రెబల్ స్పిరిట్ టీ షర్ట్ తో అల్లు అర్జున్..!
రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు.;
రెబల్ స్టార్ ప్రభాస్ నెక్స్ట్ సందీప్ వంగ డైరెక్షన్ లో స్పిరిట్ సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లింది. ఐతే ఈ సినిమా సెట్స్ మీద ఉన్న ఈ టైం లో అల్లు అర్జున్ పాత ఇంటర్వ్యూ వీడియో ఒకటి వైరల్ అయ్యింది. అలా ఎందుకు అంటే అల్లు అర్జున్ ఆ ఇంటర్వ్యూలో టీ షర్ట్ మీద రెబల్ స్పిరిట్ అని రాసి ఉంది. అల్లు అర్జున్ హెయిర్ కట్ చూస్తే అది ఆర్య 2 టైం లో ఉన్నట్టు తెలుస్తుంది. సో రెబల్ స్పిరిట్ టీ షర్ట్ తో అల్లు అర్జున్ కనిపించడం.. ప్రస్తుతం రెబల్ స్టార్ స్పిరిట్ సినిమా చేయడం అలా కుదిరాయి.
ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తుండటంతో..
రెబల్ స్టార్ గా ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు వారసత్వాన్ని పుణికి పుచ్చు కున్నారు. ఈశ్వర్ సినిమా నుంచి ప్రభాస్ హీరోయిజం ఫ్యాన్స్ ని ఏర్పరచింది. ఇక వరుస మాస్ సినిమాలు చేయడంతో రెబల్ స్టార్ గా ఆయన తన సత్తా చాటుతూ వచ్చారు. బాహుబలితో పాన్ ఇండియా లెవెల్ లో ప్రభాస్ మాస్ స్టామినా ఏంటన్నది ప్రూవ్ అయ్యింది. అప్పటి నుంచి రెబల్ స్టార్ పాన్ ఇండియా సినిమాలతోనే హంగామా చేస్తున్నారు.
ఐతే ప్రస్తుతం సందీప్ వంగాతో స్పిరిట్ చేస్తున్న ఈ టైంలో అల్లు అర్జున్ రెబల్ స్పిరిట్ ఉన్న టీ షర్ట్ తో కనిపించడం అది కూడా ఎప్పుడో పాత వీడియోలో అలా చూడటం అల్లు రెబల్ ఫ్యాన్స్ కే కాదు అల్లు ఫ్యాన్స్ కి సూపర్ హ్యాపీగా ఉంది. అప్పుడే రెబల్ స్టార్ స్పిరిట్ టైటిల్ తో సినిమా చేస్తాడని ఎవరు ఊహించి ఉండరు. కానీ ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ సినిమా చేస్తుండటంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
యానిమల్ తర్వాత సందీప్ అసలు సిసలు పాన్ ఇండియా స్టార్ తో..
రెబల్ స్పిరిట్ ఈ టైటిల్ కి తగినట్టుగానే సందీప్ వంగ తన సినిమా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. యానిమల్ తర్వాత సందీప్ అసలు సిసలు పాన్ ఇండియా స్టార్ తో స్పిరిట్ చేస్తుండటం వల్ల ఈ మూవీపై బజ్ ఒక రేంజ్ లో ఉంది. ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్ గా నటిస్తుందని తెలిసిందే.
ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప సినిమాతో పాన్ ఇండియా సెన్సేషన్ సృష్టించిన ఐకాన్ స్టార్ నెక్స్ట్ అట్లీ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ అప్పీల్ తో వస్తుందని తెలుస్తుంది. సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దీపిక పదుకొనె, మృణాల్ ఠాకూర్, జాన్వి కపూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.