సందీప్ కిషన్ వార్నింగ్.. దొరికిపోతారంటూ ఓపెన్ ఛాలెంజ్!

సోషల్ మీడియాలో ఒక సినిమా మీద నెగెటివ్ ప్రచారం జరగడం కొత్త కాదు. చాలా వరకు స్టార్ట్స్ వాటిని పెద్దగా పట్టించుకోరు.

Update: 2026-10-01 12:57 GMT

సోషల్ మీడియాలో ఒక సినిమా మీద నెగెటివ్ ప్రచారం జరగడం కొత్త కాదు. చాలా వరకు స్టార్ట్స్ వాటిని పెద్దగా పట్టించుకోరు. కానీ, కొన్నిసార్లు అదుపుతప్పితే రియాక్ట్ అవ్వాల్సి వస్తుంటుంది. ఇక టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ డైరెక్ట్ రంగంలోకి దిగి ఆ పెయిడ్ బ్యాచ్ కు వార్నింగ్ ఇవ్వడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనపై, తన లేటెస్ట్ మూవీపై గత కొన్ని రోజులుగా ఉద్దేశపూర్వకంగా కొందరు నెగెటివ్ పోస్టులు చేస్తున్నారని ఆయన ఓపెన్ గా ఫైర్ అయ్యాడు.

తనను టార్గెట్ చేస్తూ పనిగట్టుకుని మరీ పెయిడ్ యాంటీ ట్వీట్లు చేస్తున్నారని సందీప్ క్లియర్ గా ఆరోపించాడు. తన మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్న ఆ బ్యాచ్ గురించి తనకు తెలుసంటూనే, ఆ నెగెటివ్ ప్రచారం కోసం డబ్బులు ఎవరు ఖర్చు చేస్తున్నారో కూడా పక్కా ఇన్ఫర్మేషన్ తన దగ్గర ఉందని కుండబద్దలు కొట్టాడు. దీంతో అసలు సందీప్ ను టార్గెట్ చేసిన ఆ వ్యక్తులు ఎవరనే దానిపై సోషల్ మీడియాలో బజ్ మొదలైంది.

ఈ చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న వాళ్ళపై సెటైరిక్ గా స్పందిస్తూనే సందీప్ గట్టి వార్నింగ్ జారీ చేశాడు. తన కంటే ఈ ప్రచారం చేస్తున్న వాళ్లే ఎక్కువగా నష్టపోవాల్సి ఉంటుందని డైరెక్ట్ గా హెచ్చరించాడు. ఒకవేళ తాను నేరుగా యాక్షన్ లోకి దిగితే, ఈ నెగెటివ్ పోస్టుల వెనుక ఉన్న ప్రతి ఒక్కరూ అడ్డంగా దొరికిపోతారంటూ "చూసుకోండి" అని ట్విట్టర్ వేదికగా ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు.

సందీప్ సిగ్మా సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తెలుగు తమిళంలో ఒకేసారి వస్తోంది. సరిగ్గా ఇలాంటి టైమ్ లోనే ఆయన సినిమాలపై పనిగట్టుకుని నెగెటివిటీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం జరగడం అనుమానాలకు తావిస్తోంది. ఎవరో తెరవెనుక ఉండి ఫేక్ అకౌంట్ల ద్వారా ఈ యాంటీ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారనేది సందీప్ ట్వీట్ తో అర్థమవుతుంది.

కెరీర్ లో ఎన్నో ఒడిదుడుకులు చూసి నిలబడిన సందీప్ కిషన్, ఇలాంటి ఆన్ లైన్ అటాక్స్ కు ఏమాత్రం భయపడే రకం కాదని ఈ పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేశాడు. సైలెంట్ గా ఉంటే ఈ పెయిడ్ ట్రోలింగ్ మరింత శృతి మించుతుందనే ఉద్దేశంతోనే ఆయన నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. తన దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయనే కాన్ఫిడెన్స్ తోనే ఆయన ఇంత ఓపెన్ గా సవాల్ చేశాడు. మరి ఈ విషయంలో నెటిజన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్స్ వస్తాయో చూడాలి.




Tags:    

Similar News