు.
ఇక అనిరుధ్ సంగీతం అందిస్తున్న మరో సినిమా కింగ్‌డమ్. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. వాస్తవానికైతే కింగ్‌డమ్ మే 30న రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడి జులై, ఆగస్ట్ రిలీజ్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ను మళ్లీ మొదలుపెట్టడానికి జూన్ నెలలో కింగ్‌డమ్ నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇలా మొత్తానికి నాలుగు స్పెషల్ బొనాంజాలతో జూన్ ను మరింత స్పెషల్ గా మార్చబోతున్నాడు అనిరుధ్. వీటితో పాటూ అనిరుధ్ చేతిలో మ్యాజిక్, ది ప్యారడైజ్, జైలర్2 లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ జూన్ లో రెండు వారాలు పూర్తయ్యాయి కాబట్టి తర్వాతి రెండు వారాలు సౌత్ ఇండస్ట్రీలో అనిరుధ్ తన మ్యూజిక్ తో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు.