రా అండ్ రస్టిక్ 'అనకాపల్లి'.. ఎలా ఉండబోతుందంటే?
యంగ్ క్యాస్టింగ్ విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట లీడ్ రోల్స్ లో నటించిన అనకాపల్లి మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
యంగ్ క్యాస్టింగ్ విక్రమ్ సాహిదేవ్, సంధ్యా వశిష్ట లీడ్ రోల్స్ లో నటించిన అనకాపల్లి మూవీ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 2న ఆ సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఖగేష్ తమ్మినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాకు త్రినాథరావు నక్కిన కథ, స్క్రీన్ ప్లే అందించడం స్పెషల్ అట్రాక్షన్ గా మారింది. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు.
అయితే అనకాపల్లి మూవీని రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథగా మేకర్స్ చెబుతున్నారు. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తోపాటు యాక్షన్ కూడా సినిమాలో మెయిన్ గా ఉంటుందని అంటున్నారు. విక్రమ్ సాహిదేవ్ సూర్య అనే రా అండ్ రస్టిక్ పాత్రలో కనిపించనున్నారు. సరదాగా తిరిగే ఒక యువకుడు అనుకోకుండా లోకల్ గ్యాంగ్ స్టర్ సుయోధన మాఫియా వరల్డ్ లో ఎలా వెళ్తాడు, అక్కడి నుంచి తన ప్రేమ కోసం బయటపడేందుకు ఎలాంటి పోరాటం చేస్తాడనేది కథలో మెయిన్ ఎలిమెంట్ గా తెలుస్తోంది. సుయోధన రోల్ ను తారక్ పొన్నప్ప పోషించారు.
త్రినాథరావు నక్కిన దర్శకుడిగా మేం వయసుకు వచ్చాం సినిమాతో పరిచయమయ్యారు. ఆ సినిమా కూడా లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో కూడిన స్టోరీతోనే వచ్చింది. ఆ తర్వాత ఆయన కమర్షియల్ సినిమాల వైపు వెళ్లారు. ఇప్పుడు అనకాపల్లితో మరోసారి లవ్ స్టోరీకి కథ, స్క్రీన్‌ప్లే అందించారు. అయితే ఈసారి ప్రేమకథతో పాటు యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ను కూడా కలిపినట్లు మూవీ టీమ్ చెబుతోంది.
సినిమాలో ఇంటర్వెల్, క్లైమాక్స్ సీన్స్ స్పెషల్ గా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు. థియేటర్ లో ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఆ రెండు కూడా రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే కొంతమంది ప్రేక్షకులకు సినిమాను స్పెషల్ గా చూపించారు. వారి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా కొన్ని మార్పులు చేసి ఫైనల్ కట్ సిద్ధం చేసినట్లు ఇప్పటికే మూవీ టీమ్ వెల్లడించింది.
ముఖ్యంగా ఆగస్టులో అనకాపల్లి ప్రాంతానికి చెందిన ప్రేక్షకుల కోసం స్పెషల్ షో వేయడం సినిమాకు మరో ప్రత్యేకత అని చెప్పారు. అయితే మూవీలో యాక్షన్ సీన్స్ తోపాటు ఇంటెన్స్ డ్రామా ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా మొత్తం 2 గంటల 34 నిమిషాల రన్ టైమ్ తో ఉండనుంది. దావ్ జంద్ మ్యూజిక్ అందించిన ఆ సినిమాలో ఇంద్రజ, సంగీత, నందిని రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఇప్పటి వరకు మూవీ టీమ్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఆ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తోంది. మరి రూరల్ లవ్ స్టోరీకి రా అండ్ రస్టిక్ యాక్షన్ ను యాడ్ చేసిన అనకాపల్లి మూవీ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటుందో అంతా వేచి చూడాలి.