ఆంధ్రా కింగ్ తో రఫ్ఫాడించే ప్లాన్..?

ఉపేంద్ర తెలుగులో సన్నా సత్యమూర్తి తర్వాత చేస్తున్న సినిమా ఈ ఆంధ్రా కింగ్ తాలూకా.;

Update: 2025-06-01 00:30 GMT

ఉస్తాద్ రామ్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈమధ్యనే వచ్చిన టీజర్ ఇంప్రెస్ చేయగా రామ్ ఎనర్జీ సినిమాతో పక్కా సూపర్ హిట్ కొట్టేస్తాం అన్నట్టుగా ఉంది. రామ్ డబుల్ ఇస్మార్ట్ తర్వాత పూర్తిగా చేంజ్ ఓవర్ అయ్యి చేస్తున్న సినిమా ఆంధ్రా కింగ్ తాలూకా. టైటిల్ కూడా బాగా బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఈ సినిమాలో హీరోయిన్ గా భాగ్య శ్రీ బోర్స్ నటిస్తుంది. ఒక్క హిట్టు కూడా పడకుండానే భాగ్య శ్రీకి అప్పుడే సూపర్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది.

రామ్, భాగ్య శ్రీ లవ్ స్టోరీ ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలోనే హైలెట్ అయ్యే అంశాల్లో ఒకటని అంటున్నారు. భాగ్య శ్రీ కూడా ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకుంది. ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా నటిస్తున్నాడు. తెలుగులో ఉపేంద్ర నటించే సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన ఎలాంటి సినిమా చేసిన ఆడియన్స్ లో ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది.

ఉపేంద్ర తెలుగులో సన్నా సత్యమూర్తి తర్వాత చేస్తున్న సినిమా ఈ ఆంధ్రా కింగ్ తాలూకా. ఐతే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ అదిరిపోయేలా వచ్చిందని టాక్. సినిమా తప్పకుండా రఫ్ఫాడించేలా ఉంటుందని అంటున్నారు. రామ్ ఫ్యాన్స్ కోరుకునే ఎనర్జిటిక్ హిట్ బొమ్మగా ఆంధ్రా కింగ్ తాలూకా అవుతుందని అంటున్నారు. యూత్ ఫుల్ స్టోరీ విత్ లవ్ మిక్స్ చేసి యాక్షన్ ని కూడా దట్టించి వదులుతున్నారట.

సో మహేష్ పి ఈసారి రామ్ ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రామ్ కూడా ఈ సినిమా అవుట్ పుట్ మీద సూపర్ హ్యాపీగా ఉన్నట్టు తెలుస్తుంది. రాం ఈ సినిమా కోసం పూర్తిస్థాయి మేకోవర్ అయ్యాడు. యంగ్ లుక్ లో రామ్ పదేళ్లు వెనక్కి వెళ్లాడని చెబితే అతిశయోక్తి కాదన్నట్టుగా ఉంటుందట. మరి రామ్ ఆంధ్రా కింగ్ తాలూకా ఆంధ్రా తెలంగాణా ప్రేక్షకులను ఏమేరకు మెప్పిస్తుందో చూడాలి. రామ్ లాంటి ఎనర్జీ ఉన్న హీరోకి హిట్లు పడితేనే ఇంకా మంచి మంచి స్టోరీస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆంధ్రా కింగ్ రామ్ కి కొత్త జోష్ ఇస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

Tags:    

Similar News