• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఫైనల్ గా పవన్ గురించి...

ఫైనల్ గా పవన్ గురించి బన్నీ ఏమన్నారంటే..

| ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ ఎపిసోడ్ లో ఒక్కో హీరో గురించి బన్నీ చాలా క్లారిటీగా తనకున్న ఫీలింగ్స్ గురించి చెప్పడం విశేషం.

By - Tupaki Desk
Update: 2024-11-15 04:50 GMT

‘అన్ స్టాపబుల్ సీజన్ 4’ అల్లు అర్జున్ తన సహ నటుల గురించి తనకున్న అభిప్రాయాలని బాలయ్యతో పంచుకున్నారు. ఎంటర్టైనింగ్ గా సాగిన ఈ ఎపిసోడ్ లో ఒక్కో హీరో గురించి బన్నీ చాలా క్లారిటీగా తనకున్న ఫీలింగ్స్ గురించి చెప్పడం విశేషం. సూపర్ స్టార్ మహేష్ బాబు అందగాడు అని, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మహేష్ బాబు కమ్ బ్యాక్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. తెలుగు సినిమా స్టాండర్డ్స్ పెంచడంలో మహేష్ బాబు చాలా కీలక భూమిక పోషించారని బన్నీ చెప్పుకొచ్చాడు.

అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటో చూపించగానే నేను దగ్గర నుండి చూసిన వారిలో చాలా ధైర్యవంతుడు. ఆయన ధైర్యం అంటే నాకు చాలా ఇష్టం అని బన్నీ తెలిపాడు. దీనికి బాలయ్య అందుకొని తన దారిలో తాను వెళ్ళిపోతాడు అని అన్నారు. అంతే సర్… అచ్చం మీలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అంటూ బన్నీ ప్రశంసించాడు. అయితే పొలిటికల్ పాయింట్స్ మీద మాత్రం బాలయ్య అడగలేదు బన్నీ చెప్పలేదు. నంద్యాల విషయం గురించి కూడా పెద్దగా ప్రస్తావించలేదు.

తరువాత డార్లింగ్ ప్రభాస్ గురించి బన్నీ తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ప్రభాస్ ని ఎప్పుడు చూసిన నాది ఒకటే మాట. ఆరడుగుల బంగారం. ప్రతి సంవత్సరం మా ఇంట్లో క్రిస్మస్ ట్రీ డెకరేట్ చేస్తాను. ఈ విషయాన్ని ప్రభాస్ కి ఎవరో చెప్పారంట. ఆయన యూరప్ వెళ్ళినపుడు క్రిస్మస్ డెకరేషన్ బాక్స్ తీసుకొచ్చి నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. అలాగే మా ఇద్దరికి చెట్లు అంటే ఇష్టం. ఆయన దగ్గరకి వెళ్ళినపుడు ఓ మొక్కని గిఫ్ట్ గా ఇచ్చాను. అది ఆయన ఫామ్ హౌస్ లో ఉంది. మా ఇద్దరి మధ్య ఇలాంటి మంచి మెమొరీస్ ఉన్నాయని బన్నీ గుర్తు చేసుకున్నారు.

రణబీర్ కపూర్ ని చూపించగా, నాకు బాగా ఇష్టమైన యాక్టర్ అంటూ బన్నీ చెప్పాడు. ఇండియాలో ప్రెజెంట్ జెనరేషన్ మంచి యాక్టర్స్ లలో రణబీర్ కపూర్ ఒకడు. ఆయన పెర్ఫార్మెన్స్ ని నేను చాలా ఇష్టపడతాను అని బన్నీ అన్నారు. వెంటనే బాలయ్య కలుగజేసుకొని మీ ఇద్దరు కలిసి మల్టీ స్టారర్ చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. కచ్చితంగా సూపర్ గా ఉంటుందని బన్నీ అన్నాడు. అయితే ఎవరైనా డైరెక్టర్ కి ఆరు నెలలు టైం ఇస్తున్న, వీరిద్దరి కోసం ఓ మంచి మల్టీ స్టారర్ కథ చేయండి.

ఎవరు రాయకపోతే నేనే రాస్తాను. డైరెక్షన్ కూడా నేనే చేస్తాను అంటూ బాలయ్య సరదాగా అన్నారు. అయితే ప్రొడ్యూసర్ ని మాత్రమే నువ్వే తెచ్చుకోవాలి అంటూ బన్నీతో చెప్పారు. మా నాన్నని పెట్టమని చెబుతాను సర్ అని అల్లు అర్జున్ తెలిపారు. ‘గజినీ’ లాంటి సినిమాని హిందీలో చేసి ఫస్ట్ టైం బాలీవుడ్ లో 100 కోట్లు కలెక్షన్స్ అల్లు అరవింద్ అందుకున్నారు అని ఈ సందర్భంగా బాలయ్య గుర్తుచేశారు.

Tags:    
  • Alluarjun 
  • Balakrishna 
  • Unstoppableshow 
  • Aha 
  • OTT 
  • Balayya 
  • Pawankalyan 
  • Alluarjuncomments 
  • Maheshbabu 
  • Ranbirkapoor 
  • Prabhas 
  • Filmindustry 

Similar News

ప్లాప్స్ లో సీనియ‌ర్లు టాప్ చైర్ కోసం యువ ద‌ర్శ‌కులు!

2026-11-04 15:30 GMT

నటనలోనే కాదు.. భాషల్లోనూ తోపు! 9 భాషలు మాట్లాడే ఏకైక తెలుగు హీరో

2026-11-04 14:30 GMT

టైటిల్ మార్పులపై సెన్సార్ కత్తి!

2026-11-04 13:30 GMT

AIని అంగీక‌రించ‌డానికి టాలీవుడ్ మాన‌సికంగా సిద్ధంగా లేదు!

2026-11-04 13:15 GMT

పాలకొల్లు నుంచి భాగ్యనగరం వరకు.. అమ్మ‌మ్మ‌ల‌పై అల్లు బాస్ కామెంట్స్‌

2026-11-04 13:14 GMT

'ఇట్లు అర్జున' ట్రైలర్ టాక్: మూగ ప్రేమలో పవర్ఫుల్ యాక్షన్

2026-11-04 13:08 GMT

లోయలోకి జారిపోతున్న నటి ప్రాణాలను కాపాడిన షారుఖ్ ఖాన్!

2026-11-04 12:30 GMT

సందీప్ రెడ్డి వంగ కి ఆర్జీవీ లో నచ్చే విషయాలు...

2026-11-04 11:30 GMT

రణ్‌బీర్ 'రామాయణ'పై బన్నీ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-04 11:29 GMT

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

Copyright @2026

Powered by Blink CMS