• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యానిమాల్ ట్రైలర్:...

యానిమాల్ ట్రైలర్: ఎమోషన్స్ తోనే భయపెట్టిన వంగా

| ముఖ్యంగా ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ లు, డైలాగ్స్, రణబీర్ మేకోవర్ లో వేరియేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి

By - Tupaki Desk
Update: 2023-11-23 09:21 GMT

సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూసిన 'యానిమల్' ట్రైలర్ వచ్చేసింది. సుమారు 3 నిమిషాల 32 సెకండ్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పీక్స్ కి చేర్చింది. ముఖ్యంగా ట్రైలర్ లో యాక్షన్ సీక్వెన్స్ లు, డైలాగ్స్, రణబీర్ మేకోవర్ లో వేరియేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. తండ్రి, కొడుకుల మధ్య ఉండే బాండింగ్ ని వేరే లెవెల్ లో ప్రజెంట్ చేయబోతున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా

ట్రైలర్ మొత్తం ఫాదర్ అండ్ సన్ కోర్ పాయింట్ తోనే నడిచింది. తన తండ్రిని ఏ ఒక్కరు తప్పుగా అర్థం చేసుకున్నా? ఎవరు ఏమన్నా? రణబీర్ ఏమాత్రం తట్టుకోలేడు. తండ్రి కోసం ఏదైనా చేసే కొడుకు పాత్రలో మోస్ట్ వైలెంట్ గా కనిపించాడు రన్ బీర్." మా నాన్నని షూట్ చేసిన వాడ్ని నా చేతులతోనే వాడి గొంతు కోస్తాను", "ఇకనుంచి మీకోసం వేయి చేస్తాను నాన్న, ప్రతిసారీ మీ పర్మిషన్ అడగలేను"..

"ఇక మీ మీద ఈగ వాలినా సరే ఢిల్లీ తగలబెట్టేస్తాను" అంటూ రణ్ బీర్ చెప్పిన డైలాగ్స్ ని బట్టి తండ్రిపై తనకున్న ప్రేమని అర్థం చేసుకోవచ్చు.

అలాగే ట్రైలర్ లో "నీకు మీ నాన్న మీద ఉంది ప్రేమ కాదు అది ఒక రోగం" అని రష్మిక చెబితే రణబీర్ ఆమె గొంతు పట్టుకోవడం.. నువ్వు ఘోస్ట్ తో ఫైట్ చేస్తున్నావ్ నీకు అర్థం అవుతుందా? అని రష్మిక చెబితే, నేను ఘోస్ట్ తో ఫైట్ చేయను, వాడిని మింగేస్తాను అంటూ రణ్ బీర్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకున్నాయి.

ఇక ముఖ్యంగా ట్రైలర్లో చూపించిన యాక్షన్ సీన్స్ మోస్ట్ వైలెంట్ గా ఉన్నాయి. ట్రైలర్ అంతా ఒకెత్తు అయితే చివర్లో రణబీర్ ఓ భారీ మెషిన్ గన్ తో కాల్చడం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు మరే సినిమాలో అంత పెద్ద మెషిన్ గన్ వాడలేదేమో. దీన్ని బట్టి సినిమాలో యాక్షన్ పార్ట్ మెయిన్ హైలెట్ గా నిలుస్తుంది అని చెప్పొచ్చు. ఇక ట్రైలర్ ఎండింగ్ లో రణబీర్ తో బాబి డియోల్ తలపడే షాట్, అందులో రణబీర్ పై పడుకుని బాబీ డియోల్ సిగరెట్ కాల్చే స్టైల్ చూస్తుంటే..

డైరెక్టర్ సందీప్ ఇందులో విలన్ క్యారెక్టర్ ని కూడా చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేసినట్లు అనిపిస్తుంది. 'అర్జున్ రెడ్డి' తో డీప్ లవ్ స్టోరీ ని చూపించిన సందీప్ రెడ్డి వంగా 'యానిమల్' తో ఫాదర్ అండ్ సన్ బాండింగ్ ని ఫుల్ ఎమోషనల్ గా చూపించబోతున్నాడు. సుమారు 3 గంటల 21 నిమిషాల రన్ టైం తో రాబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది.

Full View
Tags:    
  • Ranbirkapoor 
  • Rashmika 
  • Anilkapoor 
  • Bobby 
  • Sandeepvanga 
  • Bhushan 
  • Animalmovie 

Similar News

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

మెగాస్టార్‌కు వ‌రుస‌గా బాంబ్ బెదిరింపులు.. అస‌లేం జ‌రుగుతోంది?

2026-11-06 10:49 GMT

రామాయణ లో ఉన్నది.. ఆదిపురుష్‌లో లేనిది ఇదేనా!

2026-11-06 10:48 GMT

రామాయణంలో భాగం కావడం మర్చిపోలేని అనుభూతి.. రకుల్ ప్రీత్ సింగ్!

2026-11-06 10:46 GMT

ఈసారైనా పెళ్లి అవుతుందా? సీజన్ 2పై పెరిగిన ఆసక్తి!

2026-11-06 10:30 GMT

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

Copyright @2026

Powered by Blink CMS