బొంబాయి పారిశ్రామికవేత్తతో అమీషా డేటింగ్
అయితే లేటు వయసులోను తనలో సగం వయసున్న కుర్రాళ్ల నుంచి డేటింగ్ ప్రపోజల్స్ వస్తున్నాయని అమీషా పటేల్ తెలిపింది.;
`బద్రి` సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది అమీషా పటేల్. పవన్ కల్యాణ్ - రేణు దేశాయ్ లతో పాటు, అమీషా నటనకు మంచి పేరొచ్చింది. అదే సమయంలో `కహోనా ప్యార్ హై` చిత్రంతో బాలీవుడ్ కి కూడా పరిచయమైంది. హృతిక్ రోషన్ లాంటి డెబ్యూ సరసన అమీషా అవకాశం అందుకుంది. అమీషా కెరీర్ ఆరంభ చిత్రాలు పాథ్ బ్రేకింగ్ హిట్లుగా నిలిచాయి. ఆ తర్వాత వరుసగా అగ్ర హీరోల సరసన అవకాశాలు అందుకుంది. తెలుగులో మహేష్, బాలకృష్ణ లాంటి పెద్ద హీరోల సినిమాల్లో నటించింది.
అయితే బాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు తన ఆట సాగినా కానీ, ఇటీవలి కాలంలో ఆశించిన అవకాశాల్లేవ్. నవతరం నటీమణుల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటున్న అమీషా పటేల్ 50 వయసులోను స్పీడ్ చూపించాలని కలలు కంటున్నా అది పాజిబుల్ కాలేదు. కెరీర్ మ్యాటర్ అలా ఉంచితే అమీషా ఇప్పటికీ ఒంటరిగానే ఉండిపోవడం ఆశ్చర్యపరుస్తోంది.
అయితే లేటు వయసులోను తనలో సగం వయసున్న కుర్రాళ్ల నుంచి డేటింగ్ ప్రపోజల్స్ వస్తున్నాయని అమీషా పటేల్ తెలిపింది. చాలా మంది ధనవంతులు తన గురించి కాపు కాసుకుని కూచున్నారని, కానీ తానే ప్రపోజల్స్ నచ్చక తిరస్కరిస్తున్నానని తెలిపింది. అంతేకాదు.. తన మనసు దోచే రాకుమారుడి కోసం వేచి చూస్తున్నానని, అతడు అకస్మాత్తుగా తనను వెతుక్కుంటూ వస్తాడని కూడా చెబుతోంది.
వివాహానికి సిద్ధంగా ఉన్నాను.. నేను సమర్థుడైన వ్యక్తి కోసం చూస్తున్నాను. సంకల్పం ఉన్నచోట మార్గం ఉంటుంది. సరైన సమయంలో నన్ను కనుగొని నన్ను ఆశ్చర్యపరిచే వ్యక్తి నాకు ఇష్టమైనవాడు... అని కూడా అమీషా చెప్పింది. మగాడు మానసికంగా పరిణతి చెందినవాడై ఉండాలి. నేను చాలా మంది పెద్దోళ్ల(ఆర్థికంగా)ను కలిశాను. కానీ వారి ఐక్యూ ప్రాక్టికల్ గా సున్నా.. అని కూడా చెప్పింది.
అసలు పెళ్లిని ఎందుకు కాదనుకోవాల్సి వచ్చింది? అని ప్రశ్నిస్తే.. పెళ్లయితే నటనను వదిలేసి ఇంట్లోనే ఉండాలి. పెళ్లి తర్వాత ఇంట్లోనే ఉండాలని వరుడు ఆశించినందున గత ప్రతిపాదనలు తిరస్కరించానని కూడా అమీషా తెలిపింది. మనల్ని ప్రేమించేవాళ్లు మన కెరీర్ బావుండాలని కోరుకోవాలి. నా కెరీర్‌లో- ప్రేమలో కూడా నేను చాలా కోల్పోయాను. నేను కొన్నిసార్లు రెండింటినీ వదులుకున్నాను.. నేను రెండు అనుభవాల నుండి నేర్చుకున్నాను అని అమీషా తెలిపింది.
బాలీవుడ్ లో అడుగుపెట్టక ముందే తాను దక్షిణ బొంబాయికి చెందిన ప్రముఖ పారిశ్రాకవేత్త కుటుంబంలోని యువకుడిని ప్రేమించానని తెలిపింది. అతడి నేపథ్యం విద్య ఫ్యామిలీ సెటప్ ప్రతిదీ రిచ్. కానీ నేను సినీనటిగా కొనసాగుతానని అడిగితే, అతడు ఒప్పుకోలేదు. అందుకే నేను ప్రేమ కంటే నా కెరీర్‌ను ఎంచుకున్నాను అని తెలిపింది. `గదర్ 2` తర్వాత అమీషా కెరీర్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. తదుపరి కొత్త ప్రాజెక్టును ప్రకటించాల్సి ఉంది.
నా తల్లిదండ్రల పెళ్లికి ఇందిరమ్మ
మా తాత గారు బారిస్టర్ రజనీ పటేల్. నాటి ప్రధాని ఇందిరా గాంధీతో మా తాత గారికి మంచి అనుబంధం ఉంది. ఇందిరా గాంధీకి కుదిరిన రోజు 4 జూలై. అందుకే ఆ తేదీన `తాజ్ మహల్ ప్యాలెస్` హోటల్ బుక్ చేసి పెళ్లి ఏర్పాట్లు చేసారు. అలాగే నేను పుట్టిన తర్వాత నన్ను మొదటగా చూడటానికి వచ్చినది ఇందిరమ్మ గారేనని అమీషా తెలిపింది. ఆ రోజుల్లో అగ్ర హీరోలు తమ ఇంటికి వచ్చేవారని, ఎం.ఎఫ్ హుసేన్ తమ ఇంటి గోడలపై పెయింటింగ్స్ చేసారని కూడా అమీషా గర్వంగా తెలిపింది. గొప్ప వాళ్లతో తమ కుటుంబానికి ఉన్న కనెక్షన్స్ గురించి అమీషా పటేల్ సుదీర్ఘంగా మాట్లాడింది.