OGపై అంబటి రివ్యూ.. దానయ్య దండగ పడ్డావయ్యా..!
పవన్ కళ్యాణ్ సినిమాపై అంబటి ఈ స్పెషల్ రివ్యూ ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురువారం రిలీజై మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఫ్యాన్స్ ఏమో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటుంటే కామన్ ఆడియన్స్ మాత్రం సుజిత్ పవన్ కళ్యాణ్ వరకు న్యాయం చేసినా సినిమాలో మిగతా యాస్పెక్ట్స్ లో అతను ఫెయిల్ అయ్యాడని అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా మీద పొలిటికల్ లీడర్స్ కన్ను కూడా ఉంది. ఈ సినిమాపై వైసీపీ నేత అంబటి రాంబాబు రిలీజ్ ముందు.. రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో స్పందించారు. ఓజీ సినిమా రిలీజ్ రెండు రోజుల ముందు పవన్ జీ.. ఓజీ సూపర్ డూపర్ హిట్టై దానయ్యకు దండిగా ధనం రావాలని కోరుకుంటున్నా అంటూ ఒక మెసేజ్ చేశారు.
ప్యత్యర్ధి అయినా పవన్ సినిమా ఆడాలని..
ఇక సినిమా రిలీజ్ తర్వాత మళ్లీ ఎక్స్ లో తన కామెంట్ పెట్టారు. ప్యత్యర్ధి అయినా పవన్ సినిమా ఆడాలని నా ఆరాటమే కానీ ఫలితం మాత్రం శూన్యం దానయ్య.. దండగ పడ్డావయ్యా అంటూ మరో మెసేజ్ పెట్టారు. అంతేకాదు పవన్ ఓజీ గురించి అంబటి రాంబాబు రివ్యూ కూడా ఇచ్చారు. సినిమా కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చుతుందని కామన్ ఆడియన్స్ ని డిజప్పాయింట్ చేసిందని అన్నారు. ఈ కామెంట్స్ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేరని అన్నారు అంబటి రాంబాబు.
పవన్ కళ్యాణ్ సినిమాపై అంబటి ఈ స్పెషల్ రివ్యూ ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఇన్నాళ్లు సినిమాలను వదిలేసి రాజకీయాలు చేసే వారు. ఇప్పుడు తమ ప్రత్యర్ధి సినిమాకు రివ్యూస్ కూడా ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. సినిమా, రాజకీయాలు రెండు వేరు వేరు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పనిచేస్తున్నారు. అటు రాష్ట్ర రాజకీయాలతో పాటు ఇటు సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ సినిమాలు టార్గెట్..
ఐతే పవన్ కళ్యాణ్ అనేసరికి పొలిటికల్ లీడర్స్ కి సినిమాలు టార్గెట్ గా కనిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో పవన్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచడం మాట అటుంచితే ప్రైస్ చాలా తక్కువ చేసి అమ్మిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా గురించి అంబటి రాంబాబు ఈ రివ్యూ కూడా అందులో భాగంగానే అంటున్నారు. ఏది ఏమైనా ఓజీ పై ఈ డిస్కషన్ హాట్ టాపిక్ గా మారింది.
పొలిటికల్ లీడర్స్ మాత్రమే కాదు ఓజీ సినిమాను దాదాపు సినీ పరిశ్రమలో చాలా మంది దర్శకులు, హీరోలు చూసి సూపర్ అనేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒకప్పటి స్వాగ్ ని చూపించాడని సుజిత్ ని మెచ్చుకుంటున్నారు.