అల్లు అర్జున్‌ వాల్‌పేపర్‌ వైరల్‌... AA22xA6 బిగ్‌ అప్‌డేట్‌!

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా తర్వాత పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌గా నిలిచిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.;

Update: 2025-11-17 06:16 GMT

అల్లు అర్జున్‌ పుష్ప సినిమా తర్వాత పాన్‌ ఇండియా సూపర్‌ స్టార్‌గా నిలిచిన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సాధించిన విజయంతో అల్లు అర్జున్‌ ఆ గొప్ప గౌరవంకు అర్హుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ అభిమానులు సోషల్‌ మీడియాలో ముచ్చటించుకుంటున్నారు. పుష్ప వంటి సినిమా తర్వాత బన్నీ నుంచి రాబోతున్న సినిమా అనగానే ప్రతి ఒక్కరిలోనూ అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. అందుకే అంచనాలకు తగ్గకుండా దర్శకుడు అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్‌ సినిమాను రూపొందిస్తున్నాడు. వీరిద్దరి కాంబో మూవీ AA22xA6 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతోంది. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయింది. సినిమాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తోంది. మరి కొందరు హీరోయిన్స్ సైతం ఈ సినిమాలో ఉంటారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు.





 


AA22xA6 సినిమా షూటింగ్‌ అప్డేట్‌

AA22xA6 సినిమా అప్‌డేట్‌ లేకపోవడంతో అభిమానులు అసహనంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న అల్లు అర్జున్‌ యొక్క మొబైల్‌ వాల్‌ పేపర్‌ చెప్పకనే AA22xA6 సినిమా గురించి చెబుతుందని అభిమానులు అంటున్నారు. ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్‌, అట్లీ కాంబో మూవీ 2026 దసరా లేదా అంతకు ముందే వస్తుంది అనే ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్లుగానే అల్లు అర్జున్‌ యొక్క మొబైల్‌ వాల్‌ పేపర్‌ పై 2026 మార్చి 27 అనే తేదీ ఉంది. ఆ తర్వాత స్నాక్స్‌ లేదు, చక్కర లేదు, సోడా లేదు అంటూ తన మొబైల్ స్క్రీన్‌ పై రాసి ఉంది. అయాన్‌ పేరును చివరి లైన్‌ లో తన మొబైల్ స్క్రీన్‌ పై పెట్టుకున్నాడు. అంటే అల్లు అర్జున్ ప్రస్తుతం డైట్‌ లో ఉన్నాడని, అది అట్లీ సినిమా కోసం అని చాలా మంది ఈ వాల్‌ పేపర్‌ ను ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు విశ్లేషిస్తున్నారు.

అల్లు అర్జున్‌, అట్లీ కాంబో మూవీ

అల్లు అర్జున్‌ ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి ట్రైనర్‌ వద్ద ఫిట్‌నెస్ కసరత్తు చేస్తున్న విషయం తెల్సిందే. ఆయన సూచన మేరకే స్నాక్స్‌, చక్కర, సోడాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా AA22xA6 షూటింగ్‌ పూర్తి అయ్యే వరకు బన్నీ ఈ రకమైన కసరత్తు చేయడంతో పాటు, ఫుడ్‌ విషయంలో, డ్రింక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే 2026 మార్చి 27 అనే తేదీ ఉంది. అప్పటి వరకు అల్లు అర్జున్‌ షూటింగ్‌ పూర్తి చేస్తాడని, AA22xA6 సినిమా విడుదలకు సిద్ధం అవుతుందని అంటున్నారు. అంటే మార్చి చివరి వరకు సినిమా షూటింగ్‌ పూర్తి చేసి, మూడు లేదా నాలుగు నెలలు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ చేసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

అల్లు అర్జున్ మొబైల్ వాల్‌ పేపర్ వైరల్‌

సాధారణంగానే స్టార్స్ యొక్క మొబైల్ వాల్‌ పేపర్‌ గురించి చాలా చర్చ జరుగుతుంది. అలాంటిది అల్లు అర్జున్‌ వాల్‌ పేపర్‌ గా చాలా మ్యాటర్‌ ఉండటంతో ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్‌ కోసం అల్లు అర్జున్‌ తీరిక లేకుండా బిజీగా ఉన్నాడు. ఆ సమయంలోనే వర్కౌట్‌ చేస్తూ ఉండగా అల్లు అర్జున్‌ ను జిమ్‌ ట్రైనర్‌ ఫోటో తీశాడు, అలా బన్నీ ఫోన్‌ కూడా ఆ ఫోటోలో వచ్చింది. ఆ ఫోన్‌ లో ఈ వాల్‌ పేపర్‌ ఉండటంతో సోషల్‌ మీడియాలో దాని వరకు వైరల్‌ అయింది. అల్లు అర్జున్‌ డెడికేషన్‌కి చాలా మంది ఫిదా అవుతున్నారు. గొప్ప నటుడు అంటూ ఫ్యాన్స్ అంటే, ఇలా కష్టపడితేనే గొప్ప స్టార్స్ అవుతారు అంటూ మరికొందరు అంటున్నారు. AA22xA6 సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా అన్ని ఇండియన్‌ భాషల ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

Tags:    

Similar News