మహేశ్ బాబు హీరోయిన్ కు రక్తంతో లవ్ లెటర్లు

ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్ వచ్చిందంటే చాలు... మన కుర్రోళ్లు ఆ అమ్మాయి గురించి ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తుంటారు.;

Update: 2025-09-24 13:30 GMT

ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్ వచ్చిందంటే చాలు... మన కుర్రోళ్లు ఆ అమ్మాయి గురించి ఇంటర్నెట్ లో తెగ వెతికేస్తుంటారు. ఆ అమ్మాయి ఎవరు. ఎక్కడి నుంచి వచ్చింది. బ్యాక్ గ్రౌండ్ ఏంటి అనే విషయాలు ఆరా తీస్తుంటారు. తమతమ క్రష్ లిస్ట్ లోనూ చేర్చుకుంటారు. ఇక ఆ హీరోయిన్ పబ్లిక్ ఈవెంట్లు, బయట ఎక్కడైనా కనిపిస్తే సెల్ఫీల కోసం ఎగబడుతుంటారు.

ఇది ఒక రకమైన అభిమానం. అయితే మరికొందకు ఇంకో అడుగు ముందుకేసి హీరోయిన్లతో మాట కలిపేస్తారు. మరికొందరు లవ్ ప్రపోజల్స్ , మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా ఆమె ముందు పెడతారు. ఇవన్నీ ఓకే. కానీ ఆ ప్రపోజల్స్ కాస్త హారిబుల్ గా ఉండి, ఆమెను అభద్రతా భావానికి గురిచేస్తే ఎలా. ఆమె పని కంటే ఆమె వ్యక్తిగత జీవితంపైనే దృష్టి పడితే ఏం చేసేది. సరిగ్గా ఇలాగే జరిగింది హీరోయిన్ అమృత రావుకు.

ఏంటీ, ఈ అమృత రావు ఎవరు అనుకుంటున్నారా? అదేనండీ మన మహేశ్ బాబు అతిథి సినిమా హీరోయిన్. అవును ఈమెకు కెరీర్ కొత్తలో ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయట. ఇవన్నింటినీ ఆమెనే స్వయంగా చెప్పుకొచ్చింది. అమృత అతిథితో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా.. ఆమె హిందీలో అంతకంటే ముందే సినిమాలు చేసింది. ఆమె నటించిన వివాహ్, మై హూనా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.

ఈ విజయాలు ఆమెకు గుర్తింపు తెచ్చి పెట్టాయి. అయితే ఈ గుర్తింపే ఆమెకు కొన్ని సమస్యలు కూడా తెచ్చింది. ఈ సినిమాల తర్వాత ఆమెకు పెళ్లి ప్రపోజల్స్ వచ్చాయట. కొందరు ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి మరీ పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పారట. మరికొందరైతే రక్తంతో లవ్ లెటర్ లు కూడా రాశారట. ఇలాంటివి తరచూ జరిగాయట.

దీంతో ఆమె ప్రొఫెషనల్ కంటే పర్సనల్ లైఫ్ గురించి ఎక్కువ బయటకు వచ్చిందట. ఇది ఆమెను అభద్రతా భావానికి గురిచేశాయని చెప్పింది. ఈ సమయంలోనే ఆమెకు ఆర్ జే అన్మోల్ తో పరిచయం ఏర్పడింది. ఆమెకు ప్రొఫెషనల్, పర్సనల్ గా సపోర్ట్ ఇచ్చారట. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ ఇద్దరూ ఏడేళ్లు డేట్ చేసి 2016లో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 2020లో కొడుకు పుట్టాడు.

ఇక అమృత ప్రొఫెషనల్ లైప్ విషయానికొస్తే.. తెలుగులో అతిథి తర్వాత, అమృత మరో సినిమాలో కనిపించలేదు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అవ్వకం కూడా ఒక కారణం కావొచ్చు! ఆమె పెళ్లి తర్వాత, ఆమె ఆరు సంవత్సరాలు నటనకు విరామం తీసుకుంది. కాదా, ఇప్పుడు జాలీ ఎల్ఎల్ బీ 3 తో అమృత మళ్లీ రీ ఎట్రీ ఇస్తోంది. ఈ సినిమాలో ఆమె సంధ్య త్యాగి పాత్రను పోషిస్తోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కీలక పాత్రలో నటించారు. అయితే సరైన పాత్రలు వస్తే టాలీవుడ్‌ లోనూ నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమృత చెప్పింది.

Tags:    

Similar News