అట్లీ మాంచి స్పీడు మీదున్నాడుగా!

AA22xA6 వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే అల్లు అర్జున్- అట్లీ మూవీ అప్పుడే 50 రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుంద‌ట‌.;

Update: 2025-09-10 08:03 GMT

పుష్ప‌2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో త‌న మార్కెట్ ను, క్రేజ్‌ను పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న త‌ర్వాతి సినిమాను స్టార్ డైరెక్ట‌ర్ అట్లీతో చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సైన్స్ ఫిక్ష్ సినిమాగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఈ సినిమా విష‌యంలో కాస్టింగ్ నుంచి టెక్నిక‌ల్ టీమ్ వ‌ర‌కు ఏ అంశంలోనూ మేక‌ర్స్ రాజీ ప‌డ‌టం లేదు.

భారీ స్థాయిలో విజువ‌ల్ ఎఫెక్ట్స్

ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ దీపికా ప‌దుకొణె బ‌న్నీకి జోడీగా న‌టిస్తుండ‌గా, త‌మిళ క‌మెడియ‌న్ యోగి బాబు కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. బ‌న్నీ- అట్లీ క‌ల‌యిక‌లో తెర‌కెక్క‌నున్న ఈ మూవీ ఇండియ‌న్ సినిమాల్లోనే ప్ర‌తిష్టాత్మ‌క ప్రాజెక్టుగా రూపొందుతుంది. ఈ సినిమాలో విజువ‌ల్స్ ఎఫెక్ట్స్ భారీ స్థాయిలో ఉప‌యోగించ‌నుండ‌గా వాటి కోసం మేక‌ర్స్ హాలీవుడ్ నుంచి టెక్నీషియ‌న్ల‌ను రంగంలోకి దింపింది.

50 రోజుల షూటింగ్ పూర్తి చేసుకున్న AA22xA6

ఈ సినిమా నిర్మాణంలో వివిధ అంత‌ర్జాతీయ స్టూడియోలు కూడా స‌హ‌కరిస్తాయ‌ని ప్ర‌చారాలు జ‌రుగుతున్నాయి. కాగా ఇందులో అల్లు అర్జున్ పాత్ర యానిమేటెడ్ వెర్ష‌న్ లో డిఫ‌రెంట్ పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. AA22xA6 వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఇప్ప‌టికే అల్లు అర్జున్- అట్లీ మూవీ అప్పుడే 50 రోజుల షూటింగ్ ను పూర్తి చేసుకుంద‌ట‌. చూస్తుంటే అట్లీ ఈ సినిమాను అనుకున్న దాని కంటే వేగంగానే పూర్తి చేసేలా క‌నిపిస్తున్నారు.

రొటీన్ జాన‌ర్ల‌కు భిన్నంగా..

ఈ సినిమాను అట్లీ రొటీన్ జాన‌ర్ల‌కు భిన్నంగా చాలా డిఫ‌రెంట్ జాన‌ర్ లో తెర‌కెక్కిస్తున్నార‌ని, ప్యూర్ పాన్ వ‌ర‌ల్డ్ అప్పీల్ కంటెంట్ తో చాలా భారీగా తీస్తున్నార‌ని అంటున్నారు. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ లో క‌ళానిధి మార‌న్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2027లో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News