రీ-రిలీజ్‌కే ఇంత క్రేజ్… అల్లు ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ టాప్ ట్రెండ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ తెలుగు రాష్ట్రాలు దాటి దేశవ్యాప్తంగా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ తెలుగు రాష్ట్రాలు దాటి దేశవ్యాప్తంగా ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కేరళలో ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. తాజాగా అక్కడ బన్నీ పాత సినిమా 'హ్యాపీ' రీ-రిలీజ్ కాగా, మలయాళ ప్రేక్షకులు థియేటర్లను కాస్తా జాతరలా మార్చేశారు. మన తెలుగు రాష్ట్రాల రేంజ్‌లో అబ్బాయిలు, అమ్మాయిలు కలిసి థియేటర్ స్క్రీన్ల ముందు ఊరమాస్ డాన్సులు వేస్తూ చేసిన రచ్చ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌గా మారింది. ఆ విశేషాలు చూద్దాం
కేరళలో 'మల్లు అర్జున్' మ్యాజిక్:
మన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌ను కేరళ జనాలు కేవలం ఒక డబ్బింగ్ స్టార్‌లా చూడరు, తమ సొంత మలయాళ హీరోలాగే ఓన్ చేసుకుంటారు. అందుకే ఆయనను అక్కడ ప్రేమగా 'మల్లు అర్జున్' అని పిలుచుకుంటారు. గతంలో 'ఆర్య', 'దేశముదురు' పుష్ప సినిమాలతోనే బన్నీ అక్కడ జెండా పాతేశారు. తాజాగా రీ-రిలీజ్ అయిన 'హ్యాపీ' సినిమా థియేటర్ల వద్ద కనిపిస్తున్న హంగామా చూస్తుంటే కేరళలో బన్నీ స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ అయింది.
అప్పట్లో యావరేజ్.. ఇప్పుడు కేరళలో ఊచకోత:
ఇక కరుణాకరణ్ అంటే లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ అంటారు. మరి అయన దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీ' సినిమా అప్పట్లో తెలుగులో రిలీజ్ అయినప్పుడు మొదట యావరేజ్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత టీవీల్లో, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో క్లాసిక్‌గా నిలిచింది. అయితే మలయాళంలో మాత్రం ఈ సినిమా అప్పట్లోనే ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ రీ-రిలీజ్ చేస్తే, అక్కడ థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో దర్శనమివ్వడం విశేషం.
స్క్రీన్ల ముందు మలయాళ కుట్టీల డాన్సులు:
సాధారణంగా సినిమాల రీ-రిలీజ్ ట్రెండ్, థియేటర్లలో పేపర్లు చల్లడం, గోల చేయడం మన తెలుగు రాష్ట్రాలకే పరిమితం అనుకుంటారు. కానీ కేరళ థియేటర్లలో 'ఓస్సా.. ఓస్సా' సాంగ్ వస్తుంటే మలయాళ ఫాన్స్ తేడా లేకుండా సీట్లలోంచి లేచి థియేటర్ ముందే మాస్ స్టెప్పులు వేశారు. ఇక ఆ డాన్స్ వీడియోలు చూస్తుంటే ఇది కేరళ థియేటరా లేక తెలుగు థియేటరా అనే డౌట్ రాక మానదు.
బన్నీ భాస్కర్ క్యారెక్టర్ ఎప్పటికీ ఎంటర్‌టైనరే:
ఈ సినిమాలో అల్లు అర్జున్ 'బన్నీ భాస్కర్' అనే పిజ్జా డెలివరీ బాయ్ పాత్రలో ఫుల్ కామెడీతో, ఎనర్జీతో నవ్వించారు. జెనీలియా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కీలక రోల్ చేశారు. ఇక వీరందరి నటనతో పాటు యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్, అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు ఈ సినిమాను కేరళ ఆడియన్స్‌కు ఎప్పటికీ ఫేవరెట్‌గా మార్చేశాయి.
ఒక తెలుగు హీరో పాత సినిమాకు కేరళలో ఈ రేంజ్ ఇంపాక్ట్ మరియు సెలబ్రేషన్స్ కనిపించడం నిజంగా అరుదైన విషయం. ఇది అల్లు అర్జున్ వన్ అండ్ ఓన్లీ పాన్-ఇండియా క్రేజ్‌కు అసలైన నిదర్శనం. రాబోయే పుష్ప3, రాక లాంటి భారీ చిత్రాలతో మల్లు అర్జున్ కేరళ బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడతాడో చూడాలి.