• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బేబీతో ఇచ్చిపడేశాడు..

బేబీతో ఇచ్చిపడేశాడు..

| కేవలం విజయ్ దేవరకొండ తమ్ముడు అనే ఇమేజ్ తోనే ఆనంద్ కి అవకాశాలు వస్తుననయనే ప్రచారం తెరపైకి వచ్చింది.

By - Tupaki Desk
Update: 2023-07-15 13:52 GMT

రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తమ్ముడుగా టాలీవుడ్ లోకి ఆనంద్ దేవరకొండ అడుగుపెట్టాడు. దొరసాని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ టాలెంటెడ్ యాక్టర్ మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. లవ్ స్టొరీతో వచ్చిన ఆ సినిమాలో ఆనంద్ దేవరకొండ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఏమీ చేయలేదు. కంటెంట్ కూడా ప్రేక్షకులకి కనెక్ట్ కాలేదు. దీంతో ఆ సినిమా డిజాస్టర్ గా నిలిచింది.

తరువాత మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటీటీలో విడుదలవ్వగా దానికి మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్పక విమానం, హైవే సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఆ రెండు సినిమాలు ఆనంద్ కి ఆశించిన స్థాయిలో సక్సెస్ ఇవ్వలేదు.

నటన పరంగా కూడా ఒకేరకమైన డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్స్ ఉంటాయనే విమర్శలు ఎదుర్కొన్నాడు. కేవలం విజయ్ దేవరకొండ తమ్ముడు అనే ఇమేజ్ తోనే ఆనంద్ కి అవకాశాలు వస్తుననయనే ప్రచారం తెరపైకి వచ్చింది.

తాజాగా సాయి రాజేష్ దర్శకత్వంలో వచ్చిన బేబీ మూవీలో ఆనంద్ దేవరకొండ నటించాడు. ఈ మూవీ థియేటర్స్ లోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాతో ఆనంద్ తన మీద ఉన్న విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టాడనే చెప్పాలి. 10వ తరగతిలో అమ్మాయిని ప్రేమించే యువకుడిగా, తరువాత ఆటో డ్రైవర్ గా మారిన కుర్రాడిగా భిన్నమైన షేడ్స్ లో తన పాత్రలో చూపించాడు.

ఓ విధంగా చెప్పాలంటే మిగిలిన అన్ని సినిమాలలో కంటే మెచ్యూర్ పెర్ఫార్మెన్స్ తో ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ మెప్పించాడని చెప్పాలి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ తో ఎంతగానో మెప్పించాడు. ఇక మంచి నటుడిగా సినిమాలోని తన పాత్రకి ఆనంద్ న్యాయం చేశారు. ఈ మూవీతో తనపై ఉన్న అన్ని విమర్శలకి ఫుల్ స్టాప్ పెట్టాడని చెప్పొచ్చు. విమర్శకుల ప్రశంసలుని సైతం ఆనంద్ దేవరకొండ తన పెర్ఫార్మెన్స్ తో సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు బేబీ సినిమా మౌత్ టాక్ తో ఆడియన్స్ కి భాగా చేరువ అవుతుంది. ఈ వీకెండ్ లోనే బ్రేక్ ఎవెన్ అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ తన తమ్ముడు పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయి, వైష్ణవి చైతన్యతో పాటు ఆనంద్ ని ఇన్వైట్ చేసి వారికి కంగ్రాట్స్ చెప్పడం విశేషం.

Tags:    
  • AnandDevarkonda 
  • BabyMovie 
  • vaishnaviChaitanya 
  • SaiRajesh 
  • LoveStory 
  • VijayDevarkonda 
  • Movienews 

Similar News

ఇప్పుడున్న స్టార్ డైరెక్టర్లందరు కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది?

2026-11-04 16:30 GMT

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

Copyright @2026

Powered by Blink CMS