పిక్‌టాక్ : చార్మినార్ వద్ద 'లైగర్' బ్యూటీ సందడి
టాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ ఇతర భాషల సినిమాలు చాలా వరకు హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటాయి.;
టాలీవుడ్ సినిమాలతో పాటు బాలీవుడ్ ఇతర భాషల సినిమాలు చాలా వరకు హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటాయి. హైదరాబాద్‌లోని స్టూడియోస్‌లో మాత్రమే కాకుండా ఔట్ డోర్‌లోని మంచి లొకేషన్స్‌లో సినిమాల షూటింగ్స్ రెగ్యులర్‌గా జరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ ఔట్ డోర్ లొకేషన్స్‌లో చార్మినార్ ప్రధానమైనది అనే విషయం తెల్సిందే. అర్థరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు అక్కడ ఏదో ఒక షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. చార్మినార్‌కి నాలుగు వైపుల్లో ఏదో ఒక చోట షూటింగ్ జరుగుతూనే ఉంటుంది అని స్థానికులు చెబుతూ ఉంటారు. ప్రస్తుతం చార్మినార్ వద్ద హిందీ సినిమా షూటింగ్ జరుగుతోంది. షూటింగ్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలను స్థానికులు సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా అంందరి దృష్టిని ఆకర్షించారు. బాలీవుడ్ మూవీ షూటింగ్ జరగడంతో చర్చనీయాంశంగా మారింది.
బాలీవుడ్ యంగ్ హీరో లక్ష్య తో పాటు హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్న సినిమాకు సంబంధించిన షూటింగ్ చార్మినార్ వద్ద జరిగింది. ఇద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఎర్రటి సాంప్రదాయ దుస్తుల్లో ఉండటంతో వీరిని మొదట ఎవరో అనుకున్నారు. కానీ అనన్య పాండేను కొందరు గుర్తు పట్టి చెప్పడంతో ఒక్కసారిగా జనాలు పెరిగారు. జనాలు ఎక్కువగా వచ్చి అనన్య పాండేను, హీరో లక్ష్య ను ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం చేశారు. ఎరుపు రంగు కుర్తా ధరించిన లక్ష్య ఛార్మింగ్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. ఇక అనన్య చీర కట్టులో కళ్లు తిప్పనివ్వలేదు. సాధారణంగానే అనన్య పాండే చీర కట్టులో కన్నుల విందు చేస్తూ ఉంటుంది. ఈసారి ఎర్రటి చీరలో ఆమె చూపు తిప్పనివ్వడం లేదు. ఇంత అందంగా ఉందేంట్రా బాబు అంటూ చాలా మంది ప్రత్యక్షంగా చూసిన వారు కామెంట్స్ చేశారని తెలుస్తోంది.
బైక్ పై ఇద్దరూ చార్మినార్ ముందు నుంచి ప్రయాణిస్తున్న షాట్స్ ను చిత్రీకరించారు. ఆ తర్వాత మరికొన్ని సీన్స్‌ను అక్కడ షూట్ చేస్తారని తెలుస్తోంది. సినిమా షూటింగ్ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఇచ్చారు. పోలీసుల పర్మిషన్ తీసుకున్న కారణంగా జనాలు పెద్ద ఎత్తున రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారట. హైదరాబాద్‌లో దాదాపుగా వారం రోజుల పాటు షూటింగ్ ఉంటుందని, చార్మినార్ తర్వాత మరో పాపులర్ ప్లేస్‌లో షూటింగ్‌ను చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. చిత్ర యూనిట్ సభ్యులు ఒక వైపు షూటింగ్ చేస్తూనే మరో వైపు హైదరాబాద్ అందాలను ఆస్వాదిస్తున్నారు అంటూ ప్రొడక్షన్ టీం చెబుతున్నారు. సోషల్ మీడియాలో యూనిట్ సభ్యులు పలువురు హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తున్నట్లు పోస్ట్‌లు పెట్టడంతో పాటు, సినిమా విశేషాలను పంచుకుంటున్నారు.
అనన్య పాండే బాలీవుడ్‌లో 2019లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో వచ్చిన గుర్తింపు కారణంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తోంది. టాలీవుడ్‌లో ఈమె విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమాలో నటించింది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దాంతో మళ్లీ తెలుగులో నటించే ఆసక్తి లేదని, ఇప్పట్లో తెలుగు సినిమాను చేయను అంటూ ఓపెన్‌గానే చెబుతోంది. భవిష్యత్తులో చేసేది ఇప్పుడే చెప్పలేను అన్నట్లుగా పేర్కొంది. ఇక హీరో లక్ష్య విషయానికి వస్తే ఇటీవల ఈయన ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన బాడ్స్ ఆఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్‌లో ముఖ్య పాత్రలో నటించడం ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. వివేక్ సోనీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను కరణ్ జోహార్ తన ధర్మ ప్రొడక్షన్స్ లో నిర్మిస్తున్న విషయం తెల్సిందే.