'ఆంధ్రా కింగ్ తాలూకా'.. టీజర్ లో రామ్, భాగ్యశ్రీ రొమాన్స్ గట్టిగా ఉంటుందా?
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ డైరెక్టర్ పి.మహేష్ బాబు దర్శకత్వంలో ఫ్యాన్ బయోపిక్ గా రూపొందుతున్న ఆ సినిమాలో క్రేజీ బ్యూటీ భాగ్యశ్రీ బొర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్న ఆ సినిమాలో కన్నడ ప్రముఖ నటుడు ఉపేంద్ర ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఆయన సూర్యకుమార్ రోల్ లో హీరోగా కనిపించనుండగా... ఆయన వీరాభిమానిగా సాగర్ రోల్ లో రామ్ నటిస్తున్నారు. ఇప్పటికే ఆ విషయంలో అందరికీ క్లారిటీ వచ్చేసింది.
హీరోకు, ఆయన వీరాభిమానికి మధ్య జరిగిన ఆసక్తికర సంఘటనలతో పాటు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో ఆంధ్రా కింగ్ మూవీ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 28వ తేదీన సినిమా ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ గా రానుండగా.. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయని చెప్పాలి.
మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్లు, సాంగ్స్, గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. నువ్వుంటే చాలే, పప్పీ షేమ్ వంటి సాంగ్స్.. చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. వివేక్- మెర్విన్ సంగీతం అందరినీ ఆకట్టుకుంటోంది. అయితే ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేయగా, దాన్ని పెంచేందుకు టీజర్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
అందులో భాగంగా ఇప్పుడు టీజర్ విడుదల తేదీని అనౌన్స్ చేశారు. అక్టోబర్ 12వ తేదీన టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. స్పెషల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో థియేటర్ లో ప్రొజెక్టర్ రూమ్ లో హీరో హీరోయిన్లు ఉన్నట్టు చూపించారు. దీంతో టీజర్ కోసం వెయిట్ చేస్తున్నామని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రామ్, భాగ్యశ్రీ మధ్య కెమిస్ట్రీ ఎలా ఉందో చూసేందుకు వెయిటింగ్ అంటున్నారు. గట్టిగా ఉంటుందేమోనని అభిప్రాయపడుతున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. రామ్, భాగ్యశ్రీ, ఉపేంద్రతో పాటు మురళీ శర్మ, రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. మరి సినిమా టీజర్ ఎలా ఉంటుందో.. ఎంతలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.