స్టార్ హీరో పై మనసు పడ్డ యంగ్ బ్యూటీ..

సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ.. "రామ్ చరణ్ మగధీర సినిమాను లెక్కలేనన్నిసార్లు చూశాను. ముఖ్యంగా తెలుగు నటులలో నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం".. అంటూ తెలిపింది అనస్వర రాజన్.;

Update: 2025-12-18 10:30 GMT

సినిమా ఇండస్ట్రీలో ఉండే అభిమానులకు సెలబ్రిటీలు అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ సెలబ్రిటీలకు కూడా అభిమాన హీరో, హీరోయిన్లు ఉంటారు. అయితే ఆయా సందర్భాలు వచ్చినప్పుడు మాత్రమే తమకు ఇష్టమైన హీరో , హీరోయిన్ల గురించి బయటపడుతూ ఉంటారు. తమ అభిమాన హీరో, హీరోయిన్లే కాకుండా తమకు నచ్చిన ఆహారాల గురించి కూడా చెబుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఒక యంగ్ బ్యూటీ.. ఆ స్టార్ హీరో అంటే తనకు ఇష్టం అని చెప్పడమే కాకుండా.. తనకు ఇష్టమైన ఆహారం గురించి కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.


 


ఆమె ఎవరో కాదు మలయాళ బ్యూటీ అనశ్వర రాజన్. డిసెంబర్ 25న విడుదల కానున్న ఛాంపియన్ అనే సినిమాలో రోషన్ మేక సరసన నటిస్తోంది. ఈ సినిమా ద్వారానే తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. అలాగే వెంకీ కుడుముల నిర్మించిన మరో తెలుగు చిత్రం ఇట్లు అర్జున అనే సినిమాలో కూడా కొత్త అనీష్ సరసన ఈమె నటించడానికి సైన్ చేసింది. ఈ రెండు తెలుగు భారీ ప్రాజెక్టులు ఈమె చేతిలో ఉండడంతో హైదరాబాదులోనే ఎక్కువ సమయాన్ని గడుపుతోంది. ఈ క్రమంలోనే తెలుగు సినిమా పట్ల అలాగే హైదరాబాదు సంస్కృతి పట్ల తన అభిమానాన్ని పంచుకుంది.

హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టం అని చెప్పిన ఈమె.. హైదరాబాదు రుచులను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను అంటూ తెలిపింది. సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ.. "రామ్ చరణ్ మగధీర సినిమాను లెక్కలేనన్నిసార్లు చూశాను. ముఖ్యంగా తెలుగు నటులలో నాకు అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టం".. అంటూ తెలిపింది అనస్వర రాజన్. ప్రస్తుతం ఈమె చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక అల్లు అర్జున్ అంటే ఇష్టం అని చెప్పడంతో అల్లు అభిమానులు.. మగధీర సినిమాను లెక్కలేనన్ని సార్లు చూసాను అని చెప్పడంతో ఇటు మెగా అభిమానులు కూడా ఈమె గురించి తెలుసుకోవడానికి తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. మరి ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

2017 లో వచ్చిన ఉదాహరణం సుజాత అనే చిత్రంలో బాలనటిగా నటించిన ఈమె కేరళ రాష్ట్రానికి చెందినవారు. 2019లో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. ఎక్కువగా తమిళ్, మలయాళం చిత్రాలలో హీరోయిన్గా నటిస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఇప్పుడు తొలిసారి తెలుగులో నటించబోతోంది. మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా మలయాళం, తమిళ చిత్రాలలో భారీ పాపులారిటీ అందుకున్న ఈమెకు.. తెలుగు చిత్రాలు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న 7/G రెయిన్బో కాలనీ 2 సినిమాలో నటిస్తోంది.

Tags:    

Similar News