క్లాసిక‌ల్ డాన్స‌ర్ చుక్క‌లు చూపించింద‌న్న సీనియ‌ర్ స్టార్!

బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు.;

Update: 2026-05-04 02:45 GMT

బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. అయితే ఆయన కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన చిత్రాల్లో `యుద్ధ్ ఒకటి. ఈ సినిమా విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ చిత్ర విశేషాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ సమయంలో అనీల్ క‌పూర్ ఎదుర్కొన్న అనుభవాలను పంచుకున్న‌నారు. సాధారణంగా నటులకు ద్విపాత్రాభినయం చేయడం అనేది సవాలుతో కూడుకున్న పని అనిపిస్తుంది. కానీ అనిల్ కపూర్‌కు మాత్రం ఈ సినిమాలో రెండు భిన్నమైన పాత్రలు పోషించడం చాలా సులువుగా అనిపించిందట. అవినాష్ - జూనియర్ అనే రెండు విభిన్న మనస్తత్వాలు ఉన్న పాత్రలను అనీల్ అలవోకగా పోషించారు.

మేకప్, బాడీ లాంగ్వేజ్‌లో మార్పులు చేసుకోవడం తనకు పెద్ద కష్టమనిపించలేదన్నారు. ఆ ప్రక్రియను తాను ఎంజాయ్ చేశానని అనిల్ పేర్కొన్నారు. అయితే అదే సినిమాలో డ్రీమ్ గర్ల్ హేమమాలినితో కలిసి నటించడం ముఖ్యంగా ఆమెతో డాన్స్ చేయడం మాత్రం తనను తీవ్రమైన ఒత్తిడికి గురిచేసిందని అనిల్ కపూర్ ఒప్పుకున్నారు. హేమమాలిని అప్పటికే స్టార్ హీరోయిన్‌గా, అద్భుతమైన క్లాసికల్ డాన్సర్‌గా దేశవ్యాప్త గుర్తింపు పొందారు. ఆమె పక్కన నిలబడి డాన్స్ చేయాలంటే ఎక్కడ తప్పు చేస్తానో? ఆమె వేగాన్ని అందుకోగలనో లేదో? అన్న భయం తనను వెంటాడిందని గుర్తు చేసుకున్నారు.

షూటింగ్ సమయంలో హేమమాలినితో స్టెప్పులు వేస్తున్నప్పుడు చాలా నెర్వస్‌గా ఫీల్ అయ్యానని ఆమె గ్రేస్‌ను మ్యాచ్ చేయడం తన వల్ల అవుతుందా? అని అనుమాన పడ్డానని అనిల్ కపూర్ వివరించారు. స్క్రీన్ మీద ఒక పెద్ద స్టార్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఒక ఎత్తయితే? డాన్స్ విషయంలో ఆమెకున్న పట్టును చూసి తాను కొంత ఆందోళనకు గురైనట్లు అనీల్ నిజాయితీగా అంగీకరించారు. కానీ హేమమాలిని సహకారం వల్ల ఆ సన్నివేశాలను పూర్తి చేయగలిగానని తెలిపారు. అనిల్ కపూర్, హేమమాలిని మాత్రమే కాదు. ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ కూడా కీలక పాత్రలో నటించారు.

`యుద్ధ్` చిత్రంలో వీరందరి కాంబినేషన్ అప్పట్లో ఓ పెద్ద సంచలనం. భారీ యాక్షన్ - సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని నమోదు చేసింది. అనిల్ కపూర్ కెరీర్ తొలినాళ్లలో ఈ సినిమా ఆయనను ఓ కమర్షియల్ హీరోగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించింది. అనిల్ కపూర్ కెరీర్‌లో ఎన్ని విజయాలు అందుకున్నా.. సీనియర్ నటుల పట్ల ఆయనకున్న గౌరవం, తనలోని లోపాలను ఒప్పుకునే గుణం ఆయనను గొప్ప వ్యక్తిగా నిలబెట్టాయి. `యుద్ధ్` సినిమా అనుభవాలు ఆయనకు నటుడిగా ఎంతో పరిణతిని ఇచ్చా యని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఆయన నేటి తరం నటులకు ఓ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రంగుల ప్రపంచంలో ఎంత ఎదిగినా నేర్చుకోవాల్సింది ఇంకా ఉంటుందని అనిల్ కపూర్ వ్యాఖ్యలు నిరూపిస్తున్నాయి.

Tags:    

Similar News