• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నేను హీరోగా చేస్తున్నా...

నేను హీరోగా చేస్తున్నా అంటే విజయ్ ఫ్రాంక్ అనుకున్నాడు : ఆనంద్ దేవరకొండ

| 2019లో విజయ్ నాకు ఒక సినిమా వచ్చింది తీసుకుంటున్నా అంటే విజయ్ నవ్వాడు.. ఏదో ఫ్రాంక్ చేస్తున్నా అని అనుకున్నాడు.

By - Tupaki Desk
Update: 2023-07-18 08:25 GMT

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ దొరసాని సినిమా తో హీరోగా పరిచయమై వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ఆనంద్ కి మొదటి కమర్షియల్ హిట్ అందించిన సినిమా బేబీ. సాయి రాజేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను ఎస్.కె.ఎన్ నిర్మించారు. ఈ జూలై 14న రిలీజైన ఈ సినిమా యూత్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. సినిమా 3 రోజుల్లోనే లాభాల బాట పట్టగా చిత్ర యూనిట్ సోమవారం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా విజయ్ దేవరకొండ అటెండ్ అయ్యారు.

ఈ ఈవెంట్ లో బేబీ హీరో ఆనంద్ దేవరకొండ స్పీచ్ ఆడియన్స్ ని అలరించింది. సినిమా రిలీజైన ఈ 3, 4 రోజుల నుంచి ఏమి అర్ధం కావట్లేదని.. మన సినిమా రిలీజ్ అయ్యిందా లేదా అనే విషయం కూడా అర్థం కావట్లేదని అన్నారు ఆనంద్. బేబీ సినిమా ఇంత సక్సెస్ అవుతుందని అసలు ఊహించలేదని.. సంధ్య థియేటర్ లో రెస్పాన్స్ చూసి అంతగా ఫేమస్ కాని మమ్మల్ని అందరు గుర్తుపట్టడం ఆనందంగా అనిపించింది. కంటెంట్ నమ్మి సినిమా చేస్తే సక్సెస్ అందిస్తారని మరోసారి ప్రూవ్ చేశారు. అందుకు ఆడియన్స్ అందరికీ థాంక్స్ చెప్పారు ఆనంద్ దేవరకొండ.

ఈ సినిమా చూసి చాలామంది ఏడిపించావ్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఒక్కటి ప్రామిస్ చేస్తున్నా.. ఇక పై నేను మంచి సినిమాలు చేస్తా.. మీరు థియేటర్ లో కూర్చుని ఎంజాయ్ చేసే సినిమాలు చేస్తా అని అన్నారు ఆనంద్ దేవరకొండ. టీం మొత్తం 3 ఏళ్లు కష్టపడి ఈ సినిమా చేశామని.. అందరికీ థాంక్స్ అని అన్నారు. బేబీ సినిమా కు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ హైలెట్ అయ్యిందని సినిమా కు ఫస్ట్ హీరో అతనే అని అన్నారు.

సినిమా మ్యూజిక్ వింటే గుండె బరువెక్కుతుందని.. దానికి కారణం విజయ్ బుల్గానిన్ అని అన్నారు ఆనంద్. ఇక తనతో నటించిన కో యాక్టర్స్ గురించి మాట్లాడుతూ విరాజ్ చాక్లెట్ బాయ్.. బాగా చేశావ్.. విరాజ్ యాక్టింగ్ చేస్తుంటే కమల్ హాసన్ అని అరుస్తున్నారు. వైష్ణవి కూడా చాలా బాగా పాత్రకు న్యాయం చేసింది. ఫస్ట్ సినిమా తోనే వర్సటైల్ క్యారెక్టర్ తో మెప్పించింది. ఎస్.ఎక్.ఎన్ అన్నకి స్పెషల్ థాంక్స్. తనను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు థాంక్స్ అన్నారు. ఈ సినిమా నడవకపోతే సినిమాలు వదిలేద్దాం అనుకున్న.. ఈ సినిమా మంచి హోప్ ఇచ్చిందని అన్నారు ఆనంద్ దేవరకొండ.

డైరెక్టర్ సాయి రాజేష్ తన రూల్స్ బ్రేక్ చేశాడు. డైలాగ్స్ సూపర్ గా ఉన్నాయి. ఎవరు ఏం అన్నా సరే మీరు మారొద్దు రాజేష్ అన్నారు. మీరు ఇలాంటి సినిమాలు ఇంకా చేయాల ని అన్నారు ఆనంద్. ఇక చివరగా అన్న విజయ్ గురించి మాట్లాడిన ఆనంద్ మేమిద్దరం ఫ్రెండ్స్ లెక్క ఉంటాం. 2019లో విజయ్ నాకు ఒక సినిమా వచ్చింది తీసుకుంటున్నా అంటే విజయ్ నవ్వాడు.. ఏదో ఫ్రాంక్ చేస్తున్నా అని అనుకున్నాడు. ఆ తర్వాత నిజమేనా అని అడిగితే నిజమే అని చెప్పా.. సినిమా అంటే జోక్ అనుకున్నావా.. అంటూ నిన్ను ఆపలేం చెయ్ అని ఎంకరేజ్ చేశాడు. ఆ టైం లో నాకు అన్న పేరు చెడగొడతానా అన్న భయం ఉండేది. అందుకే మీకు ప్రామిస్ చేస్తున్నా.. మంచి సినిమాలు చేస్తానని చెప్పారు ఆనంద్ దేవరకొండ.

Tags:    
  • BABYMovie 
  • AnandDeavrkonda 
  • VijayDevarkoda 
  • VaishnaviChaitanya 
  • SaiRajesh 
  • SKN 
  • Tollywood 

Similar News

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

Copyright @2026

Powered by Blink CMS