ఆల్ఫా సర్ ప్రైజ్ కోసం అలియా ఫుల్ హార్డ్ వర్క్.. బ్లాక్ బస్టరేనా?
బాలీవుడ్ భామలు ఆలియా భట్, శార్వరీ వాఘ్.. లీడ్ రోల్స్ లో ఆల్ఫా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.;
బాలీవుడ్ భామలు ఆలియా భట్, శార్వరీ వాఘ్.. లీడ్ రోల్స్ లో ఆల్ఫా మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. శివ్ రావేల్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాను బాలీవుడ్ అగ్ర నిర్మాణసంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. అయితే ఆ సంస్థకు చెందిన స్పై యూనివర్స్‌లో రాబోతున్న మొదటి మహిళా స్పై మూవీ కావడంతో భారీ అంచనాలున్నాయి.
అనిల్ కపూర్, బాబీదేవోల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. హృతిక్ రోషన్ క్యామియో రోల్ లో కనిపించనున్నారు. అయితే ఆల్ఫా మూవీలో నెవ్వర్ బిఫోర్ అనేలా యాక్షన్ సీన్స్ ఉండనున్నట్లు ఇప్పటికే టాక్ వినిపించింది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ సమక్షంలో యుద్ధపోరాట సన్నివేశాలను తీస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
అదే సమయంలో ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆల్ఫా మూవీలో స్పెషల్ సాంగ్ ఉన్నట్లు తెలుస్తోంది. హై- ఆక్టేన్, గ్లామరస్ ఎక్స్ ట్రా వాగాన్ గా సాంగ్ ఉండనున్నట్లు సమాచారం. ఆ పాటలో ఆలియా భట్, శార్వరీ వాఘ్ కనిపించనున్నారట. వారిద్దరూ సాంగ్ లో ముందెన్నడూ చూడని అవతార్ లో కనిపిస్తారని టాక్.
ఇప్పటికే సాంగ్ కోసం స్టూడియోలో ప్రాక్టీస్ చేస్తున్నారని తెలుస్తోంది. గంటల తరబడి రిహార్సల్స్ లో నిమగ్నమై ఉన్నారని సమాచారం. సినిమా కోసం హార్డ్ వర్క్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సాంగ్ అదిరిపోయేలా ఉండేందుకు కష్టపడుతున్నారని వినికిడి. సాంగ్ కోసం జిమ్ సెషన్స్ కు వెళ్తున్నారని టాక్ వినిపిస్తోంది.
భారీ బడ్జెట్ తో సాంగ్ రూపొందుతోందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే బ్యూటీలు సిద్ధమవుతున్నారని టాక్ వస్తోంది. ఏదేమైనా ఇప్పుడు ఆ సాంగ్ విషయం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఉన్న అప్డేట్ ప్రకారం.. సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయమనేలా అనిపిస్తుందని నెటిజన్లు అంటున్నారు.
"సాంగ్ గురించి ఆలియా, శార్వరి ఇద్దరూ ఉత్సాహంగా ఉన్నారు. ఉత్కంఠభరితంగా సాంగ్ ఉండనుంది. యాక్షన్ ప్యాక్డ్ మూవీలో ఇద్దరు ఫిమేల్ లీడ్ రోల్స్ తో స్పెషల్ సాంగ్ అంటే అర్థం చేసుకోవచ్చు. దృశ్యపరంగా అద్భుతమైన, హై ఎనర్జీతో పాట ఉండనుంది. వేరే లెవెల్ లో రూపుదిద్దుకుంటుంది" అని సినీ వర్గాలు తెలిపాయి. మరి ఆలియా, శార్వరి సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి.