మామ ఫంక్షన్ హాలుకి అల్లుడు ఐకాన్ స్టార్ సాయం!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మామగారైన..బీఆర్ ఎస్ నేత చంద్రశేఖర్ రెడ్డి వ్యాపారాభివృద్దలో భాగమవుతున్నట్లు తెలుస్తోంది.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన మామగారైన..బీఆర్ ఎస్ నేత చంద్రశేఖర్ రెడ్డి వ్యాపారాభివృద్దలో భాగమవుతున్నట్లు తెలుస్తోంది. చంద్రశేఖర్ రెడ్డి నల్లగొండ జిల్లాలోని భుట్టు గూడేం గ్రామంలో `కంచర్ల కన్వెన్షన్` పేరుతో ఓ ఫంక్షన్ హాలు నిర్మించారు. ఆఫంక్షన్ హాలు ప్రారంభోత్సవం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా చేస్తున్నారు. బన్నీతో పాటు పలువురు రాజకీయ నాయకుల్ని ఆయన ఆహ్వానించారు.
ఈ సందర్బంగా సుమారు పదివేల మందికి భోజన ఏర్పాట్లు కూడా చేసారు. అలాగే మహిళలకు చీరల పంపిణీ కూడా ఏర్పాటు చేసారు. ఇక బన్నీకి ఈ లాంచింగ్ కార్యక్రమం తప్పనిది. స్వయనా సొంత మామ కాబట్టి వెళ్లక తప్పదు. అలాగే చంద్రశేఖర్ రెడ్డికి 2024 ఎన్నికల్లో భారసా టికెట్ ఇస్తే మామ తరుపున ప్రచారం చేస్తారని వినిపిస్తోంది. ఆ సంగతి పక్కనబెడితే బన్నీ రాకతో భారీ మండలంలో ఎత్తున కటౌట్లు...ప్లెక్సీలు దర్శనమిస్తున్నాయి.
అభిమానులు....రాజకీయ నాయకులు బన్నీపై అభిమానంతో కటౌట్లు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇక బన్నీ కి గ్రామాలంటే ఎంతో ఇష్టం. అంత పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటారు. సంక్రాంతి సమయంలో సతీమణి స్నేహారెడ్డి అమ్మమ్మ ఇంటికి బన్నీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బన్నీని చూడటానికి వచ్చి వారితో ముచ్చటించి సెల్పీలు దిగారు.
అలాగే `పుష్ప` షూటింగ్ సమయంలో రోడ్డు పక్కనే ఉన్న పూరి గుడిసెలో టిఫిన్ చేసిన వీడియో నెట్టింట ఎలా వైరల్ అయిందో తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ అయినా స్టార్ అనే హోదాని పక్కనబెట్టి అందరితో కలిసి పోతాడు. రీసెంట్ గా తెలుగు అమ్మాయిలు కూడా సినీ పరిశ్రమలోకి రావాలని..అలాంటి వాళ్లని తప్పకుండా పరిశ్రమ ప్రోత్సహిస్తుందని కూడా ప్రామిస్ చేసిన నటుడాయన. ఇంతవరకూ ఏ నటుడు అలా స్పందించలేదు.