ఒకవైపు కూతురిగా.. మరొకవైపు హీరోయిన్ గా.. అనస్వర రాజన్ కి కలిసిచ్చేదే ఇది?
అనస్వర రాజన్.. మలయాళ బ్యూటీగా తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయికగా మంచి పేరు సొంతం చేసుకొంది.
అనస్వర రాజన్.. మలయాళ బ్యూటీగా తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న యువ కథానాయికగా మంచి పేరు సొంతం చేసుకొంది. ఇప్పటికే వరుసగా తెలుగులో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిన ఈమె.. తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచిన 'కాకా' మూవీలో ఈమె అవకాశం దక్కించుకుంది. నేడు ఈమె పుట్టినరోజు కావడంతో కాకా మూవీ నుండి ఒక స్పెషల్ పోస్టర్ ను పంచుకుంటూ మేకర్స్ ఈమెకు ప్రత్యేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి కొల్లి కాంబినేషన్లో వస్తున్న కాకా మూవీలో అనస్వర రాజన్ చిరంజీవి కూతురు "అమ్ములు" పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. తండ్రీకూతుళ్ళ అనుబంధం సినిమాకు కీలకమైన ఎమోషనల్ పాయింట్ గా ఉండే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో అనస్వర రాజన్ ఎంబిబిఎస్ స్టూడెంట్ గా సింపుల్ లుక్ లో కనిపించారు. ఇకపోతే అనస్వర ఈ సినిమాలో చిరంజీవికి కూతురుగా నటించబోతోంది అని ప్రకటించడంతో అటు హీరోయిన్గా చేస్తున్న సినిమాల విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
అనస్వర రాజన్ తొలిసారి శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా, ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో వచ్చిన ఛాంపియన్ సినిమా ద్వారా గత ఏడాది తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా పరవాలేదు అనిపించుకుంది. ఇప్పుడు మళ్లీ దాదాపు ఏడాది కాలం పాటు విరామం తీసుకున్న ఈమె.. ఏకంగా చిరంజీవికి కూతురిగా అవకాశం దక్కించుకుంది. ఇకపోతే ఈమె హీరోయిన్గా నటిస్తున్న మరో చిత్రం 'అంతా రాములోరు చూస్కుంటారు'. సంగీత్ శోభన్ హీరోగా, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని, వీజీబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై గిరిబాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ అధికారిక టీజర్ ను విడుదల చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇందులో సంగీత్ శోభన్ , అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ చాలా అద్భుతంగా ఉంది. పైగా అనస్వర రాజన్ ఇందులో శిరీష గా నటిస్తోంది..
ఏది కలిసొస్తుంది?
ఇప్పటికే చిరంజీవి హీరోగా నటిస్తున్న కాకా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలాంటి సినిమాలో చిరంజీవికి కూతురిగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రను దక్కించుకుంది. అటు గోదావరి నేపథ్యంలో వస్తున్న అంతా రాములోరు చూస్కుంటారు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే కూతురుగా ఒక సినిమాలో, హీరోయిన్గా మరో సినిమాలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మకు ఏ చిత్రం కలిసి వస్తుంది? ఏ చిత్రం ఈమెను మళ్లీ నిలబెడుతుంది? అనే విషయాలు తెలియాలంటే సినిమాల ఫలితాలు వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.