మూడు భారీ యాక్షన్ బ్లాక్స్ తో డ్రాగన్ ఎక్కడికో!
యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `డ్రాగన్` పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం `డ్రాగన్` పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. ప్రశాంత్ నీల్ సినిమాలంటేనే విజువల్ వండర్స్, ఎమోషనల్ డెప్త్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోతాయి. తాజాగా `డ్రాగన్` విషయంలో నీల్ అంతకంటే రెట్టింపు స్థాయిలో యాక్షన్ ప్లాన్ చేసినట్లు వినిపిస్తోంది.ఈ సినిమా కేవలం యాక్షన్ ఎంటర్‌టైనర్‌లా కాకుండా హాలీవుడ్ స్థాయి సాంకేతిక విలువలతో విజువల్ విందుగా మలచడానికి నీల్ అండ్ టీమ్ అహర్నిశలు శ్రమిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రత్యేకంగా డిజైన్ చేసిన మూడు ప్రధాన యాక్షన్ బ్లాక్స్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. జైలు నేపథ్యంతో వచ్చే జైల్ పార్కర్ ఫైట్, అత్యంత ఉత్కంఠభరితంగా సాగే 'జిటిసి కాళీమాత దగ్గర వచ్చే ఫైట్', రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే 'బ్లడ్ ఫైట్ ఎపిసోడ్స్' ప్రేక్షకులకు అసలైన సినిమాటిక్ కిక్‌ను ఇవ్వబోతున్నాయంటున్నారు. ఇది సాధారణ ఫైట్లలా కాకుండా ప్రతి యాక్షన్ సీక్వెన్స్‌కు బలమైన భావోద్వేగ నేపధ్యం ఉండేలా ప్రశాంత్ నీల్ సీన్స్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఈ మూడు భారీ యాక్షన్ బ్లాక్‌లు సినిమా రన్‌టైమ్‌లో కీలక మలుపులుగా నిలుస్తాయట. కథను పరుగులు పెట్టించడంలో కీలక పాత్ర పోషిస్తాయని సమాచారం.
సినిమాలో వచ్చే మొదటి ప్రధాన యాక్షన్ బ్లాక్ అయిన జైల్ పార్కర్ ఫైట్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అత్యంత క్లిష్టమైన సెట్టింగుల మధ్య, భారీ హంగులతో తెరకెక్కించిన ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమాలో హైలైట్‌గా నిలవనుంది. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా ప్రశాంత్ నీల్ ఈ ఫైట్‌ను అత్యంత సహజంగా డిజైన్ చేశారట. ఈ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్ చూపించే ఇంటెన్సిటీ, యాక్షన్ కొరియోగ్రఫీ ప్రేక్షకులను సీట్లలో కదలకుండా కట్టిపడేయడం ఖాయమని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
ఇక రెండో కీలక ఘట్టమైన `జిటిసి కాళీమాత దగ్గర వచ్చే ఫైట్` ఈ చిత్రంలోనే అత్యంత శక్తివంతమైన ఎపిసోడ్‌గా నిలవబోతోందిట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్స్, ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సృష్టించిన మ్యాజిక్ కలగలిపి ఈ ఫైట్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లనున్నాయంటున్నారు. కాళీమాత ప్రాంగణం నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ మాస్ అండ్ రౌద్ర రూపం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం పక్కా అంటున్నారు. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్స్, కెమెరా యాంగిల్స్ ఈ ఫైట్‌ను మరో స్థాయికి చేర్చనున్నాయి. థియేటర్లలో ఈ సీన్ వచ్చే సమయంలో ఫ్యాన్స్ ఇచ్చే రెస్పాన్స్ ఊహకందనట్లు ఉంటుందంటున్నారు.
ఈ చిత్రంలోని మూడు ప్రధాన యాక్షన్ బ్లాక్స్‌లో అత్యంత క్రూరమైన, భావోద్వేగంతో కూడినదిగా చెబుతున్న `బ్లడ్ ఫైట్ ఎపిసోడ్` సినిమాకే అసలైన హైలైట్‌గా నిలవనుంది. కథను క్లైమాక్స్ మలుపు వైపు తిప్పే ఈ ఘట్టంలో యాక్షన్ పోరాటంలా కాకుండా ఒక సర్వైవల్ వార్ లా సాగుతుందిట. ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో రక్తపుటేరులు పారేలా ప్రతి ఫ్రేమ్‌లోనూ ఇంటెన్సిటీ మిస్ కాకుండా ఎపిసోడ్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ నటన ఈ ఫైట్‌కు ప్రాణం పోస్తుందని, వెండితెరపై ఈ విజువల్ వండర్ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు మైమరచిపోవడం ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది.