ఆ ఒక్కటీ చేసుంటే అనీల్ బ్లాక్ బస్టర్!
సినిమా ప్రచారమంటే ఆమడ దూరం పారిపోయే లేడీ సూపర్ స్టార్ నయనతారను `మనశంకరవరప్రసాద్ గారు` ప్రచారంలో దర్శకుడు అనీల్ రావిపూడి ఎలా భాగం చేసాడో తెలిసిందే.;
సినిమా ప్రచారమంటే ఆమడ దూరం పారిపోయే లేడీ సూపర్ స్టార్ నయనతారను `మనశంకరవరప్రసాద్ గారు` ప్రచారంలో దర్శకుడు అనీల్ రావిపూడి ఎలా భాగం చేసాడో తెలిసిందే. ఆమెతో రెండు ప్రమోషనల్ వీడియోలు చేయించి సినిమాకు మంచి ఊపు తీసుకొచ్చాడు. ఇది అతడికి మాత్రమే చెల్లింది. కోట్ల రూపాయలు అదనంగా చెల్లిస్తామన్నా ఒప్పుకోని నయనతారను అనీల్ ఒప్పించి ఉచితంగా ప్రచారం చేసుకున్నాడు. నయన్ వ్యక్తిగత ప్రచారం సినిమాకు ఎంతగానో కలిసొచ్చింది. అందుకు అనీల్ ఆమెకు ఏం చెప్పి ఒప్పించాడో? ఆమె ఏ కోణంలో అంగీకరిచిందో? ఇప్పటికీ అర్దం కాక అంతా తల పట్టుకుంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి అడిగినా సరే ఆ కిటుకు ఏంటో అనీల్ చెప్పలేదు. కానీ నయనతార మాత్రం అనీల్ కారణంగానే ప్రచారంలో భాగమైంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అనీల్ పరిచయం కొన్ని నెలలే అయినా? నయనతారకు కు అనీల్ ఓ ప్రెండ్ లా మారిపోయాడు. ఆ ప్రెండ్ షిప్ ను అనీల్ తెలివిగా ప్రచారం కోసం వినియోగించుకుని సక్సెస్ అయ్యాడు. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎక్కడా నయనతార కనిపించలేదు. నయనతార వచ్చిందా? అన్న డిస్కషన్ మీడియాలోనూ జరిగింది. కానీ నయన్ మాత్రం హాజరు కాలేదు.
కానీ నయనతార అందుబాటులో ఉంటే గనుక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కూడా తీసుకొచ్చే వాడినని అనీల్ వేదిక మీదే అన్నాడు. ఆమె దుబాయ్ లో ఉండటంతో? వీలు పడలేదని చెన్నై సహా దేశంలో ఎక్కడ ఉన్నా సరే తప్పక తీసుకొచ్చేవాడినన్నాడు. ఆ మాటతో మరోసారి వారిద్దరి మధ్య స్నేహం ఎంత స్ట్రాంగ్ గా ఉందన్నది బయట పడింది. నిజంగా ప్రీరిలీజ్ ఈవెంట్ లో నయనతార ఉంటే? అనీల్ బ్లాక్ బస్టర్ అయ్యేవాడు. ఇండియన్ సినిమా చరిత్రలోనే అనీల్ నిలిచిపోయేవాడేమో. ఆ వేడుక కూడా పరిపూర్ణమయ్యేది. చిరంజీవి, వెంకటేష్ మధ్య నయనతార ప్రీరిలీజ్ ఈవెంట్ లో కూర్చుంటే ఆ వైబ్ మాటల్లో చెప్పలేనిది. ఆ ఈవెంట్ కు గ్లామర్ తక్కువైంది? అన్న మాట కూడా తొలిగిపోయేది ప్చ్.
అనీల్ ఇచ్చిన క్లారిటీతో నయనతార సినిమా ప్రచారం అన్నది కేవలం ఆ సినిమా వరకే . అనీల్ మాట కాదనలేక నయనతార హాజరైంది. కానీ ఆ కారణంగా నయనతారపై ఒత్తిడి మొదలైంది. సెట్స్ లో ఉన్న మిగతా సినిమా ప్రచార కార్యక్రమాలకు నయనతార అటెండ్ అవుతుందా? అన్న సందేహం వ్యక్తమైంది. నిర్మాతలు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేసారు. కానీ లేడీ సూపర్ స్టార్ మాత్రం అలాంటి వారందరికీ నిర్మొహమాటంగా నో చెప్పినట్లు తెలుస్తోంది.