• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆలియా ఫ్రెండు టాలీవుడ్...

ఆలియా ఫ్రెండు టాలీవుడ్ ఎంట్రీ

| తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయాణం ఇప్పుడిప్పుడే ప్రారంభం కాగా, ఆకాంక్ష అందం ఆకర్షణ ప్రతిభ ఇప్పటికే యువ‌ హృదయాలను కొల్లగొట్టాయి.

By - Tupaki Desk
Update: 2024-02-25 15:30 GMT

ఇటీవ‌ల నార్త్ నుంచి సౌత్ ని టార్గెట్ చేస్తున్న క‌థానాయిక‌ల సంఖ్య అమాంతం పెరుగుతోంది. ఆలియా భ‌ట్, జాన్వీ క‌పూర్, అన‌న్య పాండే, ఖుషి క‌పూర్ .. ఇలా వ‌రుస‌గా భామ‌లంతా సౌత్ పై దృష్టి సారించారు. ఇప్పుడు వీళ్ల బాట‌లోనే మ‌రో క‌పూర్ గాళ్ బ‌రిలో దిగుతోంది. పేరు ఆకాంక్ష రంజ‌న్ క‌పూర్.


సివి కుమార్ తెలుగు చిత్రం `మాయ వన్‌`లో న‌టిస్తోంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయాణం ఇప్పుడిప్పుడే ప్రారంభం కాగా, ఆకాంక్ష అందం ఆకర్షణ ప్రతిభ ఇప్పటికే యువ‌ హృదయాలను కొల్లగొట్టాయి. ఈ రైజింగ్ స్టార్ గురించి తెలియాల్సింది నిజానికి చాలానే ఉంది. ఇంత‌లోనే ప్ర‌ఖ్యాత యు అండ్ ఐ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై ఆకాంక్ష ద‌ర్శ‌న‌మిచ్చింది. ఈ బ్యూటీ కిల్ల‌ర్ లుక్ యువ‌త‌రం గుండెల్లోకి దూసుకెళుతోంది.

`మార్చి` సంచికలో ఆకాంక్ష‌ ప్రత్యేక ఇంటర్వ్యూతో అభిమానుల ముందుకు రానుంది. ఈ ఇంట‌ర్వ్యూలో ఆకాంక్ష‌ ప్రయాణం, ఆకాంక్షలు, పెద్ద స్క్రీన్‌పైకి రావ‌డం వెన‌క‌ మాయాజాలం గురించి మాట్లాడింది. అలాగే ప్ర‌ముఖ జాతీయ మీడియా ఇంట‌ర్వ్యూలో ఆకాంక్ష కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించింది.

``సౌత్ సినిమా చేయడానికి ఇది సరైన సమయం`` అని త‌న స్నేహితురాలు అలియా భట్ త‌న‌కు చెప్పారని ఆకాంక్ష రంజన్ కపూర్ అన్నారు. గిల్టీ -మోనికా ఓ మై డార్లింగ్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ఆకాంక్ష రంజన్ కపూర్ తెలుగులో `మాయ వన్` సినిమాతో అరంగేట్రం చేస్తోంది. OTT ఆధారిత ప్రాజెక్ట్‌ల తర్వాత ఇది ఆకాంక్ష‌కు మొదటి థియేట్రికల్ విడుదల. త‌న‌ ప్రతిభను గుర్తించి అవ‌కాశాలు అందించే ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేస్తాన‌ని ఆకాంక్ష ఈ సంద‌ర్భంగా తెలిపింది.

నేను నా ప్రాజెక్ట్‌లను ర‌క‌ర‌కాలుగా విశ్లేషించుకుని ఎంచుకుంటాను. అయితే సౌత్ అనేది నేను చాలా కాలంగా అడుగుపెట్టాలనుకుంటున్న ప‌రిశ్ర‌మ‌. కానీ దానిని చురుగ్గా ఎలా కొనసాగించాలో నాకు తెలియదు. `మాయ వన్`లో న‌టించాల‌ని దక్షిణాది నుండి ఒక ఏజెంట్ నాకు కాల్ చేసినప్పుడు సెటప్ గురించి ఇప్పుడే చెప్పాను.. నేను కథనం వినకముందే...ఈ చిత్రానికి అవును అని చెప్పాను. ఇది క‌చ్చితంగా కొత్త ప్రేక్షకులను థియేట‌ర్ల‌కు ర‌ప్పంచే సినిమా. అలాగే కొత్త తలుపులను తెరుస్తుంది. నాలాంటి కొత్త నటికి అవసరమైన మరెన్నో అవకాశాలను తెస్తుంది అని తెలిపింది.

భాషాపరమైన అవరోధం కారణంగా సెట్‌లో ఎదురైన సవాళ్ల గురించి ఆకాంక్ష ఇలా తెలిపింది. మొదట్లో మాయ వన్ సెట్‌లో నా గురించి ఎవరికీ తెలియనందున చాలా భయంకరంగా ఉండేవి. నేను మొదటిసారిగా టీమ్‌ను కలుస్తున్నాను. హైదరాబాదుకి కూడా వెళ్ళలేదు. భాషా స‌మ‌స్య వ‌ల్ల‌ నేను సంభాషణలను అర్థం చేసుకోలేకపోయాను. అయినప్పటికీ నేను చేసే పనిని ఇష్టపడుతున్నాను. నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి ఒక్కో అడుగు వేస్తున్నాను. దానికి నేను కృతజ్ఞురాలిని అని తెలిపింది.

న‌న్ను నేను ఒక గదిలో బంధించి ఏడ్చిన రోజులు ఉన్నాయి. నేను చాలా కష్టతరమైన పరిశ్రమలలో ఒకదానిలో ఉన్నాను అని నాకు తెలుసు. జ‌నం నా OTT ప్రాజెక్ట్ ఎంపికను ప్రశ్నించారు. కానీ నేను ఎంచుకోవడానికి అనేక ఆఫర్‌లు లేవు. నన్ను నేను నిరూపించుకోవడానికి ఒకే ఒక్క అవకాశం ఉంది. నేను దానిని స్వీకరించాను... అని కెరీర్ ఆరంభ రోజుల గురించి విశ్లేషించింది.

అలియా భట్ కి ఆకాంక్ష‌ చాలా కాలంగా స‌న్నిహితురాలు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అకాంక్ష‌ అరంగేట్రం చేసినందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఆనందాన్ని వ్యక్తం చేసింది అలియా. నా ఇతర సన్నిహితుల మాదిరిగానే అలియా కూడా నా మొదటి తెలుగు సినిమా చేస్తున్నానని తెలుసుకున్నప్పుడు చాలా సంతోషంగా ఉంది. సౌత్ సినిమా చేయడానికి ఇది సరైన సమయమని చెప్పిన‌ట్టు గుర్తు చేసుకుంది. ఇది మంచి ప్రాజెక్ట్, గొప్ప సెటప్ ఉన్నాయ‌ని ఆకాంక్ష తెలిపింది.

Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Aliabhatt 
  • Janhvikapoor 
  • Ananyapandey 
  • Khushikapoor 
  • Akansharanjankapoor 
  • Actress 
  • Gorgeouslooks 
  • Stunningclicks 
  • Photoshoot 
  • Phototalk 

Similar News

కాజల్ అగర్వాల్ అభిమానులు హార్ట్!

2026-11-06 19:30 GMT

మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో సారా అర్జున్ ఫ్యాషన్ ట్రీట్!

2026-11-06 18:30 GMT

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS