ఆరేళ్ల తర్వాత హ్యాపీగా అనిల్ సుంకర.. అప్పుడు చాలా టెన్షన్ పడ్డ విష్ణు..

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో శర్వానంద్ నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారీ నారీ నడుమ మురారి మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.;

Update: 2026-01-23 06:37 GMT

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో శర్వానంద్ నటించిన లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారీ నారీ నడుమ మురారి మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ పై అనిల్ సుంకర నిర్మించిన ఆ చిత్రానికి సామజవరగమన వంటి బ్లాక్‌ బస్టర్ అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు.

సినిమాలో శర్వానంద్‌ కు జోడీగా సాక్షి వైద్య, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. యంగ్ హీరో విష్ణు స్పెషల్ క్యామియో పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 15వ తేదీన థియేటర్లలో విడుదలైన ఆ సినిమా.. కంటెంట్‌ పై ఉన్న నమ్మకంతో జనవరి 14వ తేదీన సాయంత్రం నుంచే ప్రీమియర్ షోలు వేసింది.

ఆ షోలకే సూపర్ రెస్పాన్స్ రావడంతో నారీ నారీ నడుమ మురారిపై మంచి బజ్ ఏర్పడింది. విడుదలైన మొదటి రోజు మంచి వసూళ్లు సాధించిన సినిమా, రెండో రోజు నుంచి మరింత స్ట్రాంగ్‌ గా నిలదొక్కుకుంది. కొత్త సినిమాల పోటీ ఉన్నప్పటికీ, తొలి వారం మొత్తం బాక్సాఫీస్ వద్ద బాగా క్యాష్ చేసుకుంది. థియేటర్లు తక్కువగా లభించినా, ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని సక్సెస్ ట్రాక్‌ లో కొనసాగుతోంది.

దీంతో ఇటీవల చిత్ర బృందం సక్సెస్ ఈవెంట్ నిర్వహించింది. ఆ కార్యక్రమంలో నిర్మాత అనిల్ సుంకర, నటుడు విష్ణు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారాయి. వేదికపై అనిల్ సుంకర మాట్లాడుతూ.. ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నానని తెలిపారు. "ఇలా సంతోషంగా ఉండి ఆరేళ్లు అవుతోంది. 2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు టైమ్‌ లో ఇదే ఫీలింగ్ వచ్చింది" అని చెప్పారు.

"మధ్యలో విష్ణు నటించిన సామజవరగమన ద్వారా హిట్ అందుకున్నాం. ఈ రోజు చాలా స్పెషల్ డే. ఆరేళ్ల తర్వాత యునానిమస్ బ్లాక్‌ బస్టర్ అందుకున్నాం. అందరినీ నవ్వించిన సినిమా మా ఖాతాలో పడింది" అని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే విష్ణు మాట్లాడుతూ.. సంక్రాంతికి సినిమా వస్తుందని చెప్పగానే తనకు చాలా టెన్షన్ వేసిందని చెప్పారు.

"అదే సమయంలో సినిమాకు నారీ నారీ నడుమ మురారి అనే టైటిల్ పెట్టాలంటే ధైర్యం ఉండాలి. ఎందుకంటే అది బాలకృష్ణ గారి క్లాసిక్ సినిమా పేరు. అయినా శర్వానంద్ గారు, అనిల్ గారు ఆ ధైర్యం చేశారు. ఫలితంగా సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పటివరకు ఇలా పాత క్లాసిక్ టైటిల్‌ తో మళ్లీ బ్లాక్‌ బస్టర్ కొట్టడం చాలా అరుదైన విషయం" అని అన్నారు. మొత్తానికి లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌, ఎంటర్టైన్మెంట్ తో కూడిన నారీ నారీ నడుమ మురారి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.

Tags:    

Similar News