హీరోలు ఇలా ఊరించడం తగునా?
30 ఏళ్ల క్రితం సల్మాన్ ఖాన్-అమీర్ ఖాన్ కలిసి నటించిన `అందాజ్ అప్నా అప్నా` సంచలనం గురించి చెప్పాల్సిన పనిలేదు.;
30 ఏళ్ల క్రితం సల్మాన్ ఖాన్-అమీర్ ఖాన్ కలిసి నటించిన `అందాజ్ అప్నా అప్నా` సంచలనం గురించి చెప్పాల్సిన పనిలేదు. 1994 లో రిలీజ్ అయిన సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది.
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఆ తర్వాత మళ్లీ సల్మాన్ -అమీర్ కలిసి నటించింది లేదు. ఎవరికి వారు సోలో చిత్రాలు చేసుకోవడం తప్ప! కలిసే ప్రయత్నం కూడా సీరియస్ గా చేయలేదు.
అయితే `అందాజ్ అప్నా అప్పా`కి సీక్వెల్ చేస్తారనే ప్రచారం మాత్రం చాలా కాలంగా సాగుతోంది. దాదాపు దశాబ్ధ కాలంగా ఈ ప్రచారం నెట్టింట సాగుతుంది. సల్మాన్ ఖాన్ ఓ సందర్భంలో `అమీర్ తో కలిసి నటించే అవకాశం మళ్లీ రాలేదు. మళ్లీ ఆ రోజులు ఎప్పుడు వస్తాయో` అంటూ ఓ పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత అదే పోస్ట్ ను అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ రీ ట్వీట్ చేసింది. దీంతో ఇద్దరు చేతులు కలపడం ఖాయమనుకున్నారంతా.
అభిమానులంతా నెట్టింట పండగ చేసుకున్నారు. ఇదంతా దశాబ్ధం క్రితం జరిగిన కథ. ఇద్దరు మళ్లీ కలవడానికి ఎంతో సమయం పట్టదంటూ నెట్టింట చర్చించుకుంటున్నారు. కానీ ఏం లాభం ఇది అక్కడికే పరిమితమైంది. ఆ తర్వాత అప్పుడప్పుడు మీడియాలో ఇదే సీక్వెల్ గురించి ఏదో వార్త రావడం పరిపాటగా మారింది. అయితే హిట్ సినిమా సీక్వెల్ విషయంలో ఇలా ప్రచారం జరిగితే ఊరించి మోసం చేసినట్లే అవుతుంది.
ఆ క్రేజీ సీక్వెల్ పై బజ్ పూర్తిగా పోతుంది. ఒకే మాటను పదే పదే చెబితే జనాలు కూడా విసుగు చెందుతారని అభిమానులు కొత్త రియాక్షన్ మొదలు పెట్టారు. సంవత్సరాలు గా ఇదే విషయం నెట్టింట చర్చకు రావడం.. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేకపోవడం అన్నది హీరోల తప్పిదంగా భావిస్తున్నారు. ఇలాంటి ప్రచారాలు చేయోద్దని..చేస్తే చేస్తున్నామని ..లేకపోతే లేదని కరాఖండీగా చెప్పేస్తే పోయేదముందని అసహనం వ్యక్తమవుతుంది. ఈ సినిమా గురించి డైరెక్టర్ రాజుకుమార్ సంతోషీ నుంచైతే ఎలాంటి స్పందన కూడా లేదు.