బన్నీ,అట్లీ మూవీ గూస్ బప్స్ గ్యారంటీ కానీ..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ 'పుష్ప 2'తో ఊహించని హైట్స్‌కి చేరింది. స్టార్‌గా సరికొత్త స్టార్‌డమ్‌ని తెచ్చి పెట్టింది.;
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ 'పుష్ప 2'తో ఊహించని హైట్స్‌కి చేరింది. స్టార్‌గా సరికొత్త స్టార్‌డమ్‌ని తెచ్చి పెట్టింది. తెలుగు రాష్ట్రాల వరకు పరిమితమైన బన్నీ క్రేజ్‌ని దేశ వ్యాప్తంగా చేసింది. 'పుష్ప 2'తో బన్నీ ఇండియా నలుమూలల్లో ఉన్న ప్రేక్షకులకు చేరువయ్యాడు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నాడు. దానికి తగ్గట్టుగానే తదుపరి చిత్రాలని ఎంచుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండియాగా నిలవాలని ఒక్కో మూవీని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భారీ పాన్ వరల్డ్ మూవీకి శ్రీకారం చుట్టడం తెలిసిందే.
'పుష్ప 2'తో గ్లోబల్ స్టార్‌గా మారిన బన్నీ ఇమేజ్‌కు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ఈ మూవీని సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అత్యంత భారీగా పాన్ వరల్డ్ మూవీగా నిర్మిస్తున్నారు. బన్నీ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ని ప్రకటిస్తూ బన్నీ లుక్‌ని రిలీజ్ చేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. గుండుతో వోల్ఫ్ హ్యాండ్‌తో అల్లు అర్జున్ కనిపించిన తీరు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది. ఈ మూవీకి 'రాకా' అనే గమ్మత్తైన టైటిల్‌ని ఖరారు చేశారు. బన్నీ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. గతంలో కొన్ని టైటిల్స్ ప్రచారంలో ఉన్నా వాటికి పూర్తి భిన్నంగా 'రాకా' అనే టైటిల్‌ని ఫైనల్ చేశారు.
హాలీవుడ్ మార్కు సినిమాగా దీన్ని ప్రపంచ వ్యాప్తంగా వైరల్ చేయాలన్న ఉద్దేశ్యంలో భాగంగానే తెలుగు నేటివిటీకి పూర్తి భిన్నమైన టైటిల్‌ని అట్లీ ఫైనల్ చేసినట్టుగా కనిపిస్తోంది. సూపర్ హీరో మూవీగా అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీలోని వీఎఫ్ ఎక్స్ హాలీవుడ్ సినిమాలస్థాయిలో ఉంటాయని తెలుస్తోంది. ఫస్ట్ లుక్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అయితే ఇక్కడే ఓ చిక్కొచ్చిపడింది. అదే బన్నీ వోల్ఫ్ హ్యాండ్.. గుండు లుక్. 'ఐ' సినిమాలోని ఓ పాటలో విక్రమ్ యానిమల్ లుక్‌లో కనిపించాడు. దానికి మంచి అప్లాజ్ వచ్చింది.
అయితే సినిమాలో కురూపిగా..వైరస్ సోకిన వ్యక్తిగా కనిపించడాన్ని ప్రేక్షకులు పెద్దగా జీర్ణించుకోలేకపోయారు. కథలో డెప్త్ లేకపోవడం, ఆశించిన స్థాయిలో సీన్‌లు లేకపోవడం, రివేంజ్ డ్రామాగా సినిమాని ఓ వైరస్ చుట్టూ తిప్పడం జనాలకు పెద్దగా నచ్చలేదు. పైగా హీరోని కురూపిగా, అంద వికారంగా చూపిస్తే ప్రేక్షకులు ఇష్టపడరు. ఈ సినిమా అదే విషయాన్ని నిరూపించి బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. బన్నీ, అట్లీ మూవీ ఫస్ట్ లుక్ కూడా అదే ఛాయలు కనిపిస్తుండటంతో స్టైలిష్ స్టార్‌గా కనిపించే బన్నీ ఇలా తోడేలుగా కనిపించడం ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
'పుష్ప' కంటే 'పుష్ప 2' రికార్డు స్థాయి విజయాన్ని సాధించింది అంటే దానికి ప్రధాన కారణం బన్నీ క్యారెక్టరైజేషన్..సినిమాలో రూటెడ్ సీన్స్.. క్యారెక్టర్ వ్యక్తిత్వం.. అయితే ఇందుకు పూర్తి భిన్నంగా 'రాకా'ని అట్లీ రూపొందిస్తున్నట్టుగా ఫస్ట్ లుక్ పోస్టర్ కనిపిస్తోంది. అయితే కంటెంట్ బలంగా ఉండి..ప్రేక్షకుల్ని అబ్బురపరిచే సీన్‌లతో కట్టిపడేస్తే 'రాకా' కూడా అద్భుతం చేసే అవకాశం ఉంది. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఉంటే మాత్రం బన్నీ ఖాతాలో మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సడటం పక్కా.. అలా కాకుండా బన్నీని అంద వికారంగా 'ఐ'లో విక్రమ్‌లా అంద వికారంగా చూపిస్తే మాత్రం కష్టమనే కామెంట్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.