ఉత్తమ నటుడిగా మూడో వాడినో..నాలుగో వాడినో అనుకున్నా!
మరి ఇలా అవార్డు సాధించిడం పట్ల బన్నీ ఎలా ఫీలవుతున్నాడో? తెలిస్తే షాక్ అవుతారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న మొట్ట మొదటి నటుడిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇంతవరకూ ఏ తెలుగు నటుడు ఉత్తమ నటుడిగా కోటాలో జాతీయ అవార్డు సొంతం చేసుకుంది లేదు. ఎంతో మంది నట దిగ్గజాలు పరిశ్రమలో ఉన్నా! వాళ్లెవరికీ రానీ అవకాశం స్టైలిష్ స్టార్ కి వచ్చింది. ఆ రకంగా అల్లు అర్జున్ ఎంతటి అదృష్ట వంతుడో కళ్ల ముందు కనిపిస్తుంది.
'ఫుష్ప' సినిమాలో తాను పోషించిన పుష్పరాజ్ పాత్రకు గానూ ఈ అరుదైన గౌరవం దక్కింది. దీంతో మరో సారి తెలుగు సినిమా సత్తా ఏంటి? అన్నది పాన్ ఇండియాలో మళ్లీ మారు మ్రోగింది. ఇప్పటివరకూ జాతీయ ఉత్తమ నటుడి అవార్డులంటే ఎక్కువగా హిందీ నటులే కనిపించేవారు. ఆ తర్వాత ఇరత పరిశ్రమలకు చెందిన నటులుండేవారు. కానీ 69 వ జాతీయ అవార్డుల వేడుక తెలుగు సినిమా పండుగలా నిలిచింది
బన్నీ సహా 'ఆర్ ఆర్ ఆర్' లాంటి సినిమాకు జాతీయ అవార్డుల రావడంతో! పాన్ ఇండియాలో టాలీవుడ్ సత్తా చాటి నట్లు అయింది. మరి ఇలా అవార్డు సాధించిడం పట్ల బన్నీ ఎలా ఫీలవుతున్నాడో? తెలిస్తే షాక్ అవుతారు.
ఆయన మాటలు అంతటి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ' తొలి పురస్కారం నేను సాధించానని తెలిసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో అంతే షాక్ అయ్యాను కూడా. ఇంతకు ముందు ఉత్తమ నటుడు అవార్డులు వచ్చి ఉంటాయి.
ఈ లిస్ట్ లో మూడోవాడినో..నాలుగో వాడిని అయి ఉంటాను అనుకున్నాను. ఇలా మొదటి వాడిని నేను అవుతా అని అస్సలు ఊహించలేదు. ఆవిషయం తెలిసి చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. నేనేదో మిగతా వాళ్లకంటే గొప్ప అని కాదు. మన పరిశ్రమలో ఎంతో మంది గొప్ప గొప్ప నటులున్నారు. కానీ ఎందుకనో కుదరలేదు. ఆ పరిస్థితులు..సమయం ఎలాంటిదో తెలియదు కదా' అని అన్నారు.