హిట్‌మెషీన్ మూవీకి అప్పుడే క్రేజీ డీల్స్!
బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ హీరోలు అందుబాటులో లేకపోవడంతో నెక్స్ట్ సినిమా కోసం టైమ్ తీసుకుంటుంటే హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మాత్రం వెంటనే క్రేజీ సినిమాని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు.;
బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ హీరోలు అందుబాటులో లేకపోవడంతో నెక్స్ట్ సినిమా కోసం టైమ్ తీసుకుంటుంటే హిట్ మెషీన్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మాత్రం వెంటనే క్రేజీ సినిమాని పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. 2025 `సంక్రాంతికి వస్తున్నాం` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా పీకల్లోతు కష్టాల్లో ఉన్న దిల్ రాజు ని సేఫ్‌గా బయటపడేసి శభాష్ అనిపించుకున్నారు.
అదే జోష్‌తో 2026 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కామెడీ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా `మన శంకరవరప్రసాద్ గారు`ని అందించి మరో బ్లాక్ బ్టర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుని హిట్ మెషీన్ అనిపించుకున్నారు. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి రికార్డు స్థాయిలో వసూళ్లని రాబట్టింది. చిరు సినిమాల్లో రూ.300 కోట్లు రాబట్టిన మూవీగా రికార్డు సాధించింది.
ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్ తరువాత అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తాడనే చర్చ జరిగింది. వెంకీతో తదుపరి మూవీని చేస్తాడని అంతా అనుకున్నారు. అయితే అందుకు భిన్నంగా వెంకటేష్, కల్యాణ్ రామ్‌ల కాంబినేషన్‌లో నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని ప్లాన్ చేశాడు అనిల్ రావిపూడి. సంక్రాంతి హిట్ ఫార్ములాని రిపీట్ చేస్తూ తనదైన మార్కు యాక్షన్ కామెడీ డ్రామాగా ఈ మూవీని తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ స్క్రిప్ట్ ఫస్ట్ హాఫ్ ఇప్పటికే పూర్తయింది. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్‌ని స్టార్ట్ చేయడానికి టీమ్ రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఆసక్తికరమైన ఓ విషయం బయటికి వచ్చింది. షూటింగ్ ఇంకా ప్రారంభించకుండానే నాన్ థియేట్రికల్ రైట్స్ ఆల్ టైమ్ రికార్డు స్థాయి ధరకు సేల్ అయినట్టుగా టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. 2027 సంక్రాంతి బరిలోకి దిగనున్న ఈ సినిమా షూటింగ్‌కు ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ విషయంలో భారీ మొత్తాన్ని దక్కించుకోవడంతో సినిమా థియేట్రికల్ బిజినెస్ ఇంకెలాంటి షాక్ ఇస్తుందో అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
సాహు గారపాటి షైన్ స్క్రిన్స్ బ్యానర్‌పై నిర్మించనుండగా ఈ మూవీకి జీ స్టూడియోస్ సహ భాగస్వామిగా వ్యవహరించనుంది. కృతిశెట్టితో పాటు మరో క్రేజీ హీరోయిన్ నటించనున్న ఈ సినిమా రానున్న సంక్రాంతికి ఎలాంటి మ్యాజిక్‌ని క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే. `పటాస్` తరువాత కల్యాణ్ రామ్‌తో కలిసి అనిల్ రావిపూడి చేస్తున్న ఈ మూవీపై ఆయన అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారట.