ఇదేం అలవాటు మేడం పటేల్ జీ..!
సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం కహో నా... ప్యార్ హై సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అమీషా పటేల్.;
సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం కహో నా... ప్యార్ హై సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ అమీషా పటేల్. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అదే ఏడాది తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎంట్రీ ఇచ్చిన మొదటి ఏడాదిలోనే హిందీ, తెలుగు భాషల్లో వేరు వేరు సినిమాలు చేయడం, అది కూడా స్టార్ హీరోలకు జోడీగా నటించడం, ఆ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఏ హీరోయిన్‌కి కూడా ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ ఎంట్రీ దక్కదు అనడంలో సందేహం లేదు. హీరోయిన్‌గా అమీషా పటేల్ చాలా బిజీ అయింది. ఏడాదికి రెండు మూడు అంతకు మించి సినిమాలు చేస్తూ వచ్చింది. దాదాపు పదేళ్ల పాటు వరుస సినిమాలు చేసింది.
అమీషా పటేల్ లగ్జరీ లైఫ్...
మధ్యలో కాస్త స్లో అయిన అమీషా పటేల్ మళ్లీ ఇప్పడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయాలని భావిస్తోంది. అయిదు పదుల వయసుకు వచ్చిన అమీషా పటేల్ వయసుకు తగ్గ పాత్రలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తోంది. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న విషయం తెల్సిందే. ఇటీవల ఈమె ఒక సెలబ్రిటీ చిట్ చాట్ లో ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. ముఖ్యంగా తన యొక్క లైఫ్ స్టైల్, తన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ గురించి చెప్పుకొచ్చింది. తాను సినిమాల్లోకి రాక ముందు నుంచే చాలా లగ్జరీ లైఫ్ ను లీడ్ చేసేదాన్ని, నా బ్యాక్ ప్యాక్ విషయంలోనూ నేను చాలా జాగ్రత్తలు తీసుకుని, స్టైల్‌గా ఉండాలని కోరుకునేదాన్ని, మా బామ్మ కూడా రోజులో మూడు చీరలు మార్చే వారు, మా అమ్మ, ఆంటీ కూడా చాలా ఖరీదైన షాపింగ్ చేయడం నేను చిన్నప్పుడే చూశాను. అందుకే నా లైఫ్ స్టైల్ కూడా చాలా లగ్జరీగా సాగుతుందని అమీషా పటేల్ పేర్కొంది.
విదేశాలకు వెళ్లినప్పుడు అమీషా పటేల్..
తాజా చిట్ చాట్‌లో అమీషా పటేల్ తన వద్ద ఉన్న హ్యాండ్ బ్యాక్ కలెక్షన్స్‌ను చూపించింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టక ముందు నుంచే నేను హ్యాండ్ బ్యాగ్స్ వాడకం పై చాలా ఆసక్తి చూపించేదాన్ని, అందుకోసం చాలా ఖర్చు చేసి కొనుగోలు చేసేదాన్ని. ఇక సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తర్వాత మరింత ఆసక్తి పెరిగింది. ఎక్కడకు వెళ్లినా, ముఖ్యంగా విదేశాలకు వెళ్లినా కూడా అక్కడ నుంచి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకు వచ్చేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఇండియాలో చాలా మందికి కనీసం తెలియని బ్రాండ్స్ నా వద్ద చాలా ఉండేవి. ఇప్పుడు చాలా బ్రాండ్స్ ఇండియాకు వచ్చాయి, అవి ఇక్కడకు రాకముందే వాటిని నేను కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకు వచ్చాను అంది. ఆమె తన వద్ద ఉన్న మొత్తం హ్యాడ్ బ్యాగ్స్ ఖరీదు కోట్లలోనే ఉంటుంది అని చెప్పుకొచ్చింది. తాను బ్యాగ్స్ కు ఖర్చు చేసిన డబ్బుతో ఖచ్చితంగా ముంబైలో ఖరీదైన ఒక పెంట్ హౌస్ ను కొనుగోలు చేసి ఉండొచ్చు అంది.
కోట్ల రూపాయలతో లగ్జరీ హ్యాండ్ బ్యాగ్స్
ఇప్పటికీ తనకు ఆ అభిరుచి పోలేదు అంది. నాలుగు వందలకు పైగా కలెక్షన్స్ తన వద్ద ఉన్నట్లు వీడియోలో వాటిని అమీషా పటేల్ చూపించింది. వాటి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయించుకున్న అమీషా పటేల్ వాటిని ఎప్పటికప్పుడు వాడుతూ ఉంటాను అని కూడా చెప్పింది. వందల కొద్ది హ్యాండ్ బ్యాగ్స్ ను కొనుగోలు చేయడం, అది కూడా లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం ఏంటి మేడం అంటూ సోషల్ మీడియాలో చాలా మంది ఈమె వీడియోకు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి ఒక హ్యాబిట్ ఇతరులు ఉండాలి అనుకోరు అని, సగటున ఒకరి వద్ద హ్యాండ్ బ్యాగ్స్ 10 ఉండవచ్చు... కానీ ఇలా 400 హ్యాండ్ బ్యాగ్స్ ఉండటం ఏంటో విచిత్రంగా, విడ్డూరంగా అని చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. భవిష్యత్తులో వింటేజ్ వస్తువుల మాదిరిగా వీటిని ఏమైనా వేళం వేస్తారేమో, అప్పుడు ఆమె పెట్టిన మొత్తం కంటే ఎక్కువ వస్తాయేమో చూడాలి.