అల్లు అర‌వింద్ ముందే లాక్ చేసారా?

ఆ సంస్థ పేరుతో మార్కెట్ లోకి సినిమా వ‌చ్చిందంటే? ఎంతో ప్ర‌త్యేకంగానే హైలైట్ అవుతుంది.;

Update: 2025-11-04 10:30 GMT

నిర్మాత‌గా అల్లు అర‌వింద్ ప్ర‌స్థానం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎంతో మంది స్టార్ హీరోల‌తో సినిమాలు చేసారు. న‌వ‌త‌రం న‌టుల‌తోనూ సినిమాలు చేయ‌డం ఆయ‌న ప్ర‌త్యేక‌త‌. ప్ర‌తిభావంతుల్ని సైతం ప్రోత్స‌హించి వెలుగులోకి తెస్తుంటారు. ఇత‌ర నిర్మాత‌ల‌తో క‌లిసి గీతా ఆర్స్ట్ నిర్మాణంలోనూ చాలా సినిమాలు నిర్మించారు. స‌మ‌ర్ప‌కుడిగా ఎన్నో సినిమాల‌కు ప‌ని చేసారు. క‌థ న‌చ్చిదంటే కొత్త నిర్మాత‌ల్ని ఎంకరేజ్ చేయ‌డంలో ఎంత మాత్రం ఆలోచించ‌రు. త‌న సంస్థ గీతా ఆర్స్ట్ బ్యాన‌ర్ అనే బ్రాండ్ పేరునే పెట్టుబ‌డిగా పెడుతుంటారు.

ఆ సంస్థ పేరుతో సినిమా ఓ బ్రాండ్:

ఆ సంస్థ పేరుతో మార్కెట్ లోకి సినిమా వ‌చ్చిందంటే? ఎంతో ప్ర‌త్యేకంగానే హైలైట్ అవుతుంది. గీతా ఆర్స్ట్ కి అనుబంధంగా జీఏ2 పిక్చ‌ర్స్ కూడా స్థాపించి త‌న స‌న్నిహితుల భాగ‌స్వామ్యంలో సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా ప‌లు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టి `ది గ‌ర్ల్ ప్రెండ్` చిత్రం ఒక‌టి. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మికా మంద‌న్నా న‌టిస్తోన్న చిత్ర‌మిది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ లేడీ ఓరియేంటెడ్ చిత్రంగా హైలైట్ అయిన చిత్రం రిలీజ్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి అలాంటి సినిమా కాదంటూ కొత్త ప్ర‌చారం మొద‌లు పెట్టారు.

రిలీజుకు ముందు అడ్వాన్స్:

ఇందులో హీరోగా, ర‌ష్మికకు జోడీగా దీక్షిత్ న‌టిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అత‌డి పేరును ఇప్పుడు ప్ర‌ధానంగా హైలైట్ చేస్తున్నారు. తాజాగా దీక్షిత్ తో అల్లు అర‌వింద్ మ‌రో సినిమా చేయ‌డానికి కూడా ఒప్పందం చేసుకున్న‌ట్లు వెలుగు లోకి వ‌చ్చింది. స్వ‌యంగా ఈ విష‌యాన్ని దీక్షిత్ వెల్ల‌డించాడు. `ది గ‌ర్ల్ ప్రెండ్` లో దీక్షిత్ శెట్టి న‌ట‌న న‌చ్చి నిర్మాత అల్లు అర‌వింద్ ప్ర‌త్యేకంగా ప్ర‌శంసించ‌డంతో పాటు, త‌మ బ్యాన‌ర్లో మ‌రో సినిమాకు అవ‌కాశం క‌ల్సించిన‌ట్లు వెల్ల‌డించాడు. ఆ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ కూడా ఇచ్చిన‌ట్లు తెలిపాడు.

హీరోను డామినేట్ చేయ‌దుగా:

ఇంత‌కీ ఎవ‌రీ దీక్షిత్ శెట్టి అంటే? ఇత‌డు క‌న్న‌డ న‌టుడు. తెలుగు సినిమాలు కొత్తేం కాదు. ఐదేళ్ల క్రిత‌మే దీక్షిత్ కెరీర్ టాలీవుడ్క లో మొద‌లైంది.  'ముగ్గురు మొన‌గాళ్లు' సినిమాతో లాంచ్ అయ్యాడు. అటుపై 'ద‌స‌రా,' ది` రోజ్ విల్లా`లో న‌టించాడు. 'ద‌స‌రా' అనంత‌రం మ‌ళ్లీ క‌న్న‌డ సినిమాలతో బిజీ అయ్యాడు. మ‌ళ్లీ కొంత గ్యాప్ అనంత‌రం `ది గ‌ర్ల్ ప్రెండ్` లో ఛాన్స్ అందుకున్నాడు. ఈ సినిమాలో హీరో రోల్ కావ‌డంతో? ఫోక‌స్ అవ్వ‌డానికి ఛాన్స్ ఉంది. మ‌రి హీరో పాత్ర‌ను ర‌ష్మిక రోల్ డిమాండ్ చేస్తే మాత్రం స‌న్నివేశం మ‌రోలా ఉంటుంది.

Tags:    

Similar News