• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప 2 ట్రైలర్.. కౌంట్...

పుష్ప 2 ట్రైలర్.. కౌంట్ డౌన్ మొదలైంది

| పుష్ప 2 ట్రైలర్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సమయంలో ట్రైలర్ ఎడిటింగ్ వర్క్ ఫినిష్ అయినట్లు ఒక క్లారిటీ ఇచ్చేశారు.

By - Tupaki Desk
Update: 2024-11-08 11:49 GMT

ఇండియన్ సినీ ప్రేమికులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పుష్ప రాజ్ ఘడియలు వచ్చేశాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా పుష్ప 2: ది రూల్ ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. “ద రూల్ టేక్స్ ఓవర్” అంటూ మేకర్స్ క్రియేట్ చేసిన బజ్ సడెన్ గా సోషల్ మీడియాను ఊపేసింది. ఈ ట్రైలర్ విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు.

సుకుమార్ దర్శకత్వంలో 2021 లో విడుదలైన పుష్ప: ది రైజ్ ఎవరు ఊహించని రీతిలో మంచి విజయాన్ని అందుకుంది. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో నెవ్వర్ బిఫోర్ అనేలా కనిపించి ప్రేక్షకులను కట్టిపడేశారు. ఈ సినిమాలోని మాస్ ఎలిమెంట్స్, మ్యూజిక్, సూపర్బ్ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అందుకు కొనసాగింపుగా రూపొందిస్తున్న పుష్ప 2: ది రూల్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

ఈ సినిమా ఫస్ట్ పార్ట్ కంటే మరింత అద్భుతంగా ఉంటుందని, పుష్పరాజ్ పాత్ర మరింత పవర్ఫుల్ గా రూపొందించారని సమాచారం. డిసెంబర్ 5 ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2: ది రూల్ గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. అన్ని ప్రధాన భాషలలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో తిరిగి వస్తుండటంతో ఫ్యాన్స్ ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు. పుష్ప 2 ట్రైలర్ కోసం కూడా ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సమయంలో ట్రైలర్ ఎడిటింగ్ వర్క్ ఫినిష్ అయినట్లు ఒక క్లారిటీ ఇచ్చేశారు.

ఇక సినిమాకి సంబంధించిన లీక్స్ కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పుష్పరాజ్ స్మగ్లర్ గానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా మారిపోతాడని అందుకు సంబంధించిన ఎపిసోడ్ కూడా సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ చూస్తుంటే సినిమా కథ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని అర్థం అవుతోంది. ముఖ్యంగా సుకుమార్ కేవలం మాస్ ఎంటర్టైనర్ గా కాకుండా కథలో ఎమోషనల్ అంశాలు జోడించినట్లు టాక్.

పుష్ప 2లోని పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చిత్రానికి పెద్ద ఎసెట్ గా మారబోతున్నాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కోసం మరొక సంగీత దర్శకుడు వర్క్ చేయనున్నట్లు టాక్ వస్తోంది. ఇక ప్రతీ పాట కూడా భారీగా సక్సెస్ అయ్యేలా చాన్స్ ఉందట. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ట్రైలర్ లో సినిమా బ్యాక్ గ్రౌండ్ ఎలా ఉంటుందనేది చూడాలి.

The wait ends!The Rule takes over 💥💥𝐓𝐇𝐄 𝐓𝐑𝐀𝐈𝐋𝐄𝐑 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 𝐅𝐈𝐋𝐌 𝐈𝐒 𝐋𝐎𝐂𝐊𝐄𝐃 🔒❤️‍🔥#Pushpa2Trailer Announcement is on the way🔥#Pushpa2TheRule GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER, 2024.#Pushpa2TheRuleOnDec5th

— Mythri Movie Makers (@MythriOfficial) November 8, 2024
Tags:    
  • Pushpa2 
  • Pushpa2trailer 
  • Alluarjun 
  • Sukmar 
  • Mythrimoviemakers 
  • Tollywood 
  • Panindianmovie 
  • Rashmikamandanna 
  • Sunil 
  • Fahadhfaisal 
  • Pushparaj 

Similar News

మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు పవన్ ఎందుకు రాలేదు?

2026-11-06 03:49 GMT

Bigg Boss Telugu 10: టాప్ వోటింగుతో దూసుకుపోతున్న ముఖేష్!

2026-11-06 03:47 GMT

Vijay Sethupathi: ఎంత గొప్పవారు మీరు..!

2026-11-06 01:49 GMT

బెబో స్పూర్తితో సైజ్ జీరోకి మారిన 'అర్జున్ రెడ్డి' బ్యూటీ

2026-11-06 01:46 GMT

తమిళ సినిమాలకు తెలుగులో తగ్గుతున్న క్రేజ్..!

2026-11-06 01:45 GMT

భార్య 10PM అల‌వాటుకు అగ్ర హీరోలో కంగారు!

2026-11-06 01:44 GMT

మరి ఇంతలా అవసరమా విజయ్, త్రిష..!

2026-11-06 01:43 GMT

రజినీకాంత్ వల్ల తెలుగు హీరో రామ్‌కు బ్రేకులు..!

2026-11-06 01:30 GMT

ప్రేక్షకుల పరిణతికి నిదర్శనం.. ఒరిజిన‌ల్ క‌థ‌లు, క్రియేటివిటీకి ప‌ట్టం!

2026-11-06 00:30 GMT

మరిచిపోతున్న సినిమాకి హంగులు ఎందుకు..!

2026-11-06 00:30 GMT

హీరో ఇమేజ్ ప్రెజర్‌తో దెబ్బతింటున్న కొత్త కథలు.. ఇదే అసలు సమస్య!

2026-11-05 23:30 GMT

సెన్సార్షిప్‌లో మార్పులు.. నేటిత‌రం ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్ తెలుసుకోవాల్సిన‌వి!

2026-11-05 22:30 GMT

Copyright @2026

Powered by Blink CMS