అల్లు అర్జున్ అట్లీ టైటిల్ అదేనా..?
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.;
పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. సినిమాను ఒక సూపర్ హీరో మూవీగా ప్లాన్ చేస్తున్నారని అనౌన్స్ మెంట్ వీడియోతోనే అర్ధమయ్యింది. హాలీవుడ్ మార్వెల్ సీరీస్, అవెంజర్స్ లాంటి క్రేజీ యాక్షన్ హీరోస్ తరహా కథతోనే ఈ సినిమా రాబోతుందని టాక్. అంతేకాదు ఈ సినిమాలో హీరో విలన్ రెండూ అల్లు అర్జునే అంటూ ఒక వార్త వైరల్ అవుతుంది. యాక్షన్ సినిమాల్లో తన మార్క్ సెట్ చేసుకున్న అట్లీ అల్లు అర్జున్ తో చాలా పెద్ద స్కెచ్చే వేసినట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమా లో హీరోయిన్స్ గా క్రేజీ భామలను తీసుకుంటున్నారని టాక్. దీపిక పదుకొనె, మృణాల్ ఠాకూర్, భాగ్య శ్రీ ఇలా ఐదుగురు హీరోయిన్స్ ని ప్లాన్ చేస్తున్నారట. ఓ విధంగా ఈ హీరోయిన్ కూడా ఈ సినిమాకు ప్లస్ అవుతారనే చెప్పొచ్చు. అల్లు అర్జున్ అట్లీ సినిమా టైటిల్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా టైటిల్స్ గా ఒకటి రెండు టైటిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు అర్జున్ సినిమాకు ఐకాన్ అనే టైటిల్ ని పెడతారనే టాక్ ఉంది. ఆల్రెడీ అల్లు అర్జున్ కోసం తెలుగు దర్శకుడు వేణు శ్రీరామ్ ఆ టైటిల్ ని అనుకున్నాడు కానీ ఆ సినిమా మెటీరియలైజ్ అవ్వలేదు. మరోపక్క అట్లీ ఈ సినిమాలో అల్లు అర్జున్ ని సూపర్ హీరోగా చూపిస్తున్నాడు కాబట్టి ఈ సినిమాకు టైటిల్ కూడా సూపర్ హీరో అని పెడతారని అంటున్నారు. ఐకాన్, సూపర్ హీరో ఈ రెండిటిలో ఒకటి ఈ మూవీ టైటిల్ అంటున్నారు. ఐతే ఈ రెండు టైటిల్స్ నిజంగానే పరిగణలో ఉన్నాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
పుష్ప 2 తో మాస్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ అట్లీతో టెక్నికల్ గా హై స్టాండర్డ్ మూవీతో రాబోతున్నాడు. ఈ సినిమా నుంచి వచ్చిన అనౌన్స్ మెంట్ వీడియోనే భారీ హైప్ క్రియేట్ చేసింది. తప్పకుండా అట్లీ బన్నీ ఫ్యాన్స్ అంచనాలకు తగ్గకుండా ఈ సినిమా చేస్తాడని చెప్పుకుంటున్నారు. మరి ఈ సినిమా రేంజ్ ఏంటన్నది సినిమా నుంచి టీజర్, ట్రైలర్ వస్తేనే తెలుస్తుంది.