పవన్ కళ్యాణ్ చెప్పిన మట్టి కథల స్ఫూర్తితోనే అనకాపల్లి.. మైత్రీ రవిశంకర్

ఈ వేదికపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ అతిథిగా పాల్గొని సినిమా సక్సెస్ పై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

Update: 2026-09-28 04:28 GMT

అక్టోబర్ 2న థియేటర్లలోకి రాబోతున్న రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా అనకాపల్లి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి ఎంతో గ్రాండ్ గా జరిగింది. ఈ వేదికపై మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ అతిథిగా పాల్గొని సినిమా సక్సెస్ పై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆయన రెగ్యులర్ గా కాకుండా ఈ సినిమా కథకు ఉన్న ఒక బలమైన కోణాన్ని అందరికీ అర్థమయ్యేలా వివరించారు.

ముఖ్యంగా మన నేల నుంచి పుట్టే కథలకు ఉండే పవర్ ఎలాంటిదో ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. రంగస్థలం సక్సెస్ మీట్ కు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఒక మాటను రవిశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మన మూలాల నుంచి మన మట్టి నుంచి కథలు పుట్టినప్పుడే వాటికి మంచి ఆదరణ దొరుకుతుందని అప్పుడే ప్రాంతాల కల్చర్ అందరికీ తెలుస్తుందని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు గుర్తుచేసుకున్నారు.

అలాంటి కథల్లోనే ఫ్రెష్ నెస్ ఉంటుందని అవే పాన్ ఇండియా స్థాయికి వెళ్తాయని అంటూ ఈ అనకాపల్లి సినిమాకు కూడా మంచి గుర్తింపు దక్కుతుందని చెప్పారు. పాన్ ఇండియా అంటే ఏదో కాదు మన కథలు వేరే ప్రాంతాల వాళ్ళకు కూడా నచ్చడమే అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కాలంలో ఇలాంటి మట్టి కథలకు మంచి రోజులు వచ్చాయని రవిశంకర్ తెలిపారు.

గోదావరిఖని నేపథ్యంలో వచ్చిన దసరా సినిమా కానీ పారడైస్ అలాగే అనంతపురం బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న రణబాలి కానీ ఇలాంటి కోవకే చెందుతాయని ఆయన అన్నారు. ఇరుముడి లాంటి సినిమాలు పూర్తిగా లైవ్ లొకేషన్లలో తీయడం వల్ల ఎంత ఫ్రెష్ గా అనిపించాయో ఈ అనకాపల్లి ట్రైలర్ చూసినప్పుడు కూడా అదే ఫీల్ కలిగిందని ఆయన ప్రశంసించారు. రూరల్ సౌండ్ పండగ వాతావరణం ఈ సినిమాను ఎంతో పైకి లేపుతాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

సినిమాలో నటించిన నటీనటుల గురించి కూడా ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా తారక్ పొన్నప్ప క్యారెక్టర్ చూస్తుంటే పుష్ప సినిమాలో హీరోకి కౌంటర్ గా నిలబడే పాత్ర ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో ఇతను కూడా అంత భయపెట్టేలా ఉన్నాడని ఆయన మెచ్చుకున్నారు. హీరో విక్రమ్ సహిదేవ్ కు ఇదొక పెద్ద బ్రేక్ అవుతుందని హీరోయిన్ సంధ్యా వశిష్ఠ స్క్రీన్ మీద ఎంతో అందంగా కనిపిస్తోందని రవిశంకర్ అభినందించారు. సీనియర్ నటి ఇంద్రజ గారిని చూడగానే సోగసు చూడతరమా సినిమా రోజులు గుర్తొచ్చాయని ఆయన సరదాగా అన్నారు.

నిర్మాత కాండ్రేగుల నాయుడు గురించి మాట్లాడుతూ ఆయనకు ఎంతో అదృష్టం ఉందని రవిశంకర్ కామెంట్ చేశారు. తాను పుట్టి పెరిగిన ఊరు అనకాపల్లి పేరునే సినిమా టైటిల్ గా పెట్టుకునే అవకాశం నాయుడు గారికి దక్కిందని తాము మాత్రం బెజవాడ టైటిల్ పెట్టుకుందాం అనుకునే లోపే వేరేవాళ్ళు వాడేశారని ఆయన నవ్వించారు. ప్రస్తుతం 86 ఎకరాల వెంచర్ వేసిన నాయుడు గారు ఈ సినిమా సూపర్ హిట్ అయ్యాక 860 ఎకరాల వెంచర్ వేయాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు.

దర్శకుడు ఖగేష్ తమ్మినేని ఈ సినిమాతో కచ్చితంగా పెద్ద సక్సెస్ సాధిస్తాడని రవిశంకర్ ధీమా వ్యక్తం చేశారు. కథ స్క్రీన్ ప్లే అందించిన త్రినాథరావు నక్కిన ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటారని ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఆయన మరింత ఆనందంగా కనిపిస్తారని చెప్పారు. ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామా అక్టోబర్ 2న థియేటర్లలోకి వస్తుందని అందరూ తప్పకుండా చూసి ఆదరించాలని రవిశంకర్ కోరారు.



Tags:    

Similar News