మెడిక‌ల్ కాలేజ్‌లో గాయ‌ని మెరుపులు

వేదిక మీద అదిరిపోయే డ్యాన్సులు చేస్తూ.. అద్భుత‌ గానాలాపాన‌తో మ‌తులు చెడ‌గొట్టే విద్య అతి కొద్ది మందికే తెలుసు.;

Update: 2025-04-07 16:16 GMT

వేదిక మీద అదిరిపోయే డ్యాన్సులు చేస్తూ.. అద్భుత‌ గానాలాపాన‌తో మ‌తులు చెడ‌గొట్టే విద్య అతి కొద్ది మందికే తెలుసు. చాలా మంది గొప్ప గాయ‌నీ గాయ‌కులు వేదిక‌పై డ్యాన్సులు చేయ‌లేరు. చాలా మంది డ్యాన్సులు చేసేవాళ్లు పాడ‌లేరు! కానీ ఆ రెండు అద్భుత ల‌క్ష‌ణాలు క‌లిగి ఉన్న అరుదైన పెర్ఫామ‌ర్ ఆండ్రియా జెరోమియా. ఈ బ్యూటీ నటిగాను స‌త్తా చాటింది. యుగానికి ఒక్క‌డు లాంటి థ్రిల్ల‌ర్ మూవీలో కార్తీ స‌ర‌స‌న ఆండ్రియా న‌ట ప్ర‌ద‌ర్శ‌న‌కు అభిమానులు ఏర్ప‌డ్డారు. ఆండ్రియా చాలా కాలంగా ఆల్ రౌండ‌ర్ నైపుణ్యంతో ఆక‌ట్టుకుంటోంది. గాయ‌నిగా, న‌టిగా, డ్యాన్స‌ర్ గా రాణిస్తోంది.

మ‌ధ్య‌లో ప్ర‌ముఖ యువ‌ సంగీత ద‌ర్శ‌కుడితో ప్రేమాయ‌ణం, బ్రేక‌ప్ అంటూ కొన్నాళ్ల పాటు టైమ్ వేస్ట్ అయినా కానీ ఆండ్రియా డిప్రెష‌న్ నుంచి బ‌య‌ట‌ప‌డి, కెరీర్ ప‌రంగా కంబ్యాక్ అవుతున్న తీరు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ఇక‌పోతే ఆండ్రియా ఇటీవ‌ల ఓ నైట్ ఈవెంట్లో కాలేజ్ విద్యార్థుల‌ను ఉర్రూత‌లూగించింది. త‌న‌దైన గానం డ్యాన్సుల‌తో వేదిక‌ను ఒక ఊపు ఊపింది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్ర‌స్తుతం ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి.

ఆండ్రియా ఓ మెడిక‌ల్ కాలేజీలో త‌న ప్ర‌ద‌ర్శ‌న‌ను ఇచ్చింది. గానంతో పాటు డ్యాన్సుల‌తో మెరుపులు మెరిపించింది. వేదిక‌పై బ్లూ డెనిమ్స్ థై స్లిట్ ఎలివేష‌న్ మ‌తులు చెడ‌గొట్టింది. ఆండ్రియా ప్ర‌ద‌ర్శ‌న‌కు కాలేజ్ యూత్ వీల‌లతో గోల చేస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేసింది.

#కాలేజీ సీజన్ అట్టహాసంగా ముగిసింది ..#సవీతమెడికల్ కాలేజీలో అందరు అందమైన యువ వైద్యుల కోసం ప్రదర్శన ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది అని ఆండ్రియా వ్యాఖ్య‌ను జోడించింది. ఈ మెడిక‌ల్ కాలేజీలో ప్ర‌ద‌ర్శ‌న కోసం ల‌క్ష‌ల్లో ఆండ్రియా అందుకుంద‌ని గుస‌గుస వినిపిస్తోంది.

ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన‌ మాస్ట‌ర్ చిత్రంలో ఆండ్రియా కీల‌క పాత్ర‌లో క‌నిపించింది. ఆ త‌ర్వాత ఒకేసారి నాలుగైదు చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉంది. ఇవ‌న్నీ సెట్స్ లో ఉన్నాయి. క‌మ‌లా క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `వ‌ట్టామ్`.. మిస్కిన్ ద‌ర్శ‌క‌త్వంలో `పిసాసు-2` లో న‌టించింది. కా - మాలిగై- నో ఎంట్రీ స‌హా మ‌రో రెండు చిత్రాల‌తోను ఆండ్రియా బిజీగా ఉంది. బాబి ఆంటోని, దినేష్ సెల్వ‌రాజ్ తెర‌కెక్కిస్తున్న సినిమాల్లో ను న‌టిస్తోంది.

Tags:    

Similar News