యావరేజ్‌లను ఒప్పుకోవడం లేదు : అల్లు అర్జున్‌

ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా కోసం నటీనటులు ఎంతగా కష్టపడాలో చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో చేసిన ఆల్ఫా మూమెంట్‌ ను గురించి కూడా అల్లు అర్జున్‌

Update: 2026-09-01 05:38 GMT

'పుష్ప' తర్వాత అల్లు అర్జున్‌ పాన్‌ ఇండియా స్టార్‌ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమాకు వచ్చిన వసూళ్లు మాత్రమే కాకుండా, ఆ సినిమాకు వచ్చిన అవార్డ్‌లు అల్లు అర్జున్‌ను నేషనల్‌ స్టార్‌గా మార్చాయి అనడంలో సందేహం లేదు. అందుకే తాజాగా అల్లు అర్జున్‌ ఏకంగా ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్‌ కవర్‌ పేజ్‌ పై కనిపించాడు. సౌత్‌ స్టార్స్ అరుదుగా కనిపించే ఈ కవర్‌ పేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్‌ కోసం అల్లు అర్జున్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా కోసం నటీనటులు ఎంతగా కష్టపడాలో చెప్పుకొచ్చాడు. ఇప్పటి వరకు తన కెరీర్‌లో చేసిన ఆల్ఫా మూమెంట్‌ ను గురించి కూడా అల్లు అర్జున్‌ చెప్పుకొచ్చాడు.

అల్లు అర్జున్‌ పుష్ప సినిమాలో...

పుష్ప సినిమాలో వేసిన లేడీ గెటప్‌ తన కెరీర్‌లోనే మోస్ట్‌ ఆల్ఫా మూమెంట్‌ అని చెప్పుకొచ్చాడు. జాతర సీన్‌ కోసం అల్లు అర్జున్‌ చీర కట్టడం అప్పుడు ఏ స్థాయిలో చర్చనీయాంశం అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్టార్‌డం పక్కన పెట్టి మరీ అల్లు అర్జున్‌ చీర కట్టిన తీరుకు అంతా కూడా ఫిదా అయ్యారు. గంగమ్మ జాతర సీన్‌ కోసం అల్లు అర్జున్‌ కట్టిన చీర కట్టు సినిమా స్థాయిని అమాంతం పెంచింది. స్టార్‌డం పక్కన పెట్టి కేవలం కంటెంట్‌ కోసం చీర కట్టడం అనేది కేవలం అల్లు అర్జున్‌కే చెల్లింది అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. అందుకే మోస్ట్‌ ఆల్ఫా మూమెంట్‌ అంటూ అల్లు అర్జున్‌ చీర కట్టు గురించి ఫోర్బ్స్‌ ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. కంటెంట్‌ బలంగా ఉండటం వల్లే చీర కట్టుకు బన్నీ ఓకే చెప్పాడని ఆయన అభిమానులు, సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప జాతర సీన్‌లో చీర కట్టిన అల్లు అర్జున్‌...

ఇంకా అల్లు అర్జున్‌ సదరు ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రేక్షకులు యావరేజ్‌ సినిమాలను ఒప్పుకోవడం లేదు, స్టార్‌డం చూపిస్తూ చేసే సినిమాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం కంటెంట్‌ ఉన్న సినిమాలను మాత్రమే చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే స్టార్‌డం పక్కన పెట్టి కంటెంట్‌ కోసం ఎంత దూరం అయినా వెళ్లాలి అన్నట్లు అల్లు అర్జున్‌ వ్యాఖ్యలు చేశారు. పుష్ప సినిమాలో తన స్టార్‌డంను పూర్తిగా పక్కన పెట్టి నటించిన అల్లు అర్జున్‌ ప్రస్తుతం రాకా సినిమా కోసం అంతకు మించి అన్నట్లు నటిస్తున్నట్టు సమాచారం అందుతోంది. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న రాకా సినిమా కోసం అభిమానులతో పాటు అన్ని వర్గాల వారు, ముఖ్యంగా బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఫోర్బ్స్ ఇండియా కవర్‌ పై అల్లు అర్జున్‌..

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అట్లీ సినిమాను రూపొందిస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. ఇప్పటి వరకు సినిమా గురించి టైటిల్‌ తప్ప మరే విషయం తెలియదు. హీరోయిన్స్ విషయమై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అట్లీ అండ్‌ టీం నుంచి క్లారిటీ లేదు. అల్లు అర్జున్‌ కి జోడీగా దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తుంది అనే విషయం మాత్రం అధికారికంగా ప్రకటన చేశారు. అయితే మరో ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు అనే విషయాన్ని ధృవీకరించింది లేదు. సినిమా మొత్తం ముంబైలో అత్యంత రహస్యంగా, సెక్యూరిటీ మధ్య షూట్‌ చేస్తున్నారు. దాంతో ఎలాంటి లీక్‌లు బయటకు రావడం లేదు. వచ్చే ఏడాదిలో సినిమా విడుదల కాబోతుంది.

Tags:    

Similar News