ఇప్పుడది అవసరం అంటావా అనిల్‌...?

టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ దర్శకుల్లో టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి ఉంటాడు అనడంలో సందేహం లేదు.

Update: 2026-10-01 17:17 GMT

టాలీవుడ్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ దర్శకుల్లో టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి తర్వాత అనిల్ రావిపూడి ఉంటాడు అనడంలో సందేహం లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు హిట్‌, సూపర్‌ హిట్‌, బ్లాక్‌ బస్టర్‌గా నిలిచాయి తప్ప, ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఫెయిల్‌ కాలేదు. ఆయన కెరీర్‌ ఆరంభించిన పటాస్‌ నుంచి మొదలుకుని ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన మన శంకర వరప్రసాద్‌ గారు, వచ్చే సంక్రాంతికి రాబోతున్న 'జనవరి 12 విడుదల' సినిమాలు అన్ని కూడా వినోదం ప్రధానంగా తెరకెక్కిన విషయం తెల్సిందే. ఒక్క భగవంత్‌ కేసరి విషయంలో అనిల్‌ రావిపూడి కాస్త ప్రయోగం చేసినట్లు అనిపించినా, అందులోనూ తన మార్క్‌ కామెడీని చూపించాడు. తనకు అచ్చి వచ్చిన జోనర్‌లో వరుస సినిమాలు చేయాల్సిన అనిల్‌ రావిపూడి కొత్త జోనర్‌ను ఎంపిక చేసుకోవడంను ఏ ఒక్కరూ అంగీకరించడం లేదు.

అనిల్ రావిపూడి యానిమేషన్‌ రామాయణం...

అనిల్‌ రావిపూడి ఈమధ్య కాలంలో వరుసగా కామెడీ సినిమాలు తీస్తూ, సంక్రాంతికి విడుదల చేస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది వెంకటేష్‌, కళ్యాణ్‌ రామ్‌ హీరోలుగా నటిస్తున్న జనవరి 12 విడుదల సినిమా రాబోతున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత 2028 సంక్రాంతికి కూడా అనిల్ ఒక కామెడీ సినిమాతో వస్తాడని అంతా అనుకుంటున్న సమయంలో తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ యానిమేషన్‌ 'రామాయణం' ను మొదలు పెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు ఏళ్లుగా అనిల్‌ రావిపూడి యానిమేషన్‌ రామాయణం సినిమా గురించి కలలు కంటున్నాడు. ఈ ఏడాది ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ముహూర్తం ఖరారు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ప్రారంభం అయిన సినిమాను, దసరా సందర్భంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

జనవరి 12 విడుదల సినిమా కోసం...

ఒక వైపు 'జనవరి 12 విడుదల' సినిమాకు సంబంధించిన షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చూసుకుంటూనే మరో వైపు తాను చాలా కాలంగా కలలు కంటున్న యానిమేషన్‌ రామాయణం సినిమాకు సంబంధించిన వర్క్‌ ను చేయిస్తున్నాడని సమాచారం అందుతోంది. ఇటీవల సన్నిహితుల వద్ద రామాయణం సినిమాకు సంబంధించిన ప్రకటన అతి త్వరలోనే రాబోతున్నట్లు చెప్పుకొచ్చాడట. కనీసం రెండు ఏళ్ల సమయం తీసుకుని రామాయణంతో అనిల్‌ రావిపూడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పూర్తిగా యానిమేషన్‌ క్యారెక్టర్స్ కనుక పారితోషికాలతో పని లేదు, కానీ గ్రాఫిక్స్‌ తో ఎక్కువ పని ఉంటుంది. ఇప్పటి వరకు అనిల్‌ రావిపూడి తన సినిమాల్లో కనీసం గ్రీన్‌ మ్యాట్‌ వీఎఫ్‌ఎక్స్ సీన్స్‌ అయినా చేయించాడా అంటే పెద్దగా లేదు అనే సమాధానం వస్తుంది. అలాంటిది పూర్తి వీఎఫ్‌ఎక్స్‌ మూవీ అంటే అంత ఈజీ కాదు అనేది చాలా మంది మాట.

రాజమౌళి మార్క్‌ గ్రాఫిక్స్‌ తో...

ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ లో రాజమౌళి మినహా మరే ఫిల్మ్‌ మేకర్ కూడా వీఎఫ్‌ఎక్స్‌ ను సద్వినియోగం చేసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. రాజమౌళి ఆ రేంజ్‌ లో ఒక మార్క్‌ ను క్రియేట్‌ చేసి పెట్టాడు. విజువల్స్‌, గ్రాఫిక్స్‌ అంటే ఇలా ఉండాలి అన్నట్లుగా రాజమౌళి బెంచ్ మార్క్‌ క్రియేట్‌ చేయడంతో ప్రేక్షకులు ఏ సినిమా వచ్చినా ఆ స్థాయి క్వాలిటీ, ఆ స్థాయి విజువల్స్ ను ఆశిస్తున్నారు. దాంతో అది సాధ్యం కావడం లేదు. ఇప్పుడు అనిల్‌ రావిపూడి సైతం వీఎఫ్‌ఎక్స్‌ ఉపయోగించుకుని, యానిమేషన్‌ రామాయణం తీస్తాను అంటే ఆయన అభిమానులు ఇప్పుడు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు.

కమర్షియల్‌, మాస్‌ దర్శకుడిగా మంచి పేరు ఉన్న ఈ సమయంలో ప్రయోగం అవసరమా అని అనిల్‌ రావిపూడిని ప్రశ్నిస్తున్న వారు ఇండస్ట్రీలోనూ ఉన్నారు. అయితే ఆయన మార్క్‌ రామాయణం ఎలా ఉంటుందా అని ఎదురు చూస్తున్న వారు కూడా ఉన్నారు. మొత్తానికి రామాయణంను మళ్లీ తీసుకు వచ్చే ఉద్దేశంతో వర్క్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి నుంచి రాబోతున్న ప్రకటన కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News