• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆ సూపర్ హిట్ సినిమాలో...

ఆ సూపర్ హిట్ సినిమాలో బన్నీ చేసుంటే..?

| మొత్తానికి ఒక హీరోకి అనుకున్న కథ వేరే హీరో దగ్గరకు వెళ్లడం కామనే. ఈ క్రమంలో అల్లు అర్జున్ తో జయం చేయాలని అనుకున్న తేజ నితిన్ తో చేసి హిట్ కొట్టాడు.

By - Tupaki Desk
Update: 2024-07-17 03:00 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టాడు. సుకుమార్ తన సినిమాల్లోని హీరో పాత్రలను చాలా వరకు క్లాస్ గానే చూపిస్తూ వచ్చాడు. కానీ రంగస్థలం సినిమా నుంచి తన పంథా మార్చాడు. రంగస్థలం సినిమాలో చిట్టి బాబుని ఊర మాస్ పాత్రలో చూపించాడు. ఆ పాత్రలో చరణ్ కూడా అదరగొట్టిన విషయం తెలిసిందే.

ఇక ఆ తర్వాత పుష్ప తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. పుష్ప తర్వాత అల్లు అర్జున్ సినిమాల ప్లానింగ్ ఏంటన్న దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కెరీర్ లో ఒక సూపర్ హిట్ మిస్ అయ్యాడన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది ఇప్పుడు కాదు కెరీర్ మొదట్లోనే ఒక క్రేజీ లవ్ స్టోరీ ఆఫర్ ని మిస్ అయ్యాడట. ఇంతకీ అదేంటి అంటే జయం అని తెలుస్తుంది.

నితిన్ హీరోగా తేజా డైరెక్షన్ లో వచ్చిన జయం సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఐతే ఈ సినిమాను అల్లు అర్జున్ తో చేయాలని అనుకున్నాడు తేజ కానీ అది కుదరలేదు. అలా అల్లు అర్జున్ మిస్ అయిన ఈ ప్రాజెక్ట్ నితిన్ చేతికి వచ్చింది. జయం సినిమాతోనే నితిన్ పరిచయం మొదటి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. అయితే జయం సినిమా మిస్సైన అల్లు అర్జున్ తన సెకండ్ సినిమా ఆర్యతో ఎవర్ గ్రీన్ హిట్ అందుకున్నాడు.

మొత్తానికి ఒక హీరోకి అనుకున్న కథ వేరే హీరో దగ్గరకు వెళ్లడం కామనే. ఈ క్రమంలో అల్లు అర్జున్ తో జయం చేయాలని అనుకున్న తేజ నితిన్ తో చేసి హిట్ కొట్టాడు. అప్పట్లో తేజ ఉదయ్ కిరణ్ కాంబినేషన్ అంటే సూపర్ హిట్ అన్నట్టే లెక్క. జయం సినిమా టైం లో ఉదయ్ కిరణ్ వి.ఎన్ ఆదిత్య తో శ్రీరాం సినిమా చేశాడు. ఐతే నువ్వు నేను సినిమా టైం లో తేజా తో ఉదయ్ కిరణ్ కి గొడవ అయ్యిందని.. అందుకే శ్రీరాం సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం పాత్రకు తేజా అని పెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఐతే దాని గురించి తేజా ఎప్పుడు ప్రస్తావించలేదు. మళ్లీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్ తో తేజా ఔనన్నా కాదన్నా సినిమా చేశారు.

Tags:    
  • Nithin 
  • Jayam 
  • Teja 
  • Alluarjun 
  • Lovestory 
  • Pushpa 
  • Panindianmovie 
  • Sukmar 

Similar News

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS