• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యానిమల్‌' కోసం టాలీవుడ్‌...

యానిమల్‌' కోసం టాలీవుడ్‌ స్టార్‌... వచ్చేది ఎవరు?

| ఇప్పటి వరకు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్ ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే వాటిల్లో ఏ ఒక్క సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల్లో రాని క్రేజ్‌ తాజా చిత్రం 'యానిమల్‌' కి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2023-11-25 14:30 GMT

ఇప్పటి వరకు బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్‌ కపూర్ ఎన్నో సినిమాల్లో నటించాడు. అయితే వాటిల్లో ఏ ఒక్క సినిమాకు కూడా తెలుగు రాష్ట్రాల్లో రాని క్రేజ్‌ తాజా చిత్రం 'యానిమల్‌' కి వచ్చింది. తెలుగు దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వం వహించడంతో పాటు టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటించడం వల్ల యానిమల్ ను తెలుగు ప్రేక్షకులు ఓన్ చేసుకునేందుకు రెడీ గా ఉన్నారు.

అర్జున్ రెడ్డి సినిమా తో ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ను దక్కించుకున్న దర్శకుడు సందీప్ వంగ. అందుకే ఆయన రూపొందించిన యానిమల్‌ సినిమాకు బాలీవుడ్‌ లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో, ఇక్కడ కూడా అదే రేంజ్ లో క్రేజ్ ఉంది. ఎప్పుడు ఎప్పుడు వస్తుంది.. చూద్దామా అన్నట్లుగా ఎదురు చూస్తున్నారు.

అందుకే యానిమల్‌ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున ప్రచారం చేసి పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వారం రోజుల్లో విడుదల అవ్వబోతున్న యానిమల్‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌ లో భారీ ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

సందీప్ రెడ్డి వంగ మరియు రణబీర్‌ కపూర్‌ ఇంకా ఆయన భార్య ఆలియా భట్ కి టాలీవుడ్‌ స్టార్‌ హీరోలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కనుక యానిమల్‌ కు చిన్న చితక హీరోలు కాకుండా స్టార్ హీరో గెస్ట్‌ గా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జాతీయ అవార్డు కార్యక్రమంలో అల్లు అర్జున్‌ మరియు రణబీర్ కపూర్‌ లు చాలా క్లోజ్ గా మాట్లాడుకున్నారు. అంతే కాకుండా అల్లు అర్జున్‌ తో సినిమాను దర్శకుడు సందీప్ వంగ ప్రకటించాడు. కనుక యానిమల్‌ ప్రీ రిలీజ్ వేడుకలో అల్లు అర్జున్‌ చీఫ్‌ గెస్ట్‌ గా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రామ్‌ చరణ్‌ కి కూడా రణబీర్ కపూర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆర్ఆర్‌ఆర్‌ సినిమా సమయంలో ఆలియాతో చరణ్‌ కి స్నేహం ఏర్పడింది. కనుక చరణ్‌ యానిమల్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కు హాజరు అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఆర్ఆర్‌ఆర్ సినిమా సమయంలోనే ఎన్టీఆర్‌ తో ఆలియా, రణబీర్ కపూర్‌ స్నేహం ఏర్పడింది. కనుక యానిమల్ కోసం ఎన్టీఆర్ వచ్చిన ఆశ్చర్యం లేదు.

ప్రస్తుతం ఈ ముగ్గురు కూడా వారి వారి తాజా సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. రణబీర్‌, సందీప్‌ వంగలు పిలిస్తే కచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరు కాకుండా మహేష్‌ బాబు ను పిలిచినా పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు అనేది టాలీవుడ్ వర్గాల టాక్‌. ఒకటి రెండు రోజుల్లో యానిమల్ ప్రీ రిలీజ్ వేడుక చీఫ్‌ గెస్ట్‌ ఎవరో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    
  • Animal 
  • Sandeepreddyvanga 
  • Alluarjun 
  • Ranabirkapoor 
  • Prerelaseevent 
  • Tollywood 
  • Filmindustry 

Similar News

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

Copyright @2026

Powered by Blink CMS